Hearing of Vallabhaneni Vamsi bail petition adjourned..!

వల్లభనేని వంశీ బెయిల్ పిటిషన్ విచారణ వాయిదా..!

బెయిల్ పిటిషన్ పై కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశం

అమరావతి: మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత వల్లభనేని వంశీ కస్టడీ, హెల్త్ పిటిషన్లపై ఎస్సీ, ఎస్టీ స్పెషల్ కోర్టు ఇవాళ(శుక్రవారం) విచారణ చేపట్టింది. ఈ తీర్పును సోమవారానికి కోర్టు వాయిదా వేసింది. అలాగే వంశీ బెయిల్ పిటిషన్‌ను కూడా మంగళవారానికి న్యాయస్థానం వాయిదా వేసింది. పోలీసులు కౌంటర్ దాఖలు చేయడం కోసం సమయం కోరడంతో వంశీ బెయిల్ పిటిషన్‌ను ఎస్సీ , ఎస్టీ స్పెషల్ కోర్టు వాయిదా వేసింది.

Advertisements
image

కస్టడీ కోసం పిటీషన్..

కాగా.. ప్రస్తుతం జైల్లో ఉన్న వంశీని పదిరోజుల పాటు కస్టడీకి ఇవ్వాలంటూ పోలీసులు వేసిన పిటిషన్‌పై ఎస్సీ, ఎస్టీ కోర్టులో విచారణ జరిగిన విషయం తెలిసిందే. సత్యవర్ధన్‌ కిడ్నాప్‌ కేసులో మరింత లోతుగా దర్యాప్తు చేయడానికి వంశీని కస్టడీలో విచారించాల్సిన అవసరం ఉందని.. సీన్ రీకన్‌స్ట్రక్షన్ చేయాల్సి ఉందని పోలీసులు కోర్టుకు విన్నవించారు. అయితే సీన్ రీకన్‌స్ట్రక్షన్ అవసరం లేదని వంశీ తరపు లాయర్ వాదించారు. సత్యవర్ధన్ బయటే ఉన్నందున అతడిని విచారిస్తే సరిపోతుందని ఆయన అన్నారు. ఇరువురి వాదనలు విన్న కోర్టు తదుపరి విచారణను నేటికి వాయిదా వేసింది.

బెయిల్ నిరాకరణ..

గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో వంశీకి బెయిల్ ఇచ్చేందుకు న్యాయస్థానం నిరాకరించింది. ముందుస్తు బెయిల్ కోరుతూ వంశీ దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు ధర్మాసనం కొట్టివేసింది. ఎస్సీ, ఎస్టీ కోర్టును ఆశ్రయించాలని న్యాయస్థానం సూచించింది. ఇదే కేసులో గతంలో 36 మందికి ముందస్తు బెయిల్ ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరించిన విషయం తెలిసిందే. ఆ తర్వాత వారంతా విజయవాడలోని ఎస్సీ, ఎస్టీ కోర్టును ఆశ్రయించారు. అక్కడ కూడా ఈ 36 మందికి ఎదురుదెబ్బే తగిలింది. వీరికి ముందస్తు బెయిల్ ఇచ్చేందుకు ఎస్సీ, ఎస్టీ కోర్టు కూడా నిరాకరించింది. తాజాగా వంశీకి కూడా ముందస్తు బెయిల్ ఇచ్చేందుకు హైకోర్టుకు నిరాకరిచింది.

Related Posts
వైకుంఠ ద్వార దర్శనాలకు టీటీడీ కీలక సూచనలు
ttd meeting

త్వరలో జరగనున్న వైకుంఠ ద్వార దర్శనాలకు టీటీడీ పలు కీలక సూచనలు చేసింది. జనవరి 10 నుంచి 19వ తేది వరకు వైకుంఠ ద్వార దర్శనాలకు వచ్చే Read more

New brand: అందుబాటులోకి మద్యం కొత్త బ్రాండ్
New brand: అందుబాటులోకి మద్యం కొత్త బ్రాండ్

మద్యం ప్రియులకు పండుగ వాతావరణం తెలుగు రాష్ట్రాల్లో మద్యం ప్రియులకు ఇది పండుగ వాతావరణమే. 2024-25లో మద్యం అమ్మకాలు రికార్డు స్థాయిలో నమోదవడంతో, ఈ ఏడాది ఆ Read more

రెపోరేటు తగ్గింపుతో మీ EMI ఎంత తగ్గుతుందో తెలుసా..?
Home loan repo down

బ్యాంకింగ్ రంగంలో కీలకమైన పరిణామంగా రిపో రేట్ తగ్గింపు వల్ల రుణ గ్రహీతలకు అనేక ప్రయోజనాలు అందనున్నాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) తాజా నిర్ణయంలో Read more

అభిమానులకు భోజనం ఏర్పాటు చేసిన రామ్ చరణ్
charan food

గేమ్ ఛేంజర్ విడుదల సందర్భంగా హీరో రామ్ చరణ్ అభిమానుల కోసం ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. సినిమా విడుదల తర్వాత ఆయనకు శుభాకాంక్షలు తెలిపేందుకు హైదరాబాద్‌లోని తన Read more

Advertisements
×