గుమ్మడికాయ (Pumpkin) పేరు చెబితే చాలామందికి ముందుగా గుర్తుకొచ్చేది దీపావళి, దిష్టి తొలగింపు వంటి సంప్రదాయ పద్ధతులు. కానీ ఇది కేవలం ఆధ్యాత్మిక లేదా సంప్రదాయ పరమైన వస్తువు మాత్రమే కాదు. ఇది ఆరోగ్య పరంగా కూడా ఓ మహత్తరమైన ఔషధం. గుమ్మడికాయను ‘పవర్ హౌస్ ఆఫ్ న్యూట్రియంట్స్’ అని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఇది సులభంగా లభించే, పోషకాలు సమృద్ధిగా కలిగిన అద్భుతమైన ఆహార పదార్థం.
గుమ్మడికాయలో ఉండే పోషకాలు:
గుమ్మడికాయలో విటమిన్లు, ఖనిజాలు, యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి. ముఖ్యంగా విటమిన్ A (బీటా కెరోటిన్ రూపంలో), విటమిన్ C, Vitamin E, ఫైబర్, పొటాషియం, మెగ్నీషియం, ఐరన్, యాంటీ ఆక్సిడెంట్‌లైన ల్యూటిన్, జెయాక్సాంతిన్.
గుమ్మడికాయ ఆరోగ్య ప్రయోజనాలు:
కంటి ఆరోగ్యానికి రక్షణ కవచం:
గుమ్మడికాయలో బీటా కెరోటిన్ అధికంగా ఉంటుంది. ఇది శరీరంలో విటమిన్ Aగా మారి కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. వయస్సు పైబడినప్పుడు వచ్చే మాక్యులార్ డిజెనరేషన్, రాత్రిపూట చూపు తగ్గడం వంటి సమస్యలకు ఇది పరిష్కారంగా పనిచేస్తుంది.
రోగనిరోధక శక్తి పెంపు:
విటమిన్ C, బీటా కెరోటిన్, విటమిన్ E వంటి యాంటీ ఆక్సిడెంట్లు గుమ్మడికాయలో పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరాన్ని బ్యాక్టీరియా, వైరస్‌ల నుంచి రక్షించి ఇన్ఫెక్షన్లను నివారిస్తాయి.
జీర్ణవ్యవస్థకు మేలు:
గుమ్మడికాయలో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉండడం వల్ల జీర్ణవ్యవస్థ బాగుంటుంది. మలబద్దకం సమస్యలను తగ్గిస్తుంది. ఆకలిని నియంత్రించడంలో సహాయపడుతుంది. ఇది బరువు తగ్గాలనుకునే వారికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది.
గుండె ఆరోగ్యం కోసం:
ఫైబర్, పొటాషియం, విటమిన్ C కలయిక గుండెకు ఎంతో మేలు చేస్తుంది. రక్తపోటును నియంత్రించడంలో సహాయపడుతుంది. గుండె సంబంధిత రుగ్మతల రిస్క్‌ను తగ్గిస్తుంది.
నిద్ర నాణ్యత మెరుగుపడుతుంది:
గుమ్మడికాయ తినడం ద్వారా సెరోటోనిన్, మెలటోనిన్ వంటి హార్మోన్ల ఉత్పత్తి పెరుగుతుంది. ఇవి నిద్రలో సహాయపడతాయి. నిద్రలేమి ఉన్నవారు గుమ్మడికాయను ఆహారంగా తీసుకోవడం ద్వారా ఉపశమనం పొందవచ్చు.
చర్మ ఆరోగ్యం మెరుగవుతుంది:
విటమిన్ C మరియు యాంటీ ఆక్సిడెంట్లు చర్మం ముడతలు తగ్గించి, గ్లో ఇచ్చేలా చేస్తాయి. చర్మ కణాలను పునరుత్పత్తి చేయడంలో సహాయపడతాయి.
కేన్సర్ రిస్క్ తగ్గింపు:
గుమ్మడికాయలో ఉండే బీటా కెరోటిన్ వంటి యాంటీ ఆక్సిడెంట్లు క్యాన్సర్ కారకమైన ఫ్రీ రాడికల్స్‌ను తగ్గించడంలో సహాయపడతాయి. ముఖ్యంగా ప్రోస్టేట్, లంగ్ కేన్సర్ రిస్క్‌ను తగ్గించే అవకాశాలు ఉన్నాయి.
డయాబెటిస్ నియంత్రణ:
గుమ్మడికాయలోని ఫైబర్ మరియు లో లైగ్లైసెమిక్ ఇండెక్స్ ఉన్న కార్బొహైడ్రేట్లు రక్తంలో గ్లూకోజ్ స్థాయిని క్రమబద్ధీకరిస్తాయి. ఇది షుగర్ లెవల్స్‌ను నియంత్రించడంలో సహాయపడుతుంది.
శరీరాన్ని డీటాక్స్ చేయడంలో సహాయపడుతుంది:
బూడిద గుమ్మడికాయ (ash gourd) శరీరంలోని విషపదార్థాలను బయటకు తీసివేస్తుంది. లివర్, కిడ్నీ పనితీరును మెరుగుపరుస్తుంది.
ఎవరెవరు తినాలి?
బరువు తగ్గాలనుకునేవారు, డయాబెటిక్ రోగులు, నిద్రలేమితో బాధపడేవారు, చర్మ సమస్యలున్నవారు, రోగనిరోధక శక్తిని పెంచుకోవాలనుకునేవారు. గుమ్మడికాయలో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు ఎక్కువగా ఉంటాయి. ఇవి ఫ్రీ రాడికల్స్‌ను తొలగించడంలో సాయపడతాయి. గుమ్మడికాయలో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది. ఇమ్యూనిటీని పెంచడంలో సహాయపడుతుంది. ఇన్ఫెక్షన్స్ నుంచి దూరంగా ఉంచుతుంది. గుమ్మడికాయ తింటే చర్మం ముడతలు తగ్గుతాయి.
Read also: Tulasi Benefits: తులసి ఆకులను ఇలా తీసుకుంటే ఆరోగ్యానికి ఎంతో మంచిది