తెలుగు రాష్ట్రాల్లో చర్చకు దారితీసిన బెట్టింగ్ యాప్‌లు ఇప్పుడు మరో వివాదానికి దారితీసాయి. ఇప్పటికే సినీ సెలెబ్రిటీలు, యూట్యూబర్లు దీనివల్ల ఇబ్బందులు ఎదుర్కొంటుండగా, తాజాగా హైదరాబాద్ మెట్రో సంస్థపై పిల్ దాఖలైంది.ప్రజా రవాణా కోసం ఎంతో మంది రోజూ ఉపయోగించే మెట్రో రైలు. అలాంటి సంస్థలో చట్టవిరుద్ధమైన యాప్‌ల ప్రచారాలు సాగుతున్నాయంటే, అది ఆందోళనకరమే. న్యాయవాది నాగూర్‌బాబు దీనిపై తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు.ఈ పిటిషన్‌లో కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర సీఎస్, డీజీపీ, మెట్రో ఎండీతో పాటు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED)ను కూడా జాబితాలో చేర్చారు. ఈ విషయంపై విచారణ జరిపిన హైకోర్టు, తదుపరి విచారణను ఈ నెల 24కి వాయిదా వేసింది.
బెట్టింగ్ యాప్‌లు యువత జీవితం నాశనం చేస్తున్నాయా?
ఈ యాప్‌లు వల్ల ఎంతో మంది యువత ఆర్థికంగా చితికిపోయారు. కొందరు అప్పుల బాధతో ఆత్మహత్యల దాకా వెళ్లారు. ఈ నేపథ్యంలో యాప్‌లపై, వాటిని ప్రోత్సహించేవారిపై చర్యలు తీసుకోవాలన్న డిమాండ్ పెరుగుతోంది.
ప్రచారాల్లో సినీ ప్రముఖులు, యూట్యూబర్లు… కేసులు నమోదు
ఇప్పటికే ఈ వ్యవహారంపై పలువురు సెలెబ్రిటీలు, సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లపై కేసులు నమోదు అయ్యాయి. కొందరిని పోలీసులు విచారించగా, మరికొందరికి నోటీసులు అందాయి.ప్రభుత్వ ప్రాజెక్టుగా ఉండే మెట్రోలో ఇలాంటి యాప్‌ల ప్రచారం ఉండడమే తప్పని ప్రజలు అంటున్నారు. “ఇది ప్రజా నిధులతో నడిచే వ్యవస్థ. అందులో చట్టవిరుద్ధ యాప్‌లకు చోటుండటమా?” అంటూ పలువురు నెటిజన్లు మండిపడుతున్నారు.న్యాయస్థానం ఎలా స్పందిస్తుందో, ఎలాంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాలి. అయితే, ప్రజల్లో మాత్రం నిరసన గళం పెరుగుతూనే ఉంది.
Read Also : KTR : పోలీసు పేర్లు రాసి పెట్టుకుంటాం : కేటీఆర్ హెచ్చరిక