हिन्दी | Epaper
సైన‌స్ స‌మ‌స్య ఉన్న‌వారికి కొన్ని చిట్కాలు.. నిద్ర లేవగానే అలసటగా ఉంటోందా? ప్రీడయాబెటిస్ లక్షణాలు ..? బొప్పాయి గింజలతో ఆరోగ్య ప్రయోజనాలు పీరియడ్స్‌లో తలస్నానం చేయకూడదా? నిమ్మరసం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు డ‌యాబెటిస్ ఉన్న‌వారు స్వీట్ కార్న్‌ను తిన‌వ‌చ్చా? చలికాలం.. ఈ జాగ్రత్తలు మర్చిపోవద్దు! మైగ్రేన్‌ను శాశ్వతంగా తగ్గించే చిట్కాలు బచ్చలి కూరలో బోలెడన్ని విటమిన్లు సైన‌స్ స‌మ‌స్య ఉన్న‌వారికి కొన్ని చిట్కాలు.. నిద్ర లేవగానే అలసటగా ఉంటోందా? ప్రీడయాబెటిస్ లక్షణాలు ..? బొప్పాయి గింజలతో ఆరోగ్య ప్రయోజనాలు పీరియడ్స్‌లో తలస్నానం చేయకూడదా? నిమ్మరసం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు డ‌యాబెటిస్ ఉన్న‌వారు స్వీట్ కార్న్‌ను తిన‌వ‌చ్చా? చలికాలం.. ఈ జాగ్రత్తలు మర్చిపోవద్దు! మైగ్రేన్‌ను శాశ్వతంగా తగ్గించే చిట్కాలు బచ్చలి కూరలో బోలెడన్ని విటమిన్లు సైన‌స్ స‌మ‌స్య ఉన్న‌వారికి కొన్ని చిట్కాలు.. నిద్ర లేవగానే అలసటగా ఉంటోందా? ప్రీడయాబెటిస్ లక్షణాలు ..? బొప్పాయి గింజలతో ఆరోగ్య ప్రయోజనాలు పీరియడ్స్‌లో తలస్నానం చేయకూడదా? నిమ్మరసం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు డ‌యాబెటిస్ ఉన్న‌వారు స్వీట్ కార్న్‌ను తిన‌వ‌చ్చా? చలికాలం.. ఈ జాగ్రత్తలు మర్చిపోవద్దు! మైగ్రేన్‌ను శాశ్వతంగా తగ్గించే చిట్కాలు బచ్చలి కూరలో బోలెడన్ని విటమిన్లు సైన‌స్ స‌మ‌స్య ఉన్న‌వారికి కొన్ని చిట్కాలు.. నిద్ర లేవగానే అలసటగా ఉంటోందా? ప్రీడయాబెటిస్ లక్షణాలు ..? బొప్పాయి గింజలతో ఆరోగ్య ప్రయోజనాలు పీరియడ్స్‌లో తలస్నానం చేయకూడదా? నిమ్మరసం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు డ‌యాబెటిస్ ఉన్న‌వారు స్వీట్ కార్న్‌ను తిన‌వ‌చ్చా? చలికాలం.. ఈ జాగ్రత్తలు మర్చిపోవద్దు! మైగ్రేన్‌ను శాశ్వతంగా తగ్గించే చిట్కాలు బచ్చలి కూరలో బోలెడన్ని విటమిన్లు

Green Almonds : పచ్చి బాదంతో ప్రయోజనాలెన్నో..

Sudha
Green Almonds : పచ్చి బాదంతో ప్రయోజనాలెన్నో..

పచ్చి బాదం (Raw Almonds) శరీరానికి అనేక ఆరోగ్య ప్రయోజనాల(Health benefits)ను అందిస్తుంది. బాదం పోషకతత్వాలతో నిండిన అధ్భుతమైన డ్రైఫ్రూట్. పచ్చిగా తినడం వల్ల ఇందులోని పుష్కలమైన పోషకాలు (Rich in nutrients)పూర్తిగా లభిస్తాయి. ఇక వాటి ప్రయోజనాలపై ఒకసారి చూద్దాం.

 Green Almonds : పచ్చి బాదంతో ప్రయోజనాలెన్నో..
Green Almonds : పచ్చి బాదంతో ప్రయోజనాలెన్నో..

