📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

సైన‌స్ స‌మ‌స్య ఉన్న‌వారికి కొన్ని చిట్కాలు.. నిద్ర లేవగానే అలసటగా ఉంటోందా? ప్రీడయాబెటిస్ లక్షణాలు ..? బొప్పాయి గింజలతో ఆరోగ్య ప్రయోజనాలు పీరియడ్స్‌లో తలస్నానం చేయకూడదా? నిమ్మరసం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు డ‌యాబెటిస్ ఉన్న‌వారు స్వీట్ కార్న్‌ను తిన‌వ‌చ్చా? చలికాలం.. ఈ జాగ్రత్తలు మర్చిపోవద్దు! మైగ్రేన్‌ను శాశ్వతంగా తగ్గించే చిట్కాలు బచ్చలి కూరలో బోలెడన్ని విటమిన్లు సైన‌స్ స‌మ‌స్య ఉన్న‌వారికి కొన్ని చిట్కాలు.. నిద్ర లేవగానే అలసటగా ఉంటోందా? ప్రీడయాబెటిస్ లక్షణాలు ..? బొప్పాయి గింజలతో ఆరోగ్య ప్రయోజనాలు పీరియడ్స్‌లో తలస్నానం చేయకూడదా? నిమ్మరసం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు డ‌యాబెటిస్ ఉన్న‌వారు స్వీట్ కార్న్‌ను తిన‌వ‌చ్చా? చలికాలం.. ఈ జాగ్రత్తలు మర్చిపోవద్దు! మైగ్రేన్‌ను శాశ్వతంగా తగ్గించే చిట్కాలు బచ్చలి కూరలో బోలెడన్ని విటమిన్లు

Latest Telugu News : smoking : సిగరెట్లు సంఖ్యను తగ్గిస్తే చాలదు ..

Author Icon By Sudha
Updated: November 27, 2025 • 3:55 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ధూమపానం చేసేవారు.. ఆ అలవాటు అంత త్వరగా మానుకోలేరు. కాకుంటే, రోజువారీగా తాగే సిగరెట్ల సంఖ్యను తగ్గించుకుంటారు. ఆరోగ్యంపై శ్రద్ధ చూపుతున్నామని భావిస్తుంటారు. అయితే, ఇలా సిగరెట్లను తగ్గించడం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదని పరిశోధకులు చెబుతున్నారు. ‘పబ్లిక్‌ లైబ్రరీ ఆఫ్‌ సైన్స్‌’లో ప్రచురితమైన తాజా అధ్యయనంలో.. ఈ విషయం వెల్లడైంది. ధూమపానం చేసేవారిని క్యాన్సర్‌, ఊపిరితిత్తుల వ్యాధి, గుండె జబ్బులు, స్ట్రోక్‌ వంటి అనేక దీర్ఘకాలిక వ్యాధులు చుట్టుముడతాయి. ఫలితంగా.. ఏటా 80 లక్షల మంది ప్రాణాలు కోల్పోతున్నారు. మనదేశంలో ఈ సంఖ్య.. 13.5 లక్షలుగా ఉన్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. తాజా అధ్యయనంలో భాగంగా.. ధూమపానం (smoking) అలవాటు ఉన్న 3,23,826 మందికి సంబంధించిన హెల్త్‌ డేటాను పరిశీలించారు. 2005 నుంచి 2014 మధ్య వీరి జీవనశైలిని గమనిస్తూ వచ్చారు. వీరిలో చాలామంది ప్రతిరోజూ తాగే సిగరెట్ల సంఖ్యను తగ్గించుకున్నారు. రోజుకు పది సిగరెట్ల కంటే తక్కువ తాగేవారు.. ఏటా 16 శాతం నుంచి 27 శాతానికి పెరిగారు. అదే సమయంలో.. ధూమపానం పూర్తిగా మానేసిన వారు 19 నుంచి 23 శాతానికి చేరుకున్నారు.

Read Also : Health: గుండెను తీవ్రంగా దెబ్బతీస్తున్న ప్లాస్టిక్ వాడకం..

smoking

ఈ క్రమంలో ధూమపానం (smoking ) పూర్తిగా పక్కన పెట్టినవారితో పోలిస్తే.. సిగరెట్ల సంఖ్యను తగ్గించిన వారి ఆరోగ్యంలో ఎలాంటి మార్పూ కనిపించలేదని పరిశోధకులు గుర్తించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ధూమపానం హృదయ సంబంధ వ్యాధుల ప్రమాదాన్ని రెండు రెట్లు పెంచుతుందని పరిశోధకులు వెల్లడించారు. జీవితకాలాన్ని ఐదు కన్నా ఎక్కువ సంవత్సరాలు తగ్గిస్తుందని చెబుతున్నారు. కాబట్టి, కాల్చే సిగరెట్ల సంఖ్యను తగ్గిస్తే ఎలాంటి లాభం ఉండబోదనీ, ధూమపానాన్ని పూర్తిగా పక్కన పెడితేనే మంచిదని సలహా ఇస్తున్నారు.

ధూమపానం రకాలు ఏమిటి?

ధూమపానం రకాల్లో సిగరెట్లు, సిగార్లు మరియు పైపులు వంటి మండే పొగాకు ఉత్పత్తులు మరియు ఇ-సిగరెట్లు (వేపింగ్) మరియు హుక్కా (నీటి పైపులు) వంటి ఆధునిక ప్రత్యామ్నాయాలు ఉన్నాయి. గంజాయి వంటి ఇతర పదార్థాల నుండి వచ్చే పొగ రకాలు మరియు పొగలేని పొగాకు (నమలడం లేదా ముంచడం) వంటి తక్కువ దహనం ఉండే పొగాకు వినియోగ పద్ధతులు కూడా ఉన్నాయి. అన్ని రకాల పొగాకు వినియోగం హానికరం.

ధూమపానం చేసేవారి ఊపిరితిత్తులను ఎలా శుభ్రం చేయాలి?

ధూమపానం చేసేవారి ఊపిరితిత్తులను శుభ్రపరచడంలో సహాయపడటానికి, ధూమపానం మానేయడం మరియు వ్యాయామం మరియు నియంత్రిత దగ్గు వంటి శ్లేష్మాన్ని తొలగించి ఊపిరితిత్తుల సామర్థ్యాన్ని మెరుగుపరిచే కార్యకలాపాలపై దృష్టి పెట్టడం చాలా అవసరం. హైడ్రేటెడ్ గా ఉండటం, యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉన్న ఆహారం తీసుకోవడం మరియు ఆవిరి చికిత్సను ఉపయోగించడం కూడా సహజ వైద్యం ప్రక్రియకు సహాయపడుతుంది.

Read hindi news : hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read Also:

addiction Breaking News health-risk latest news quit-smoking smoking Telugu News Tobacco

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.