వంటలో చిన్నచిన్న(Kitchen Tips) మార్పులు చేస్తే ఫలితాలు మరింత రుచికరంగా, ఆరోగ్యకరంగా వస్తాయి. అలాగే ఇంటి పనుల్లో కూడా కొన్ని టిప్స్ ఎంతో సహాయం చేస్తాయి. కిందివి అలాంటి ప్రయోజనకరమైన సూచనలు:
- కేక్ ఎక్కువకాలం తాజాగా ఉండాలంటే
కేక్ బ్యాటర్లో ఒక టేబుల్ స్పూన్ గ్లిజరిన్ కలిపితే కేక్ సాఫ్ట్‌గా, తేమగా ఎక్కువ రోజులు నిలిచి ఉంటుంది. - పూరీలు మృదువుగా రావాలంటే
పిండిని నీళ్లతో కాకుండా పాలతో కలిపి ముద్ద చేస్తే పూరీలు మరింత సాఫ్ట్‌గా, రుచిగా వస్తాయి. - కూరల్లో గ్రేవీ మందంగా కావాలంటే
గ్రేవీకి కొద్దిగా కొబ్బరి పాలు లేదా పెరుగు కలిపితే సూపర్బ్ టెక్స్చర్తోపాటు మంచి రుచి వస్తుంది. - వెండి పాత్రలు మెరవాలంటే
దుంపలు ఉడికించిన నీటితో వెండి పాత్రలను శుభ్రం చేస్తే అవి కొత్తలా మెరిసిపోతాయి. - కాలీఫ్లవర్ వండేటప్పుడు రుచి పెరగాలంటే
కాలీఫ్లవర్ కూరలో ఒక టేబుల్ స్పూన్ పాలు కలిపితే కూర స్మూత్‌గా,(Kitchen Tips) రుచికరంగా తయారవుతుంది.
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: