హైదరాబాద్‌లోని బంజారాహిల్స్ రోడ్ నెం.12 లో రాత్రి వేళ ఓ యువతి మద్యం మత్తులో సృష్టించిన హంగామా స్థానికులను తీవ్ర ఆందోళనకు గురి చేసింది. ఈ సంఘటన శ్రీరాంనగర్ కాలనీలో చోటుచేసుకోగా, పక్కింటి వారితో జరిగిన వాగ్వాదం చివరకు పోలీస్ స్టేషన్ వరకు దారి తీసింది.వివరాల్లోకి వెళితే, శ్రీరాంనగర్‌లో నివాసం ఉండే అలిస్ జోసెఫ్ (Alice Joseph) (26) అనే యువతి గతంలో ఓ ప్రైవేటు సంస్థలో అకౌంటెంట్‌గా పనిచేసేది. ప్రస్తుతం ఆమె ఉద్యోగ రహితంగా ఉండగా, మరో ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నట్టు సమాచారం.అర్ధరాత్రి 2 గంటల సమయంలో, మద్యం సేవించి ఇంటికి తిరిగిన అలిస్, అపార్ట్‌మెంట్‌లో పక్కనే నివసించే నేహా థాపా అనే బెంగాల్‌కు చెందిన యువతితో గొడవకు దిగింది.
పోలీసులపై దుర్భాషలాడింది
దాదాపు అరగంట పాటు మద్యం మత్తులో ఆమె హంగామా చేయడంతో పాటు డయల్ 100కు ఫోన్ చేసి తన పక్కింటి ఫ్లాట్‌లో గంజాయి అమ్ముతున్నారని ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని నేహా ఫ్లాట్ (Neha’s flat) లో సోదాలు నిర్వహించారు. అయితే నేహా నివాసంలో గంజాయి ఆనవాళ్లు ఏమీ లభించలేదు. అప్పటికే మద్యం మత్తులో ఉన్న అలిస్ జోసెఫ్ పోలీసులపై దుర్భాషలాడింది.పోలీసులు అక్కడే ఉండగా, ఆమె తన ఫ్లాట్‌లోకి వెళ్లి తలుపు గడియ పెట్టుకుని గ్యాస్ ఓపెన్ చేసి నిప్పు వెలిగించింది. దీంతో కిచెన్‌లో మంటలు చెలరేగాయి. బయట ఉన్న పోలీసులు, ఇంటి యజమాని, స్థానికులు కలిసి అలిస్ జోసెఫ్ ఫ్లాట్ తలుపులు బద్దలు కొట్టి లోపలికి వెళ్లి మంటలను అదుపు చేశారు.
కేసు నమోదు
నిందితురాలు అలిస్ జోసెఫ్‌కు పోలీసులు బ్రీత్ అనలైజర్ పరీక్షలు చేయగా, ఆమె మోతాదుకు మించి మద్యం సేవించినట్లు తేలింది. ఈ ఘటనపై నేహా థాపా ఫిర్యాదు మేరకు పలు సెక్షన్ల కింద అలిస్ జోసెఫ్‌పై పోలీసులు కేసు (Case File) నమోదు చేశారు. ఆమెను అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు తరలించారు.ఇతర నివాసితులు ఈ ఘటనపై ఆందోళన వ్యక్తం చేశారు. “ఇలాంటి ఘటనలు మా భద్రతపై ప్రభావం చూపుతాయి. అపార్ట్‌మెంట్‌లో నివసించే వారందరూ సురక్షితంగా ఉండేలా చర్యలు తీసుకోవాలి,” అని వారు కోరారు.
Read Also: Medak: కోర్టు భవనంపై నుంచి దూకిన ఫ్యామిలీ ఎందుకంటే?