📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

Hyderabad: డబుల్ ధమాకా ఒకే కార్డుతో ఆర్టీసీ,మెట్రో ప్రయాణం..

Author Icon By Anusha
Updated: April 5, 2025 • 2:55 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

హైదరాబాద్ నగర ప్రజల కోసం రవాణా వ్యవస్థలో ఒక కీలక ముందడుగు వేస్తున్నారు. త్వరలో ‘టి -ఎంఏఏఎస్’ (తెలంగాణ మొబిలిటీ యాస్ ఏ సర్వీస్) అనే స్మార్ట్ కార్డ్‌ను ప్రవేశపెట్టనున్నారు. ఈ కార్డు ద్వారా ఆర్టీసీ బస్సులు, మెట్రో రైలు సేవలను ఉపయోగించుకోవచ్చు.ప్రయాణికులకు టికెట్ కొనుగోలు సమస్యలను తొలగించి సులభతరం చేయడం కోసం, తెలంగాణ ప్రభుత్వం ఈ కొత్త సదుపాయాన్ని అందిస్తోంది.

డిజిటల్ చెల్లింపులు

హైదరాబాద్ ఆర్టీసీ బస్సుల్లో డిజిటల్ చెల్లింపుల కోసం ‘ (ఐ-టిఐఎంఏఏఎస్ ) ను 2,800 సిటీ బస్సుల్లో ఏర్పాటు చేస్తున్నారు.హైదరాబాద్ మెట్రో రైలులో ఇప్పటికే స్మార్ట్ కార్డులను ఉపయోగిస్తున్నారు. ఇప్పుడు ఈ కొత్త టి -ఎంఏఏఎస్ కార్డుతో మెట్రో, బస్సుల్లో ప్రయాణం చేయవచ్చు. ఆర్టీసీ బస్సుల్లో ట్యాప్ మెషీన్లను ఏర్పాటు చేయడం ద్వారా ఈ కార్డులను రెండు రవాణా వ్యవస్థల్లో ఉపయోగించవచ్చు.

రవాణా వ్యవస్థ

హైదరాబాద్ నగర ప్రజా రవాణా వ్యవస్థను మెరుగుపరిచేందుకు హెచ్ యూఎంటిఏ (హైదరాబాద్ యూనిఫైడ్ మెట్రోపాలిటన్ ట్రాన్స్‌పోర్ట్ అథారిటీ) ఈ కార్యక్రమాన్ని చేపట్టింది. దాదాపు 25 లక్షల ఆర్టీసీ ప్రయాణికులను, 5 లక్షల మెట్రో రైలు ప్రయాణికులను ఒకే వ్యవస్థ కిందకు తీసుకురావాలని టార్గెట్‌గా పెట్టుకున్నారు. ఈ మేరకు ప్రస్తుతం మెట్రో, ఆర్టీసీ అధికారులతో చర్చలు జరుగుతున్నాయని హెచ్ యూఎంటిఏకు చెందిన ఓ సీనియర్ అధికారి తెలిపారు. హైదరాబాద్ మెట్రో రైల్ సంస్థ తమ గ్రీన్ కార్డులను టిఐఎంఏఏఎస్ కార్డులతో అనుసంధానం చేయడానికి అంగీకరించిందని వెల్లడించారు.

బ్యాలెన్స్ టాప్

బస్సుల్లో ట్యాప్ మెషీన్లను ఏర్పాటు చేయడానికి ఆర్టీసీ కూడా అంగీకరించిందన్నారు. ఈ కార్డులు మెట్రో కార్డుల మాదిరిగానే పనిచేస్తాయని చెప్పారు. యూపీఐ ద్వారా బ్యాలెన్స్ టాప్ అప్ చేసుకోవచ్చునని అన్నారు. ఈ వ్యవస్థ అందుబాటులోకి వచ్చిన తర్వాత మెట్రో స్టేషన్లు, ఆర్టీసీ కౌంటర్లలో ఈ కార్డులు లభిస్తాయని తెలిపారు. క్యూలైనల్లో వేచి ఉండాల్సిన పని లేకుండా ఫోన్ పే, గూగుల్ పే వంటి వాటి ద్వారా రీఛార్జ్ చేసుకోవచ్చునని అన్నారు.

కామన్ కార్డు

ఈ కామన్ కార్డులను అందుబాటులోకి తీసుకురావాలని ఎప్పట్నుంచో ప్రణాళికలు రచిస్తున్నారు. ఆర్టీసీ, ఎంఎంటీఎస్, మెట్రో సర్వీసుల్లో ఒకే కార్డు ద్వారా ప్రయాణాలు సాగించేలా కామన్ కార్డును తీసుకురావాలని భావించారు. ప్రస్తుతానికి రైల్వే అధికారులు ఎంఎంటీఎస్ ట్రైన్లలో ఈ విధానాన్ని ప్రవేశపెట్టడానికి సిద్ధంగా లేరని తెలిసింది. కరోనా తరువాత ఎంఎంటీఎస్ ట్రైన్లలో ప్రయాణించే వారి సంఖ్య తగ్గింది. చాలామంది మెట్రోలో ప్రయాణిస్తున్నారు. మహిళలు ఉచిత బస్సు సర్వీసులను ఎంచుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతానికి బస్సులు, మెట్రోల్లో కార్డులను ప్రవేశపెట్టాలని భావిస్తున్నారు.

#HyderabadTransport #MetroAndBus #PublicTransport #SmartCard #TMaasCard #UnifiedTransportSystem Ap News in Telugu Breaking News in Telugu Google news Google News in Telugu Latest News in Telugu Paper Telugu News Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today Today news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.