📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం

Adluri Lakshman: అన్ని స్కూళ్లల్లో ‘బెస్ట్ అవైలబుల్ స్కూల్’ అమలు చేయాలి

Author Icon By Anusha
Updated: July 2, 2025 • 10:30 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

హైదరాబాద్ : రాష్ట్రంలోని అన్ని ప్రైవేటు, కార్పొరేట్ స్కూల్స్ లోనూ బెస్ట్ అవలబుల్ స్కూల్ పథకం అమలు చేయాలని ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, దివ్యాంగుల సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ అన్నారు. గురుకులాలకు ఏప్రిల్ వరకు ఉన్న పెండింగ్ బిల్లులన్నింటినీ క్లియర్ చేశామన్నారు. విద్యార్థుల తల్లిదండ్రులు ఎవరూ ఆందోళన చెందా ల్సిన అవసరం లేదని ఈ ప్రభుత్వం ఏప్రిల్ వరకు ఉన్న పెండింగ్ బిల్లులను క్లియర్ చేశాం. ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ దివ్యాంగుల సంక్షేమ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ (Adluri Lakshman) బకాయిలన్నింటిని చెల్లిం చిందని మంత్రి స్పష్టం చేశారు. మంగళవారం ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క గురుకులాల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.

టెండర్లు పిలిచి

అనంతరం సచివాలయంలో మంత్రి అడ్లూరి లక్ష్మణ్, ఎస్సీ గురుకుల సొసైటీ సెక్రటరీ డాక్టర్ విఎస్ అలగు వర్షిణితో కలిసి మీడియాతో మాట్లాడారు. విద్యార్థులకు సంబంధించిన యూనిఫాం, షూస్, బుక్స్ కోసం త్వరలోనే టెండర్లు పిలిచి విద్యార్థులకు అందజేస్తామన్నారు. విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ఇంటిగ్రేడెట్ రెసిడెన్షియల్ స్కూల్స్ (Integrated Residential Schools) తీసుకువస్తున్నామన్నారు. గత పదేళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం మాదిరిగా తమ ప్రభుత్వం చేయడం లేదన్నారు.

Adluri Lakshman:

డైట్, కాస్మోటిక్ చార్జెస్

రాష్ట్రంలోని అన్ని ప్రైవేటు, కార్పొరేట్ స్కూల్స్ బెస్ట్ అవలబుల్ స్కూల్ పథకం కింద 25 శాతం సీట్లు ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు కేటాయించాల్సిందేనన్నారు. కొన్ని కార్పొరేట్ స్కూల్స్ (Corporate Schools) మాత్రమే ఈ సీట్లు ఇస్తున్నాయని మిగతా వాటిలో ఇవ్వడం లేదన్నారు. డైట్, కాస్మోటిక్ చార్జెస్ పెంచి వాటిని చెల్లించడం జరిగిందని సంక్షేమ, గురుకుల, బెస్ట్ అవలబుల్ పాఠశాలల్లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవడం జరిగిందని మంత్రి తెలిపారు. రాబోయే రోజుల్లో విద్యార్థులకు యూనిఫామ్స్ (Uniforms) విషయంలో ఆలస్యం జరగకుండా చూస్తామని మంత్రి స్పష్టం చేశారు.

Read Also: Double Engine: డబులింజిన్ సర్కార్తోనే ఎపి అభివృద్ధి

#BestAvailableSchoolScheme #BhattiVikramarka #CorporateSchools #DisabledWelfare #GovernmentSupport #GurukulamReview #MinorityWelfare #PendingBillsCleared #PrivateSchools #SCWelfare #StudentWelfare #STWelfare #TelanganaEducation Ap News in Telugu Breaking News in Telugu Google news Google News in Telugu Latest News in Telugu Paper Telugu News Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today Today news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.