పోలీసుల అదుపులో బోరుగడ్డ అనిల్..

anil

రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియా రాష్ట్ర అధ్యక్షుడు బోరుగడ్డ అనిల్ ను నల్లపాడు పోలీసులు అదుపులోకి తీసుకొని రహస్యంగా విచారిస్తున్నట్టు తెలుస్తోంది. గుంటూరు నగరంలో విద్యాసంస్థలకు చెందిన కర్లపూడి బాబూ ప్రకాశ్‌ను రూ.లక్షల్లో డిమాండ్‌ చేసి ఇవ్వకపోతే చంపుతానని బెదిరింపులకు గురిచేశాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు అనిల్‌పై నల్లపాడు పోలీసులు కేసు నమోదు చేశారు. కొంతకాలంగా అజ్హాతంలో ఉన్న నిందితుడిని బుధవారం నల్లపాడు పోలీసులు అరెస్ట్ చేశారు.

వైసీపి అనుకూల వ్యక్తిగా, జగన్ వీరాభిమానిగా బోరుగడ్డ అనిల్ కు గుర్తింపు ఉంది. గత ప్రభుత్వ హయాంలో విపక్ష నేతలను ఉద్దేశించి బోరుగడ్డ అనిల్ చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టించాయి. పవన్ కల్యాణ్ వంటి నేతలను కూడా ఇష్టంవచ్చినట్టు మాట్లాడిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయినా సంగతి తెలిసిందే. జగన్ ప్రభుత్వంలో బోరుగడ్డ అనిల్ ఆడిందే ఆటగా పాడిందే పాటగా సాగింది. జగన్‌కు అత్యంత సన్నిహితుడిగా సోషల్ మీడియా లో ప్రచారం చేసుకునేవాడు. తన అనుయాయులతో కలిసి రోడ్లపై నానా హంగామా సృష్టించేవాడు. అనిల్‌పై గతంలో పట్టాభిపురం, అరండల్‌పేట సహా పలు స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి. గతంలో నెల్లూరు రూరల్‌ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డికి ఫోన్‌ చేసి జగన్‌ గురించి వ్యతిరేకంగా మాట్లాడుతున్నావని బెదిరింపులకు గురిచేశాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Baby bооmеrѕ, tаkе it from a 91 уеаr оld : a lоng lіfе wіth рооrеr hеаlth іѕ bаd nеwѕ, аnd unnесеѕѕаrу.    lankan t20 league. In this blog post, we'll provide you with 10 effective tips to help you maintain a healthy lifestyle.