గత పదేళ్లలో కేసీఆర్‌ ప్రభుత్వం ఎన్ని ఉద్యోగాలు ఇచ్చింది..?: మంత్రి పొన్నం

How many jobs did the KCR government provide in the last ten years?: Minister Ponnam

హైదరాబాద్‌: మంత్రి పొన్నం ప్రభాకర్‌ నేడు గాంధీ భవన్‌లో ‘మంత్రులతో ముఖాముఖి’ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..గత కేసీఆర్‌ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. గత పదేళ్లలో కేసీఆర్‌ సర్కారు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చిందని ప్రశ్నించారు.

ప్రజలు, పార్టీ కార్యకర్తల నుంచి వినతులు స్వీకరించిన అనంతరం ఆయన మాట్లాడారు. తాము చిత్తశుద్ధితో ఉద్యోగాలు భర్తీ చేస్తున్నట్లు చెప్పారు. విద్యార్థులు, నిరుద్యోగులు తమ ప్రభుత్వంపై సంతృప్తిగా ఉన్నారని పేర్కొన్నారు. గత ప్రభుత్వం 150 మందికి మాత్రమే విదేశీ విద్యానిధి ఇచ్చిందని గుర్తు చేశారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం 500 మందికి విదేశీ విద్యానిధి ఇస్తోందని వివరించారు.

ప్రభుత్వంపై మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి వ్యాఖ్యలను పొన్నం ప్రభాకర్‌ ఖండించారు. ”మూసీ నిర్వాసితులకు పునరావాసం కల్పించాకే ఖాళీ చేయిస్తున్నాం. రెండు పడక గదుల ఇళ్లు ఇవ్వడంతో పాటు నిర్వాసితుల పిల్లల విద్యకు చర్యలు తీసుకుంటాం. బీసీ సంక్షేమ శాఖ, బీసీ కమిషన్‌ ఆధ్వర్యంలో ప్రభుత్వ శాఖ ద్వారా కులగణన చేపడతాం” అని పొన్నం ప్రభాకర్‌ తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *