📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

మేడారం జాతర లో ప్రసాదంగా ఇప్పపువ్వు లడ్డు నేటి నుంచి గుజరాత్లో ప్రధాని మోదీ పర్యటన సాంబా సెక్టార్‌లోకి పాకిస్థాన్ డ్రోన్ త్వరలో జాబ్ క్యాలెండర్ ప్రకటన.. నిరుద్యోగులకు భరోసా సీసీటీవీలో నిఖిత హత్య దృశ్యాలు పోలీసు శాఖకు కొత్త రూపు ఆర్టీసీ ఉద్యోగులకు హైకోర్టులో ఊరట సర్కారీ ఉద్యోగులకు1.02 కోట్ల ప్రమాద బీమా చైనా కంపెనీలపై ఆంక్షల ఎత్తివేతకు కేంద్రం యోచన! సంక్రాంతి ఎందుకు జరుపుకుంటారు? 12 రోజుల పండుగ పూర్తి కథనం ఫిబ్రవరి 8 నుంచి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు రేపే పిఎస్ఎల్వి-సి62 ప్రయోగానికి కౌంటౌన్ ఈరోజు బంగారం ధరలు మేడారం జాతర లో ప్రసాదంగా ఇప్పపువ్వు లడ్డు నేటి నుంచి గుజరాత్లో ప్రధాని మోదీ పర్యటన సాంబా సెక్టార్‌లోకి పాకిస్థాన్ డ్రోన్ త్వరలో జాబ్ క్యాలెండర్ ప్రకటన.. నిరుద్యోగులకు భరోసా సీసీటీవీలో నిఖిత హత్య దృశ్యాలు పోలీసు శాఖకు కొత్త రూపు ఆర్టీసీ ఉద్యోగులకు హైకోర్టులో ఊరట సర్కారీ ఉద్యోగులకు1.02 కోట్ల ప్రమాద బీమా చైనా కంపెనీలపై ఆంక్షల ఎత్తివేతకు కేంద్రం యోచన! సంక్రాంతి ఎందుకు జరుపుకుంటారు? 12 రోజుల పండుగ పూర్తి కథనం ఫిబ్రవరి 8 నుంచి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు రేపే పిఎస్ఎల్వి-సి62 ప్రయోగానికి కౌంటౌన్ ఈరోజు బంగారం ధరలు

Hyderabad : మత్తు డ్రగ్స్ వినియోగం – మైనర్ మృతి

Author Icon By Digital
Updated: April 22, 2025 • 3:59 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

Hyderabad : మత్తు కోసం మెడికల్ డ్రగ్స్ వాడకం – మైనర్ మృతి, ఇద్దరు ఆసుపత్రిలో చికిత్స

హైదరాబాద్ (సరూర్ నగర్): మత్తు కోసం మెడికల్ షాపుల్లో విక్రయించే ఔషధాలను అధిక మోతాదులో తీసుకోవడం ఓ మైనర్ బాలుడి ప్రాణాలను హరించింది. మరో ఇద్దరు వ్యక్తులు ఆసుపత్రి పాలయ్యారు. ఈ ఘటన హైదరాబాద్ నగర శివార్లలోని బాలాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఈ మత్తు బాధితులలో మృతుడు మైనర్ కావడం కలకలం రేపింది. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నవారిలో మరో మైనర్ బాలుడు, ఓ యువకుడు ఉన్నారు.బాధితులు బాలాపూర్ రాయల్ కాలనీకి చెందిన షాబాజ్ (22), సుల్తాన్‌పూర్ టౌన్‌షిప్‌కు చెందిన మైనర్ బాలుడు, కొత్తపేటకు చెందిన మరో మైనర్ బాలుడు. వీరిద్దరూ స్నేహితులుగా ఉండి, మత్తుకు బానిసలుగా మారారు. వారు మెడికల్ షాపుల నుండి టాబ్లెట్లు, ఇంజెక్షన్ల రూపంలో మెడికల్ డ్రగ్స్‌ను ప్రిస్క్రిప్షన్ లేకుండా కొనుగోలు చేసి వినియోగిస్తున్నారు. మూడు రోజుల క్రితం ఇదే తరహాలో మత్తుకు ఉపయోగించే ఔషధాలను ఒక నిర్జన ప్రాంతంలో తీసుకొని అపస్మారక స్థితిలోకి వెళ్లారు.ఈ ఘటన తెలుసుకున్న స్థానికులు వెంటనే ముగ్గురినీ ఆసుపత్రికి తరలించారు. అయితే చికిత్స పొందుతూ మైనర్ బాలుడు ఉస్మానియా ఆసుపత్రిలో ఆదివారం రాత్రి మృతి చెందాడు. మిగిలిన ఇద్దరు ప్రస్తుతం పినాల్‌బండలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

Hyderabad : మత్తు డ్రగ్స్ వినియోగం – మైనర్ మృతి


ప్రిస్క్రిప్షన్ లేకుండానే మందుల విక్రయం – సమాజంపై ప్రమాదకర ప్రభావం

మృత బాలుడి తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు బాలాపూర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. విచారణలో బాలాపూర్ షాహిన్నగర్‌కు చెందిన సాహిల్ అనే వ్యక్తి ఈ మెడికల్ డ్రగ్స్‌ను బాధితులకు విక్రయించినట్లు తేలింది. దీంతో పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు.ఈ ఘటన మెడికల్ షాపుల్లో ప్రిస్క్రిప్షన్ లేకుండా మందుల విక్రయంపై అనేక ప్రశ్నలను రేపుతోంది. ఇటువంటి ఉదంతాలు నివారించేందుకు సంబంధిత అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని సామాజిక వర్గాలు డిమాండ్ చేస్తున్నాయి.

Read More : Madhira : 2,325 మందికి ఉద్యోగ పత్రాలు

Breaking News in Telugu Drug Overdose Google news Google News in Telugu Hospitalised Youths Hyderabad Drugs Case Latest News in Telugu Medical Drugs Abuse Minor Death Paper Telugu News Telangana Crime News Telugu News Telugu News online Telugu News Today

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.