UTI Infections: యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ (UTI) అంటే చాలామంది బాత్రూంలలో పరిశుభ్రత లోపం లేదా వ్యక్తిగత శుభ్రత లేమి వల్లే వస్తుందని నమ్ముతారు. కానీ తాజా అధ్యయనం ఈ అభిప్రాయాన్ని తప్పు చేస్తోంది. పరిశోధన ప్రకారం, యూటీఐ కేసుల్లో సుమారు 20 శాతం వంటగదిలో పరిశుభ్రత పాటించకపోవడం లేదా కలుషిత మాంసం తినడం వల్లే వస్తున్నట్లు తేలింది. ముఖ్యంగా చికెన్ (chicken) , టర్కీ వంటి పౌల్ట్రీ మాంసాల్లో ఉన్న ఈ.కోలి బ్యాక్టీరియా యూటీఐలకు ప్రధాన కారణమని శాస్త్రవేత్తలు గుర్తించారు. మాంసాన్ని తాకిన తర్వాత చేతులు కడగకపోవడం, అదే కత్తిపీటను కూరగాయలకూ వాడటం, లేదా కిచెన్ స్పాంజ్‌లను శుభ్రం చేయకపోవడం వల్ల బ్యాక్టీరియా వేగంగా వ్యాప్తి చెందుతుందని తెలిపారు.
Read also: Beetroot: పిల్లల ఆరోగ్యానికి బీట్‌రూట్ ఎందుకు అవసరం?
UTI Infections: అపరిశుభ్ర వంటగది..
UTI Infections: భారత్‌లో మహిళల్లో యూటీఐలు ఎక్కువగా కనిపిస్తుండటంతో వంటగది పరిశుభ్రతపై ప్రత్యేక శ్రద్ధ అవసరం. పచ్చి మాంసం కోసం వేర్వేరు కత్తులు, బోర్డులు వాడటం, చేతులు కనీసం 20 సెకన్లపాటు సబ్బుతో కడుక్కోవడం, వంట సామగ్రిని తరచుగా శుభ్రపరచడం వంటి చిన్న మార్పులు పెద్ద రక్షణనిస్తాయి. మాంసం పూర్తిగా ఉడికిందో లేదో నిర్ధారించుకోవడం కూడా కీలకం. కేవలం వ్యక్తిగత శుభ్రత కాదు, కిచెన్ హైజీన్‌ను కూడా పాటించడం యూటీఐ ముప్పును తగ్గించే ముఖ్యమైన చర్యగా నిపుణులు చెబుతున్నారు.
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: