हिन्दी | Epaper
అఖండ 2 సినిమా కలెక్షన్లు ఎన్ని కోట్లంటే? ఓటీటీలోకి రాజు వెడ్స్ రాంబాయి’ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్ ‘అఖండ 2’ మూవీ రివ్యూ బాక్సాఫీస్ వద్ద సంచలనాలు సృష్టిస్తోన్న ‘అఖండ 2’ కృతి సనన్ పై మహేష్ అభిమానుల ఆగ్రహం… వీకెండ్ బ్లాక్‌బస్టర్ ‘దురంధర్’ ‘అఖండ 2’ విడుదల వాయిదా ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ అఖండ 2 సినిమా కలెక్షన్లు ఎన్ని కోట్లంటే? ఓటీటీలోకి రాజు వెడ్స్ రాంబాయి’ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్ ‘అఖండ 2’ మూవీ రివ్యూ బాక్సాఫీస్ వద్ద సంచలనాలు సృష్టిస్తోన్న ‘అఖండ 2’ కృతి సనన్ పై మహేష్ అభిమానుల ఆగ్రహం… వీకెండ్ బ్లాక్‌బస్టర్ ‘దురంధర్’ ‘అఖండ 2’ విడుదల వాయిదా ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ అఖండ 2 సినిమా కలెక్షన్లు ఎన్ని కోట్లంటే? ఓటీటీలోకి రాజు వెడ్స్ రాంబాయి’ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్ ‘అఖండ 2’ మూవీ రివ్యూ బాక్సాఫీస్ వద్ద సంచలనాలు సృష్టిస్తోన్న ‘అఖండ 2’ కృతి సనన్ పై మహేష్ అభిమానుల ఆగ్రహం… వీకెండ్ బ్లాక్‌బస్టర్ ‘దురంధర్’ ‘అఖండ 2’ విడుదల వాయిదా ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ అఖండ 2 సినిమా కలెక్షన్లు ఎన్ని కోట్లంటే? ఓటీటీలోకి రాజు వెడ్స్ రాంబాయి’ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్ ‘అఖండ 2’ మూవీ రివ్యూ బాక్సాఫీస్ వద్ద సంచలనాలు సృష్టిస్తోన్న ‘అఖండ 2’ కృతి సనన్ పై మహేష్ అభిమానుల ఆగ్రహం… వీకెండ్ బ్లాక్‌బస్టర్ ‘దురంధర్’ ‘అఖండ 2’ విడుదల వాయిదా ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్

Anurag Kashyap: ఈ ఏడాది ఐదు సినిమాలు డైరెక్ట్ చేయబోతున్నా:అనురాగ్ క‌శ్య‌ప్

Anusha
Anurag Kashyap: ఈ ఏడాది ఐదు సినిమాలు డైరెక్ట్ చేయబోతున్నా:అనురాగ్ క‌శ్య‌ప్

బాలీవుడ్ ద‌ర్శ‌కుడు అనురాగ్ క‌శ్య‌ప్ సామ‌జిక స‌మ‌స్య‌ల‌తో పాటు త‌న‌కు న‌చ్చిన సినిమాలు, న‌చ్చ‌ని సినిమాల‌పై స్పందిస్తుంటాడు. రీసెంట్‌గా ఫూలే సినిమా విడుద‌ల‌ను బ్రాహ్మ‌ణ స‌మాజం అడ్డుకుంటుంద‌ని తెలిసి దానిపై త‌న గొంతును వినిపించాడు.అనురాగ్ క‌శ్య‌ప్ తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలలో ఈ మూవీ వివాదంపై స్పందిస్తూ నా జీవితంలో మొద‌టి నాట‌కం మహాత్మా జ్యోతి రావు ఫూలే, సావిత్రి బాయి ఫూలేల‌పైనే చేశాను. ఈ దేశంలో కులవాదం లేకపోతే వారిద్ద‌రూ ఎందుకు పోరాడాల్సి వచ్చింది? ఇప్పుడున్న బ్రాహ్మణులు సిగ్గుపడుతున్నారా లేదా సిగ్గుతో చచ్చిపోతున్నారా లేదా మనం చూడలేని వేరే బ్రాహ్మణుడు భారతదేశంలో నివసిస్తున్నాడా దయచేసి ఎవరైనా వివరించండి – ఇక్కడ నిజమైన మూర్ఖుడు ఎవర‌ని పోస్ట్ పెట్టాడు.

