📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం

Eatala Rajendar: సీఎం రేవంత్ రెడ్డిపై ఈటల రాజేందర్ కీలక వ్యాఖ్యలు

Author Icon By Anusha
Updated: May 11, 2025 • 6:02 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ తెలంగాణ ప్రభుత్వం, సీఎం రేవంత్ రెడ్డిపై మరోసారి తీవ్రస్థాయిలో ఫైరయ్యారు. ఈ ప్రభుత్వానికి తల తోక లేనిదని ఎక్కువ రోజులు రేవంత్ సర్కార్ కొనసాగదని సంచలన కామెంట్స్ చేశారు. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా(Malkajgiri District) బాచుపల్లిలోని పూజిత అపార్ట్‌మెంట్ నివాసులకు హైడ్రా నోటీసులు జారీ చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఆయన బాధితులకు భరోసా కల్పించేందుకు అక్కడికి చేరుకుని మాట్లాడారు.అపార్ట్‌మెంట్‌ను కూల్చివేస్తామని నోటీసులు ఇవ్వడంపై ఆయన తీవ్రస్థాయిలో ఫైరయ్యారు.ఇది తుగ్లక్ ప్రభుత్వం,ముఖ్యమంత్రి రేవంత్ పెద్ద ఒక శాడిస్ట్, సైకో ప్రజల జోలికి వస్తే ఖబర్దార్’ అంటూ ఈటల రాజేందర్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ప్రజలను ఏడిపించడంలోనే సీఎం రేవంత్(CM Revanth)ఆనందం పొందుతున్నారని ఫైరయ్యారు. రాష్ట్రంలో ఇంటిలిజెన్స్ వ్యవస్థ ఉన్నప్పటికీ గ్రౌండ్ రియాలిటీని తెలుసుకోకుండా సీఎం వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు. ముఖ్యమంత్రికి వెనక ఏం జరుగుతుంతో తెలియటం లేదని,ఇప్పటికైనా తెలుసుకోవాలని హితవు పలికారు. వ్యవస్థను సరిదిద్దుకోవాలని సూచించారు.

Eatala Rajendar: సీఎం రేవంత్ రెడ్డిపై ఈటల రాజేందర్ కీలక వ్యాఖ్యలు

పరిపాలన

ప్రజల జీవితాలతో ఆడుకునేవారు ఎవరూ బాగుపడరని ఈటల రాజేందర్ సీఎం రేవంత్ రెడ్డిని శపించారు. కూల్చివేతలపై ఎమ్మార్వో నోటీసులు జారీ చేస్తే కలెక్టర్ తనకు తెలియదని చెప్పడం ఏమిటని ఆయన ప్రశ్నించారు. ప్రజలు అన్ని అనుమతులతో ఇళ్లు నిర్మించుకుంటే అనుమతులు ఇచ్చేటప్పుడు అధికారుల బుద్ధి, జ్ఞానం ఏమైందని నిలదీశారు. ప్రభుత్వం ప్రజల ఇళ్లను కూల్చివేయగలదని కానీ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చడానికి ప్రజలు పగ, కసితో ఎదురుచూస్తున్నారని ఆయన హెచ్చరించారు.గతంలో కూడా ఈటల రాజేందర్ సీఎం రేవంత్ రెడ్డిపై తీవ్ర విమర్శలు చేశారు. ‘రేవంత్ రెడ్డి ఒక జోకర్ ఆయనకు పరిపాలన చేతకాదు’ అని ఆయన తీవ్ర విమర్శలు చేసారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి అనుభవం లేదని వారు ప్రజలను మోసం చేస్తున్నారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయిందని,కాంగ్రెస్ పాలనలో రాష్ట్రం వెనక్కి వెళుతోందని విమర్శించారు. ఇదిలా ఉండగానే తాజాగా ఈటల రాజేందర్ వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపుతున్నాయి.

Read Also : Telangana: సోషల్ మీడియాలోవ్యూస్, లైక్స్ కోసం ప్రాణాలను పణంగా పెట్టొద్దు: సజ్జనార్

#BachupallyDemolition #CongressGovernment #EtelaRajender #HyderabadNews #TughlaqRule Ap News in Telugu Breaking News in Telugu Google news Google News in Telugu Latest News in Telugu Paper Telugu News Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today Today news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.