📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ట్రాన్స్‌జెండర్‌లకు మెట్రో స్టేషన్లలో కొత్త ఉపాధి అవకాశాలు టెట్ కు 2,37,754 దరఖాస్తులు వేధిస్తున్నాడని భర్తను చంపిన భార్య యూరియా కొరత లేకుండా యాసంగి GHMCలో 27 మున్సిపాలిటీల విలీనం‌ నేడు రూ.5 వేల కోట్ల రుణం సమీకరణ ఘోర ప్రమాదం.. భయానక ఫొటో వృద్ధులకు ప్రత్యేక వైద్య సేవలు ఎమ్మెల్యేల అనర్హతపై వేగంగా విచారణ రాష్ట్రంలో కుంకుమ పువ్వు సాగు ట్రాన్స్‌జెండర్‌లకు మెట్రో స్టేషన్లలో కొత్త ఉపాధి అవకాశాలు టెట్ కు 2,37,754 దరఖాస్తులు వేధిస్తున్నాడని భర్తను చంపిన భార్య యూరియా కొరత లేకుండా యాసంగి GHMCలో 27 మున్సిపాలిటీల విలీనం‌ నేడు రూ.5 వేల కోట్ల రుణం సమీకరణ ఘోర ప్రమాదం.. భయానక ఫొటో వృద్ధులకు ప్రత్యేక వైద్య సేవలు ఎమ్మెల్యేల అనర్హతపై వేగంగా విచారణ రాష్ట్రంలో కుంకుమ పువ్వు సాగు

Hyderabad: అమెజాన్‌ ఎట్‌హోమ్‌ డయాగ్నోస్టిక్స్‌ హైదరాబాద్‌లో

Author Icon By Anusha
Updated: June 23, 2025 • 5:41 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఆన్‌లైన్‌ షాపింగ్‌ దిగ్గజం అమెజాన్‌ ఇండియా, ఆరోగ్యరంగంలో మరో అడుగు వేసింది. హైదరాబాద్‌ సహా ఆరు ప్రధాన నగరాల్లో ఇంటివద్ద నుంచే డయాగ్నోస్టిక్స్‌ సేవలను (Diagnostics services) ప్రారంభించినట్టు ఆదివారం రోజున అధికారికంగా ప్రకటించింది. కొన్ని లక్షల మంది వినియోగదారులకు ప్రతిరోజూ సేవలు అందిస్తున్న అమెజాన్‌, ఇప్పుడు ఆరోగ్య పరీక్షల సేవలను సైతం ఇంటివద్దకే తీసుకురావడం విశేషం. వినియోగదారులు ఇకపై అమెజాన్‌ యాప్‌ లేదా వెబ్‌సైట్‌ ద్వారా హాస్పిటల్‌కు వెళ్లకుండానే ల్యాబ్‌ టెస్ట్‌లను బుక్ చేయవచ్చు, అపాయింట్‌మెంట్స్‌ను షెడ్యూల్ చేయవచ్చు, రిపోర్ట్‌లను డిజిటల్ రూపంలో పొందవచ్చు.

ఆరోగ్య పరీక్షలు

అమెజాన్‌ ప్రకటన ప్రకారం, ఈ సేవల్లో భాగంగా రక్త పరీక్షలు, యూరిన్‌ పరీక్షలు, పూర్తి ఆరోగ్య పరీక్షలు వంటి అనేక రకాల డయాగ్నోస్టిక్స్‌ టెస్ట్‌లు అందుబాటులో ఉంటాయి. వినియోగదారుల ఇంటికే సాంకేతిక నిపుణులు వచ్చి సాంపిల్స్‌ తీసుకుంటారు.ఇది కేవలం ఓ సేవ ప్రారంభం మాత్రమే కాదు, భారతదేశంలో డిజిటల్ హెల్త్‌కేర్ (Digital Healthcare) విప్లవానికి తొలి అడుగుగా చెప్తున్నారు నిపుణులు. ఇకపై ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలంటే ఆసుపత్రి, ల్యాబ్‌ల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు. ఇంటివద్ద నుంచే సేవలు పొందండి ఆరోగ్యంగా ఉండండి.

Hyderabad

అనుసంధానం చేస్తున్నట్టు

ఈ సేవల్ని ఆరెంజ్‌ హెల్త్‌ ల్యాబ్స్‌తో కలిపి బెంగళూరు, ఢిల్లీ, గురుగ్రామ్‌, నోయిడా, ముంబై, హైదరాబాద్‌ నగరాల్లో ఈ సేవల్ని తీసుకొస్తున్నట్టు అమెజాన్‌ (Amazon) ఒక ప్రకటనలో తెలిపింది. అమెజాన్‌ మెడికల్‌ ద్వారా కంపెనీ తన ఫార్మసీ, క్లినికల్‌ సేవల్ని (Clinical services) అనుసంధానం చేస్తున్నట్టు ప్రకటించింది. ప్రైమ్‌, నాన్‌-ప్రైమ్‌ మెంబర్స్‌ అందరూ టెలీమెడిసిన్‌ కన్సల్టేషన్‌ సర్వీస్‌, డెలివరీ బెనిఫిట్స్‌ పొందవచ్చునని పేర్కొన్నది. అమెజాన్‌ క్లినిక్‌ ద్వారా కస్టమర్లు లైసెన్స్‌డ్‌ డాక్టర్ల ద్వారా ప్రాథమిక వైద్య చికిత్సలను అందుకోవచ్చునని తెలిపింది.

Read Also: Bhatti : నాన్ టాక్స్ రెవెన్యూ ఆదాయాలు పెంచండి – భట్టి

#AmazonDiagnostics #AtHomeLabTests #HealthAtHome #HomeDiagnostics Ap News in Telugu Breaking News in Telugu Google News in Telugu Latest News in Telugu Paper Telugu News Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today Today news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.