మోసపూరితమైనది

ఇంకొక పోస్ట్ లో సెన్సార్ బోర్డ్‌ను మోసపూరిత వ్యవస్థగా అభివర్ణించారు. ఒక సినిమా సెన్సార్‌కు వెళ్లినప్పుడు బోర్డులో నలుగురు సభ్యులు ఉంటారు. ఈ సినిమాను సెన్సార్ చూసిన అనంత‌రం అందులో ఇలాంటి సన్నివేశాలు ఉన్నాయ‌ని బ‌య‌టివారికి ఎలా తెలుస్తుంది. బ‌య‌టివారు ఈ సినిమాను అడ్డుకోవాల‌ని ఎలా చెబుతున్నారు. ఇది సెన్సార్‌లోని స‌భ్యులు అనుమతిస్తేనే ఇలాంటివి జ‌రుగుతున్నాయి. ఈ మొత్తం వ్యవస్థ పూర్తిగా మోసపూరితమైనదిగా మారిందని తెలిపారు. కులవాదంని బయటపెట్టే సినిమాలను ఉద్దేశపూర్వకంగా ప్ర‌భుత్వం అడ్డుకుంటుంద‌ని ఆరోపించారు. వారు (ప్ర‌భుత్వం) దేని గురించి బాధపడుతుందో బహిరంగంగా చెప్పడానికి కూడా సిగ్గుపడుతుంది. పిరికివాళ్ళు అని విమర్శించారు.

కౌంట‌ర్

అయితే ఇటీవ‌ల అనురాగ్ ముంబై నుంచి త‌న మ‌కాంను బెంగ‌ళూరుకి మార్చిన సంగతి తెలిసిందే. బాలీవుడ్‌లో క్రియేటివిటి లేద‌ని అక్క‌డ విసుగుపుట్టి సౌత్ ఇండ‌స్ట్రీకి వ‌చ్చాన‌ని ఒక ఇంట‌ర్వ్యూలో చెప్పుకోచ్చాడు. అయితే తాజాగా సోష‌ల్ మీడియాలో అనురాగ్ కశ్యప్ సినిమాలు మానేస్తున్నారనే పుకార్లు వైర‌ల్ అయ్యాయి. దీనిపై తాజాగా గ‌ట్టి కౌంట‌ర్ ఇచ్చాడు అనురాగ్.నేను సినిమాలు వదిలేశావ్ అనుకున్న వాళ్ళందరికీ ఒక్క‌టే స‌మాధానం. నేను నగరాలు మారాను కానీ సినిమాలు తీయడం మానలేదు. నేను నిరాశ చెంది వెళ్లిపోయానని అనుకునే వారందరికీ – నేను ఇక్కడే ఉన్నాను, షారుఖ్ ఖాన్ కంటే బిజీగా ఉన్నాను. 2028 వరకు నా డేట్స్ ఖాళీ లేవు. ఈ ఏడాది ఐదు సినిమాలు డైరెక్ట్ చేయబోతున్నాను, ఇప్పుడు మూడు, రెండు వచ్చే ఏడాది మొదట్లో విడుదల కావచ్చు. నాకు మంచి ఐఎమ్ డిబి ఉంది, రోజుకు మూడు ప్రాజెక్ట్‌లకు నో చెప్పేంత బిజీగా ఉన్నాను. కాబట్టి దయచేసి మీ పని మీరు చూసుకోండి” అంటూ తీవ్ర పదజాలంతో వ్యాఖ్యానించారు.

Read Also: Shivangi Movie: ‘శివంగి’ మూవీ రివ్యూ

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870