సాధారణంగా చలి (Winter Season) ఎక్కువగా అనిపించేది మహిళలకు అన్న భావన చాలా మందిలో ఉంటుంది. పలు సైన్స్ జర్నల్స్‌లో వచ్చిన నివేదికలు కూడా ఇదే విషయాన్ని ధృవీకరించాయి. పురుషుల కంటే మహిళలు సగటున 2.5° ఎక్కువ ఉష్ణోగ్రత లోనే సౌకర్యవంతంగా ఉంటారని అధ్యయనాలు చెబుతున్నాయి. అంటే ఒకే వాతావరణంలో మగవారికి సరిగ్గా అనిపించే ఉష్ణోగ్రత, ఆడవారికి కొంచెం చల్లగా అనిపించవచ్చు.
UPI Payments India: By Mistake డబ్బు పంపారా? ఈ నంబర్కు కాల్ చేయండి!
మహిళలలో మెటబాలిక్ రేటు (శరీరం ఖర్చు చేసే మొత్తం శక్తి) మగవారికంటే తక్కువగా ఉంటుంది. దాంతో శరీరం తాపం ఉత్పత్తి చేసే సామర్థ్యం కూడా తగ్గిపోతుంది. అలాగే ఈస్ట్రోజెన్, ప్రొజెస్టిరాన్ వంటి హార్మోన్లు మహిళల శరీరంలో అధికంగా విడదల కావడం వలన రక్త ప్రసరణ, తాపం నియంత్రణలో తేడాలు వస్తాయి. ఫలితంగా ఒకే పరిస్థితుల్లో మహిళల శరీరం తాపాన్ని సరిగ్గా నిల్వ చేసుకోలేక చలిగా అనిపిస్తుంది.
మహిళల మాసిక చక్రంలో కూడా ఈ తాపనియంత్రణకు పెద్ద సంబంధం ఉంది. పీరియడ్స్ మరియు అండాల విడుదల సమయాల్లో శరీరంలోని హార్మోన్ స్థాయిలు మారుతాయి. ఈ మార్పులు రక్త ప్రసరణను, శరీర ఉష్ణోగ్రతను ప్రభావితం చేస్తాయి. అందువల్ల కొన్ని ప్రత్యేక దశల్లో మహిళలకు మరింత చలి అనిపించవచ్చు. ఇది సహజ శరీర శాస్త్రానికే చెందిన అంశం. కాబట్టి దీనిని ఆరోగ్య సమస్యగా కాకుండా హార్మోన్లు, మెటబాలిజం, శరీర తాపనియంత్రణ వ్యవస్థల సహజ తేడాలుగా అర్థం చేసుకోవాలి.