జెల్‌లాగా సుతిమెత్త‌గా
బాదంప‌ప్పును రోజుకు 7 లేదా 8 మోతాదులో తీసుకుని రాత్రి పూట నీటిలో నాన‌బెట్టి మ‌రుస‌టి రోజు ఉద‌యం ఆ ప‌ప్పుల‌ను బ్రేక్ ఫాస్ట్‌లో భాగంగా తినాల‌ని చెబుతుంటారు. అయితే బాదంకాయ‌లు బాగా పండిన త‌రువాత వాటిని ఎండ‌బెట్టి వాటిల్లో ఉండే ప‌ప్పును సేక‌రించి విక్ర‌యిస్తారు. కానీ మ‌న‌కు ప‌చ్చిబాదం కాయ‌లు కూడా ల‌భిస్తాయి. వాటిల్లోని ప‌ప్పు అప్పుడ‌ప్పుడే త‌యార‌వుతుంది. నిజానికి ఈ ప‌ప్పును కూడా తిన‌వ‌చ్చు. ఇది జెల్‌లాగా సుతిమెత్త‌గా ఉంటుంది. కొన్ని ప్రాంతాల‌కు చెందిన వారు ఎండిన బాదంకంటే ప‌చ్చిబాదంను తినేందుకే అధిక ప్రాధాన్య‌త‌ను ఇస్తారు. ఇక ప‌చ్చి బాదం కాస్త తియ్య‌గా, పులుపుగా, వ‌గ‌రుగా ఉంటుంది. ఇది కూడా మ‌న‌కు అనేక ఆరోగ్య ప్ర‌యోజ‌నాల‌ను అందిస్తుంది. ఈ బాదంప‌ప్పు కేవ‌లం ఈ సీజ‌న్‌లో మాత్ర‌మే ల‌భిస్తుంది.
మంచి బ్యాక్టీరియా వృద్ధి
ప‌చ్చిబాదంలోనూ అనేక పోష‌కాలు ఉంటాయి. వీటిల్లో ఎండిన బాదంక‌న్నా ఫైబ‌ర్ కాస్త ఎక్కువ‌గానే ఉంటుంది. ఇది పేగుల్లో మ‌లం క‌ద‌లిక‌ల‌ను సుల‌భ‌త‌రం చేస్తుంది. దీంతో విరేచ‌నం సాఫీగా అవుతుంది. మ‌ల‌బ‌ద్ద‌కం త‌గ్గుతుంది. జీర్ణ వ్య‌వ‌స్థ‌లో మంచి బ్యాక్టీరియా వృద్ధి చెందుతుంది. ఇది జీర్ణ వ్య‌వ‌స్థ‌ను ఆరోగ్యంగా ఉంచుతుంది. ప‌చ్చి బాదంప‌ప్పును తింటే ఫైబ‌ర్ కార‌ణంగా క‌డుపు నిండిన భావ‌న క‌లుగుతుంది. ఎక్కువ సేపు ఉన్నా ఆక‌లి వేయ‌దు. దీంతో ఆహారం త‌క్కువ‌గా తింటారు. ఇది బ‌రువు తగ్గేందుకు స‌హాయ ప‌డుతుంది. బ‌రువును నియంత్ర‌ణ‌లో ఉంచుతుంది. ప‌చ్చి బాదంలో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ముఖ్యంగా విట‌మిన్ బి, ఫ్లేవ‌నాయిడ్స్ అధికంగా ఉంటాయి. ఇవి ఫ్రీ ర్యాడిక‌ల్స్‌ను నిర్మూలించి ఆక్సీక‌ర‌ణ ఒత్తిడిని త‌గ్గిస్తాయి. దీంతో క్యాన్స‌ర్ వంటి ప్రాణాంత‌క వ్యాధులు రాకుండా సుర‌క్షితంగా ఉండ‌వ‌చ్చు.
ఫైబ‌ర్ కూడా అధికంగానే..
ప‌చ్చి బాదంలో ఉండే విటమిన్ ఇ, యాంటీ ఆక్సిడెంట్లు రోగ నిరోధ‌క వ్య‌వ‌స్థ‌ను ప‌టిష్టంగా మారుస్తాయి. దీంతో శ‌రీరం వ్యాధులు, ఇన్‌ఫెక్ష‌న్ల‌కు వ్య‌తిరేకంగా పోరాడుతుంది. రోగాలు రాకుండా ర‌క్షిస్తుంది. ప‌చ్చిబాదంలో అన్‌శాచురేటెడ్ కొవ్వులు ఉంటాయి. అలాగే ఫైబ‌ర్ కూడా అధికంగానే ఉంటుంది క‌నుక ఇవి మ‌న శ‌రీరంలో ఉన్న చెడు కొలెస్ట్రాల్‌ను త‌గ్గిస్తాయి. మంచి కొలెస్ట్రాల్‌ను పెంచుతాయి. దీంతో ర‌క్త నాళాలు ఆరోగ్యంగా ఉంటాయి. ర‌క్త నాళాల్లో ఉండే క్లాట్స్ క‌రిగిపోతాయి. ర‌క్త నాళాలు వెడ‌ల్పుగా మారి ర‌క్త స‌ర‌ఫ‌రా మెరుగు ప‌డుతుంది. దీంతో బీపీ నియంత్ర‌ణ‌లో ఉంటుంది. హైబీపీ ఉన్న‌వారికి ప‌చ్చిబాదం ఎంతో మేలు చేస్తుంది. దీంతోపాటు గుండె పోటు రాకుండా ర‌క్షిస్తుంది.
జుట్టుకు కావ‌ల్సిన పోష‌ణ‌
ప‌చ్చి బాదంలో యాంటీ ఆక్సిడెంట్లు, విట‌మిన్ ఇ అధికంగా ఉంటాయి క‌నుక చ‌ర్మాన్ని సంర‌క్షిస్తాయి. ఈ బాదంతో ఫేస్ ప్యాక్ వేసుకుని ఉప‌యోగించ‌వ‌చ్చు. ఇది ముఖాన్ని కాంతివంతంగా మార్చి య‌వ్వ‌నంగా ఉంచుతుంది. ముఖంపై ఉండే మొటిమ‌లు, మ‌చ్చ‌ల‌ను త‌గ్గిస్తుంది. ప‌చ్చిబాదంలో ప్రోటీన్లు అధికంగా ఉంటాయి. ఇవి జుట్టు పెరిగేందుకు ఎంత‌గానో స‌హాయం చేస్తాయి. ఈ బాదంల‌ను పేస్ట్‌లా చేసి హెయిర్ ప్యాక్‌లా కూడా ఉప‌యోగించ‌వ‌చ్చు. ఇది జుట్టుకు కావ‌ల్సిన పోష‌ణ‌ను అందిస్తుంది. శిరోజాలు రాల‌డాన్ని త‌గ్గిస్తుంది. జుట్టు ఒత్తుగా పెరిగి దృఢంగా, ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది. ప‌చ్చి బాదంలో క్యాల్షియం, ఫాస్ఫ‌ర‌స్ అధికంగా ఉంటాయి. ఇవి ఎముక‌లు, దంతాల‌ను దృఢంగా, ఆరోగ్యంగా ఉంచుతాయి. ఇలా ప‌చ్చిబాదంల‌తో అనేక ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చు.

