📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

శంషాబాద్ వద్ద స్కూల్ బస్సు బోల్తా 20 కి చేరిన స్క్రబ్ టైఫస్ మృతుల సంఖ్య హైదరాబాద్ చెరువుల్లో పతంగుల పండుగ ఏర్పాట్లు పెండింగ్ ఈ-చలాన్లపై సైబర్ క్రైమ్ పోలీస్ ల సూచనలు కర్ణాటకలోఘోర బస్సు ప్రమాదం.. కంబోడియాలో విష్ణు విగ్రహ ధ్వంసం.. తీవ్రంగా ఖండించిన భారత్ నేటి బంగారం ధరలు అమెరికా ఉద్యోగాలు స్థానికులకే అన్న ట్రంప్ రైల్వే నియామక బోర్డు 22,000 ఖాళీల షార్ట్ నోటిఫికేషన్ విడుదల త్వరలో ‘భారత్ ట్యాక్సీ’ సేవలు.. లాభాలు పూర్తిగా డ్రైవర్లకే నైజీరియాలో మసీదుపై బాంబు దాడి.. 10 మందికి పైగా మృతి అమెజాన్ లో 850 మందికి జాబ్స్! ఈషా మూవీ రివ్యూ ‘దండోరా’ మూవీ రివ్యూ ఇంజినీరింగ్ కోర్సుల ఫీజుల్లో మార్పులు .. జీవో జారీ చెన్నై–తిరుచ్చి హైవేపై ఘోర ప్రమాదం శంషాబాద్ వద్ద స్కూల్ బస్సు బోల్తా 20 కి చేరిన స్క్రబ్ టైఫస్ మృతుల సంఖ్య హైదరాబాద్ చెరువుల్లో పతంగుల పండుగ ఏర్పాట్లు పెండింగ్ ఈ-చలాన్లపై సైబర్ క్రైమ్ పోలీస్ ల సూచనలు కర్ణాటకలోఘోర బస్సు ప్రమాదం.. కంబోడియాలో విష్ణు విగ్రహ ధ్వంసం.. తీవ్రంగా ఖండించిన భారత్ నేటి బంగారం ధరలు అమెరికా ఉద్యోగాలు స్థానికులకే అన్న ట్రంప్ రైల్వే నియామక బోర్డు 22,000 ఖాళీల షార్ట్ నోటిఫికేషన్ విడుదల త్వరలో ‘భారత్ ట్యాక్సీ’ సేవలు.. లాభాలు పూర్తిగా డ్రైవర్లకే నైజీరియాలో మసీదుపై బాంబు దాడి.. 10 మందికి పైగా మృతి అమెజాన్ లో 850 మందికి జాబ్స్! ఈషా మూవీ రివ్యూ ‘దండోరా’ మూవీ రివ్యూ ఇంజినీరింగ్ కోర్సుల ఫీజుల్లో మార్పులు .. జీవో జారీ చెన్నై–తిరుచ్చి హైవేపై ఘోర ప్రమాదం

News Telugu: Dog Bite- కుక్క కరిచిన వెంటనే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?

Author Icon By Sharanya
Updated: August 24, 2025 • 3:09 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

News Telugu: ఇటీవలి కాలంలో దేశవ్యాప్తంగా కుక్కల దాడులు పెరుగుతున్నాయి. అనేక మంది పిల్లలు, పెద్దలు ఈ దాడుల్లో ప్రాణాలు కోల్పోయిన సంఘటనలు చోటు చేసుకున్నాయి. ఈ పరిస్థితిపై సుప్రీం కోర్టు సైతం ఆందోళన వ్యక్తం చేసింది. కుక్క కాటు (dog bite) జరిగితే ఏం చేయాలి? ఎలాంటి చికిత్సలు తీసుకోవాలి? ఎన్ని ఇంజెక్షన్లు అవసరం? అనే అంశాలను ఇప్పుడు పరిశీలిద్దాం.

News Telugu

కుక్క కాటుకు మూడు దశలు

కుక్క కాటును వైద్యపరంగా మూడు దశలుగా విభజిస్తారు.

మొదటి దశ:
చర్మంపై కేవలం గీతలు పడే స్థితి. సాధారణంగా ఇలాంటి గాయాలపై చాలామంది పసుపు, వంటి ఇంటి చిట్కాలను వాడుతారు. కానీ ఇవి ఇన్ఫెక్షన్‌ను పెంచే ప్రమాదం ఎక్కువని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఇలాంటి సమయంలో గాయాన్ని శుభ్రమైన నీటితో కనీసం 5-10 నిమిషాలు కడిగి, తర్వాత యాంటీసెప్టిక్ క్రీమ్ రాయాలి.

రెండవ దశ:
ఈ దశలో కుక్క దంతాలు లోపలికి దిగిపోతాయి. గాయం లోతుగా ఉంటుంది.

మూడవ దశ:
ఈ దశలో మాంసం బయటకు వచ్చేంత తీవ్రత ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో గాయాన్ని ముందుగా నీటితో శుభ్రం చేసి, రేబిస్ ఇమ్యునోగ్లోబులిన్ (Rabies Immunoglobulin) ఇంజెక్షన్ తీసుకోవాలి. అలాగే పోవిడోన్-అయోడిన్ (Povidone-Iodine) వంటి ద్రావణంతో గాయాన్ని శుభ్రం చేసి, తర్వాత యాంటీసెప్టిక్ మందులు వాడటం తప్పనిసరి.

టెటనస్ మరియు కుట్ల విషయంలో జాగ్రత్తలు

రెండవ, మూడవ దశల్లో గాయాలు లోతుగా ఉండే అవకాశం ఎక్కువ. ఇలాంటి పరిస్థితుల్లో టెటనస్ వచ్చే ప్రమాదం అధికంగా ఉంటుంది. అందుకే టెటనస్ ఇంజెక్షన్ తప్పనిసరిగా తీసుకోవాలి.
చాలామంది మాంసం బయటకు కనిపించినప్పుడు కుట్లు వేయించుకోవాలని భావిస్తారు. కానీ డాక్టర్ల ప్రకారం కుక్క కాటు గాయాలకు కుట్లు వేయడం హానికరం. బదులుగా యాంటీబయోటిక్ మందులు వాడటం మంచిది.

News Telugu

ఎప్పుడు, ఎన్ని ఇంజెక్షన్లు అవసరం?

కుక్క కాటు జరిగిన వెంటనే వైద్యుడిని సంప్రదించడం ప్రాణాపాయం నుంచి రక్షించే ప్రధాన మార్గం. పోస్ట్ ఎక్స్‌పోజర్ ప్రొఫిలాక్సిస్ (Post Exposure Prophylaxis) చికిత్సలో భాగంగా ఐదు డోసుల రేబిస్ టీకా ఇస్తారు.

నిర్లక్ష్యం చేయరాదు

కుక్క కాటు చిన్న గాయం అనుకున్నా నిర్లక్ష్యం చేయడం ప్రమాదకరం. వెంటనే గాయాన్ని శుభ్రం చేసి, వైద్యుడిని సంప్రదించి, అవసరమైన టీకాలు వేసుకోవాలి. ఇలా చేస్తే రేబిస్ వంటి ప్రాణాంతక వ్యాధుల నుండి తప్పించుకోవచ్చు.

Read hindi news: hindi.vaartha.com

Read also:

https://vaartha.com/news-telugu-nail-fungal-infection-rainy-season-care/health/535080/

Breaking News dog attack dog bite dog bite precautions dog bite treatment latest news pet safety rabies vaccine tetanus injection

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.