📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

కిడ్నీ సమస్యలను గుర్తించే కంటి సంకేతాలు సైన‌స్ స‌మ‌స్య? కొన్ని చిట్కాలు.. నిద్ర లేవగానే అలసటగా ఉంటోందా? ప్రీడయాబెటిస్ లక్షణాలు ..? బొప్పాయి గింజలతో ఆరోగ్య ప్రయోజనాలు పీరియడ్స్‌లో తలస్నానం చేయకూడదా? నిమ్మరసం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు డ‌యాబెటిస్ ఉన్న‌వారు స్వీట్ కార్న్‌ను తిన‌వ‌చ్చా? చలికాలం.. ఈ జాగ్రత్తలు మర్చిపోవద్దు! మైగ్రేన్‌ను శాశ్వతంగా తగ్గించే చిట్కాలు కిడ్నీ సమస్యలను గుర్తించే కంటి సంకేతాలు సైన‌స్ స‌మ‌స్య? కొన్ని చిట్కాలు.. నిద్ర లేవగానే అలసటగా ఉంటోందా? ప్రీడయాబెటిస్ లక్షణాలు ..? బొప్పాయి గింజలతో ఆరోగ్య ప్రయోజనాలు పీరియడ్స్‌లో తలస్నానం చేయకూడదా? నిమ్మరసం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు డ‌యాబెటిస్ ఉన్న‌వారు స్వీట్ కార్న్‌ను తిన‌వ‌చ్చా? చలికాలం.. ఈ జాగ్రత్తలు మర్చిపోవద్దు! మైగ్రేన్‌ను శాశ్వతంగా తగ్గించే చిట్కాలు

Telugu News: medicine: ఒరిజినల్ మెడిసిన్ న్నే కొంటున్నారా? ఇలా తెలుసుకోండి

Author Icon By Tejaswini Y
Updated: November 10, 2025 • 2:16 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

దేశవ్యాప్తంగా నకిలీ ఔషధాల(medicine) తయారీ, విక్రయాలను అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక చర్యలు చేపట్టింది. ఈ సమస్యను పూర్తిగా నియంత్రించేందుకు ‘ట్రాక్ అండ్ ట్రేస్’ విధానాన్ని ప్రవేశపెట్టి అన్ని ఔషధాలపై క్యూఆర్ కోడ్ (QR Code) తప్పనిసరి చేసింది. దీని ద్వారా వినియోగదారులు తమ మొబైల్‌ ఫోన్లతో మందుపై ఉన్న క్యూఆర్‌ కోడ్‌ను స్కాన్ చేసి, ఆ ఔషధం అసలైనదా లేక నకిలీదా అని తేలికగా తెలుసుకోవచ్చు.

ఇప్పటికే పాలు, కూరగాయలు, ఆహార పదార్థాల్లో కల్తీ పెరిగిపోతుండగా, ఇప్పుడు ఔషధాలు కూడా నకిలీ రూపంలో మార్కెట్‌లో లభించడం ప్రజారోగ్యానికి పెద్ద ముప్పుగా మారింది. ఈ పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం ఔషధాల నాణ్యత, మూలం, తయారీ వివరాలను వినియోగదారుల చేతుల్లోనే తెలుసుకునే సౌకర్యాన్ని కల్పిస్తోంది.

Read also: New Bike: కొత్త  ఫీచర్లతో మార్కెట్ లోకి హీరో ఎక్స్‌ట్రీమ్ 125R

క్యూఆర్‌ కోడ్‌ స్కాన్‌తో అసలు మందు గుర్తింపు

క్యూఆర్‌ కోడ్‌ను స్కాన్ చేసినప్పుడు వినియోగదారులు మందు జనరిక్ పేరు, తయారీ తేదీ, గడువు తేది, తయారీ లైసెన్స్ నంబర్, బ్యాచ్ నంబర్, తయారీ ప్రాంతం, యూనిక్ ప్రొడక్ట్ ఐడెంటిఫికేషన్ కోడ్ (UPI) వంటి వివరాలను వెంటనే తెలుసుకోగలరు.

మందు ప్యాకింగ్‌పై కోడ్ లేకపోవడం లేదా స్కాన్ చేసిన తర్వాత వివరాలు రాకపోతే ఆ ఔషధం నకిలీదిగా భావించవచ్చు. ఈ పద్ధతి నకిలీ తయారీదారులను అదుపులో ఉంచడమే కాకుండా వినియోగదారులకు పారదర్శకతను అందిస్తుంది.

కేంద్ర ప్రభుత్వం త్వరలో ఈ విధానాన్ని అన్ని ఫార్మా సంస్థలకు తప్పనిసరి చేస్తూ దేశవ్యాప్తంగా అమలు చేయాలని నిర్ణయించింది. దీనివల్ల నకిలీ మందుల ప్రమాదం గణనీయంగా తగ్గి ప్రజలకు నమ్మకంగా మందులు అందుబాటులో ఉంటాయని అధికారులు తెలిపారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com/

Read also:

CentralGovernment ConsumerAwareness DrugRegulation FakeMedicines HealthCare HealthIndia PharmaSafety QRCode TrackAndTrace

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.