Read Also:Water apple: వాటర్ యాపిల్‌ తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

ప్రసవ సమయంలో ఆమ్నియాటిక్ ఫ్లూయిడ్ ఎంబాలిజం ప్రమాదం

ప్రసవ సమయంలో ఆమ్నియాటిక్ ఫ్లూయిడ్ ఎంబాలిజం ప్రమాదం

పండ్లు, కూరగాయలపై పురుగు మందుల అవశేషాలు ఇలా దూరం

పండ్లు, కూరగాయలపై పురుగు మందుల అవశేషాలు ఇలా దూరం

శీతాకాలపు ఆరోగ్యవంతమైన పండు

శీతాకాలపు ఆరోగ్యవంతమైన పండు

ప్లాస్టిక్ వినియోగంపై అప్రమత్తం – BPA వల్ల ఆరోగ్యానికి భారీ ముప్పు

ప్లాస్టిక్ వినియోగంపై అప్రమత్తం – BPA వల్ల ఆరోగ్యానికి భారీ ముప్పు

ఎయిడ్స్ నియంత్రణ సంస్థల ర్యాంకింగులో రాష్ట్రానికి తొలి స్థానం!

ఎయిడ్స్ నియంత్రణ సంస్థల ర్యాంకింగులో రాష్ట్రానికి తొలి స్థానం!

బొద్దింకల వల్లే ఈ ఆరు భయంకరమైన వ్యాధులు వస్తాయట..

బొద్దింకల వల్లే ఈ ఆరు భయంకరమైన వ్యాధులు వస్తాయట..

దేశంలో పెరుగుతున్న నాడీ సంబంధిత వ్యాధులు..

దేశంలో పెరుగుతున్న నాడీ సంబంధిత వ్యాధులు..

ఐరన్, విటమిన్ డి ట్యాబ్లెట్స్ వేసుకుంటున్నారా?

ఐరన్, విటమిన్ డి ట్యాబ్లెట్స్ వేసుకుంటున్నారా?

ఆయిలీ స్కిన్‌కు మేకప్ ఇలా చేస్తే ఫ్లా-లెస్ లుక్ గ్యారంటీ

ఆయిలీ స్కిన్‌కు మేకప్ ఇలా చేస్తే ఫ్లా-లెస్ లుక్ గ్యారంటీ

టాడ్లర్స్‌లో నీళ్లవిరేచనాలు: కారణాలు, జాగ్రత్తలు

టాడ్లర్స్‌లో నీళ్లవిరేచనాలు: కారణాలు, జాగ్రత్తలు

గర్భధారణ ప్రారంభ దశలో జాగ్రత్తలు

గర్భధారణ ప్రారంభ దశలో జాగ్రత్తలు

చలికాలంలో చర్మ సంరక్షణ

చలికాలంలో చర్మ సంరక్షణ

📢 For Advertisement Booking: 98481 12870