📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

సైన‌స్ స‌మ‌స్య ఉన్న‌వారికి కొన్ని చిట్కాలు.. నిద్ర లేవగానే అలసటగా ఉంటోందా? ప్రీడయాబెటిస్ లక్షణాలు ..? బొప్పాయి గింజలతో ఆరోగ్య ప్రయోజనాలు పీరియడ్స్‌లో తలస్నానం చేయకూడదా? నిమ్మరసం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు డ‌యాబెటిస్ ఉన్న‌వారు స్వీట్ కార్న్‌ను తిన‌వ‌చ్చా? చలికాలం.. ఈ జాగ్రత్తలు మర్చిపోవద్దు! మైగ్రేన్‌ను శాశ్వతంగా తగ్గించే చిట్కాలు బచ్చలి కూరలో బోలెడన్ని విటమిన్లు సైన‌స్ స‌మ‌స్య ఉన్న‌వారికి కొన్ని చిట్కాలు.. నిద్ర లేవగానే అలసటగా ఉంటోందా? ప్రీడయాబెటిస్ లక్షణాలు ..? బొప్పాయి గింజలతో ఆరోగ్య ప్రయోజనాలు పీరియడ్స్‌లో తలస్నానం చేయకూడదా? నిమ్మరసం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు డ‌యాబెటిస్ ఉన్న‌వారు స్వీట్ కార్న్‌ను తిన‌వ‌చ్చా? చలికాలం.. ఈ జాగ్రత్తలు మర్చిపోవద్దు! మైగ్రేన్‌ను శాశ్వతంగా తగ్గించే చిట్కాలు బచ్చలి కూరలో బోలెడన్ని విటమిన్లు

Pink Salt : పింక్ సాల్ట్ వాడకంతో కొత్త ఆరోగ్య ముప్పు

Author Icon By Divya Vani M
Updated: July 6, 2025 • 9:48 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఆరోగ్యంపై ప్రజల్లో వేగంగా పెరుగుతున్న శ్రద్ధతో, వంటగదుల్లో మార్పులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. టేబుల్ సాల్ట్ బదులుగా హిమాలయన్ పింక్ సాల్ట్ (Pink Salt), సీ సాల్ట్ వాడకం ఇప్పుడు ట్రెండ్‌గా మారింది. అయితే దీనిపై వైద్య నిపుణులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.పింక్ సాల్ట్ సహజంగా లభిస్తుందని, రసాయనాలు ఉండవని చెప్పుకుంటూ చాలామంది దీన్ని వాడుతున్నారు. కానీ ఇందులో శరీరానికి అత్యంత కీలకమైన అయోడిన్ మోతాదు చాలా తక్కువ. ఇది ఆరోగ్యానికి ప్రమాదకరమని వైద్యులు (Doctors say it is dangerous to health) హెచ్చరిస్తున్నారు.

Pink Salt : పింక్ సాల్ట్ వాడకంతో కొత్త ఆరోగ్య ముప్పు

థైరాయిడ్ హార్మోన్లకు అయోడిన్ ఎంతో అవసరం

శరీరంలో జీవక్రియల నియంత్రణకు, మెదడు అభివృద్ధికి థైరాయిడ్ హార్మోన్లు అవసరం. వాటి ఉత్పత్తికి అయోడిన్ కీలకం. గర్భిణులు, పిల్లలు దీనిపై మరింత అవగాహనతో ఉండాలి. అయోడైజ్డ్ ఉప్పే శరీరానికి అవసరమైన అయోడిన్‌ను అందించగలదు.భారత్‌లో 1960ల నుంచే గాయిటర్‌ వంటి వ్యాధులను నివారించేందుకు అయోడైజ్డ్ ఉప్పు వినియోగాన్ని ప్రోత్సహిస్తున్నారు. అయితే ఇప్పుడీ ట్రెండ్ మూలంగా మళ్లీ అదే సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉందని వైద్యులు చెబుతున్నారు.

WHO హెచ్చరిక ఇదే!

ప్రపంచ ఆరోగ్య సంస్థ సైతం అయోడిన్ పౌష్టికతపై నిరంతరం హెచ్చరిస్తోంది. ఫ్యాషన్ కోసం ఆరోగ్యాన్ని తాకట్టు పెట్టొద్దని సూచిస్తోంది. వాస్తవానికి హిమాలయన్ సాల్ట్ మినరల్స్ కలిగి ఉన్నా, అవి శరీర అవసరాలకు సరిపోవు. ముఖ్యమైనది అయోడిన్‌నే.నిపుణుల స్పష్టమైన సూచన ఏంటంటే, ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని టేబుల్ ఉప్పును వాడాలన్నదే. రోజువారీ వంటల్లో తప్పనిసరిగా అయోడైజ్డ్ సాల్ట్‌ను వినియోగించాలని కోరుతున్నారు. ఆరోగ్యమే లక్ష్యమైతే, శాస్త్రీయంగా పరిశీలించిన వాస్తవాలను అనుసరించాల్సిందే.

Read Also : F-35B Fighter Jet : ఎట్టకేలకు టార్మాక్ నుంచి హ్యాంగర్‌లోకి తరలింపు

Ayurvedic Salt Myths Himalayan Pink Salt Side Effects Iodine Deficiency From Pink Salt Pink Salt Health Risks Sea Salt Vs Table Salt Thyroid Problems from Salt

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.