हिन्दी | Epaper
ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… కాంగ్రెస్ MLA రాహుల్ పై అత్యాచార కేసు నమోదు ఢిల్లీ విద్యార్థి ఆత్మహత్య ఇద్దరు కార్మికులు సజీవ దహనం సీపీ సజ్జనార్‌తో సమావేశమైన సినీ ప్రముఖులు పోలీస్ స్టేషన్‌లో భారీ పేలుడు కోల్‌కతాలో భారీ అగ్నిప్రమాదం.. యువకుడి పై కత్తితో దాడి.. 10 మందిని చంపేసిన నర్సు! ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… కాంగ్రెస్ MLA రాహుల్ పై అత్యాచార కేసు నమోదు ఢిల్లీ విద్యార్థి ఆత్మహత్య ఇద్దరు కార్మికులు సజీవ దహనం సీపీ సజ్జనార్‌తో సమావేశమైన సినీ ప్రముఖులు పోలీస్ స్టేషన్‌లో భారీ పేలుడు కోల్‌కతాలో భారీ అగ్నిప్రమాదం.. యువకుడి పై కత్తితో దాడి.. 10 మందిని చంపేసిన నర్సు! ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… కాంగ్రెస్ MLA రాహుల్ పై అత్యాచార కేసు నమోదు ఢిల్లీ విద్యార్థి ఆత్మహత్య ఇద్దరు కార్మికులు సజీవ దహనం సీపీ సజ్జనార్‌తో సమావేశమైన సినీ ప్రముఖులు పోలీస్ స్టేషన్‌లో భారీ పేలుడు కోల్‌కతాలో భారీ అగ్నిప్రమాదం.. యువకుడి పై కత్తితో దాడి.. 10 మందిని చంపేసిన నర్సు! ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… కాంగ్రెస్ MLA రాహుల్ పై అత్యాచార కేసు నమోదు ఢిల్లీ విద్యార్థి ఆత్మహత్య ఇద్దరు కార్మికులు సజీవ దహనం సీపీ సజ్జనార్‌తో సమావేశమైన సినీ ప్రముఖులు పోలీస్ స్టేషన్‌లో భారీ పేలుడు కోల్‌కతాలో భారీ అగ్నిప్రమాదం.. యువకుడి పై కత్తితో దాడి.. 10 మందిని చంపేసిన నర్సు!

Hyderabad: ఎల్బీనగర్‌లో విద్యుత్ వైర్లు తెగిపడి ఇద్దరు మృతి

Anusha
Hyderabad: ఎల్బీనగర్‌లో విద్యుత్ వైర్లు తెగిపడి ఇద్దరు మృతి

మృత్యువు ఎప్పుడు, ఏ రూపంలో వస్తుందో ఎవరూ ఊహించలేరు. అప్పటివరకు సంతోషంగా, సరదాగా గడిపినవారు హఠాత్తుగా కన్నుమూస్తున్న ఘటనలు అనేకం. రోడ్డు ప్రమాదాల రూపంలో, అకస్మాత్తుగా వచ్చే గుండెపోటు రూపంలో, ఇంకొన్నిసార్లు ప్రకృతి వైపరీత్యాల రూపంలో చాలా మందిని మృత్యువు తన ఒడికి చేర్చుకుంది.తాజాగా హైదరాబాద్ ఎల్బీనగర్‌ (LB Nagar) లో అటువంటి ఘటనే చోటు చేసుకుంది. ఫుట్‌పాత్‌పై నిద్రిస్తున్న దంపతులు అనుకోని ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు.ఇవాళ తెల్లవారుజామున ఒక్కసారిగా 11కేవీ విద్యుత్ తీగలు హైటెన్షన్ విద్యుత్ వైర్లు తెగిపడటంతో నిద్రలోనే కాలిబూడిదయ్యారు.ఈ ప్రమాదంలో వారికి సమీపంలో ఉన్న ఓ వీధి కుక్క కూడా విద్యుదాఘాతంతో మరణించింది. హై ఓల్టేజ్ తీగల ప్రభావంతో మృతదేహాలు పూర్తిగా కాలి, నల్లగా మాడిపోయాయి. మంటలు చెలరేగడం, మృతదేహాలు కాలిపోవడం చూసిన స్థానికులు భయాందోళనలకు గురయ్యారు. వెంటనే పోలీసులు, విద్యుత్ అధికారులకు సమాచారం అందించారు.

స్థలాన్ని పరిశీలించి

సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, విద్యుత్ శాఖ అధికారులు ఘటన స్థలానికి చేరుకున్నారు. పరిస్థితిని సమీక్షించి, యుద్ధప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టారు. వెంటనే విద్యుత్ సరఫరాను నిలిపివేసి, ప్రమాదం జరిగిన ప్రాంతాన్ని మూసివేశారు. క్లూస్ టీం, ఫోరెన్సిక్ నిపుణులు ఘటనా స్థలాన్ని పరిశీలించి ఆధారాలు సేకరించారు. మృతుల వివరాలు ఇంకా పూర్తిగా తెలియాల్సి ఉంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. విద్యుత్ తీగలు తెగిపడటానికి గల కారణాలపై విద్యుత్ అధికారులు (Electricity Authorities) లోతుగా ఆరా తీస్తున్నారు. ప్రాథమిక అంచనాల ప్రకారం విద్యుత్ లైన్ల నిర్వహణ లోపం వల్లే ఈ ప్రమాదం జరిగి ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు.

Hyderabad: ఎల్బీనగర్‌లో విద్యుత్ వైర్లు తెగిపడి ఇద్దరు మృతి
Hyderabad

కఠిన చర్యలు

స్థానికులు ఈ ఘటనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారుల నిర్లక్ష్యం వల్లే ఈ దుర్ఘటన జరిగిందని ఆరోపిస్తున్నారు. రెండు నిండు ప్రాణాలు బలిగొన్న ఈ ప్రమాదానికి బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, బాధిత కుటుంబానికి ప్రభుత్వం తగిన నష్టపరిహారం అందించాలని డిమాండ్ చేస్తున్నారు. భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు పునరావృతం కాకుండా విద్యుత్ శాఖ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, పాతబడిన విద్యుత్ తీగలు, స్తంభాలను వెంటనే మార్చాలని స్థానికులు కోరుతున్నారు.

Read Also: Singareni: సింగరేణిలో ప్లాస్టిక్ నిషేధం..రూల్స్ బ్రేక్ చేస్తే రూ.10 వేల ఫైన్

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870