📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

సైన‌స్ స‌మ‌స్య ఉన్న‌వారికి కొన్ని చిట్కాలు.. నిద్ర లేవగానే అలసటగా ఉంటోందా? ప్రీడయాబెటిస్ లక్షణాలు ..? బొప్పాయి గింజలతో ఆరోగ్య ప్రయోజనాలు పీరియడ్స్‌లో తలస్నానం చేయకూడదా? నిమ్మరసం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు డ‌యాబెటిస్ ఉన్న‌వారు స్వీట్ కార్న్‌ను తిన‌వ‌చ్చా? చలికాలం.. ఈ జాగ్రత్తలు మర్చిపోవద్దు! మైగ్రేన్‌ను శాశ్వతంగా తగ్గించే చిట్కాలు బచ్చలి కూరలో బోలెడన్ని విటమిన్లు సైన‌స్ స‌మ‌స్య ఉన్న‌వారికి కొన్ని చిట్కాలు.. నిద్ర లేవగానే అలసటగా ఉంటోందా? ప్రీడయాబెటిస్ లక్షణాలు ..? బొప్పాయి గింజలతో ఆరోగ్య ప్రయోజనాలు పీరియడ్స్‌లో తలస్నానం చేయకూడదా? నిమ్మరసం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు డ‌యాబెటిస్ ఉన్న‌వారు స్వీట్ కార్న్‌ను తిన‌వ‌చ్చా? చలికాలం.. ఈ జాగ్రత్తలు మర్చిపోవద్దు! మైగ్రేన్‌ను శాశ్వతంగా తగ్గించే చిట్కాలు బచ్చలి కూరలో బోలెడన్ని విటమిన్లు

Waking :ఎక్కువగా వాకింగ్ చేయడం మంచిదేనా? హద్దు మించి చేస్తే..

Author Icon By Sudha
Updated: June 12, 2025 • 5:20 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

నడక ఆరోగ్యాన్ని పెంచడంలో సహాయపడే చాలా సులభమైన వ్యాయామం (exercise). శరీరాన్ని చురుకుగా ఉంచడంలో, మనసును ప్రశాంతంగా ఉంచడంలో ఇది ముఖ్య పాత్ర పోషిస్తుంది. అయితే ఏదైనా హద్దుకు మించి చేస్తే దాని ప్రభావం చెడుగా మారే అవకాశం ఉంది. అదే విధంగా అతి ఎక్కువగా నడవడం (walking)వల్ల కూడా శారీరక సమస్యలు రావచ్చు.

Waking :ఎక్కువగా వాకింగ్ చేయడం మంచిదేనా? హద్దు మించి చేస్తే..

ఆరోగ్య ప్రయోజనాలు
సాధారణంగా చాలా మంది ఆరోగ్యంగా ఉండటానికి రోజుకు 10,000 అడుగులు నడవాలని అనుకుంటారు. కానీ ఇది అందరికీ ఒకేలా వర్తించదు. మీ వయస్సు, ఆరోగ్యం, జీవనశైలి ఆధారంగా ఇది మారవచ్చు. సాధారణంగా 8,000 నుంచి 10,000 అడుగుల వరకు నడవడం వల్ల శరీరానికి అనేక ఆరోగ్య ప్రయోజనాలు వస్తాయి. దీని వల్ల షుగర్ వచ్చే అవకాశాలు తగ్గుతాయి, గుండె సంబంధిత సమస్యలు అదుపులో ఉంటాయి.
మీ శరీరం శక్తి మేరకు నడక పరిమితి ఉండాలి. కొత్తగా నడక ప్రారంభించిన వారు 30 నిమిషాలు నడిస్తే ఇబ్బంది, కీళ్ల నొప్పులు అనుభవించవచ్చు. కానీ అనుభవం ఉన్నవారు గంటల తరబడి నడిచినా ఇబ్బంది లేకుండా ఉండవచ్చు. అయితే శరీరం చెప్పే సంకేతాలను పట్టించుకోకుండా నడిస్తే నెమ్మదిగా సమస్యలు మొదలవుతాయి. అధిక నడక వల్ల వచ్చే సమస్యల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
హద్దు మించి చేస్తే..
గతంలో గాయపడిన కీళ్ల ప్రాంతాల్లో మళ్లీ నొప్పి మొదలవుతుంది. ఎక్కువగా నడవడం వల్ల కీళ్లపై ఒత్తిడి పెరిగి సమస్యలు వస్తాయి. చెప్పులు సరిగా లేకపోవడం లేదా ఎక్కువగా నడవడం వల్ల కాళ్లపై గడ్డలు, బొబ్బలు ఏర్పడతాయి. ఇవి నడిచేటప్పుడు ఇబ్బందిగా మారతాయి.శరీరం అలసిపోయినట్లు అనిపించడం, చిన్న పని చేసినా శ్వాస తీసుకోవడం కష్టంగా అనిపించడం వంటి లక్షణాలు ఎక్కువగా నడుస్తున్నారని సూచిస్తాయి.మొత్తం రోజంతా నడిచిన తర్వాత కాళ్లలో వాపు, నొప్పి రావడం సహజం. ఇది క్రమంగా పెద్ద సమస్యగా మారవచ్చు. నడక మనసుకు శాంతిని ఇవ్వగలిగే శక్తి ఉన్నా.. హద్దు మించి చేస్తే ఆందోళన, నిరాశ, కోపం వంటి భావోద్వేగాలు పెరిగే అవకాశం ఉంటుంది.
తాజాగా నడక మొదలుపెట్టే వారు రోజుకు 15 నిమిషాల పాటు నడవడం ప్రారంభించాలి. ఆ తర్వాత ప్రతి వారం కొద్దిగా సమయం పెంచుకుంటూ 30 నిమిషాల వేగవంతమైన నడక సాధన దిశగా కదలాలి.
నడక సమయంలో నోటితో కాకుండా ముక్కుతో శ్వాస తీసుకోవడం మంచిది. పూర్తి ప్రయోజనాల కోసం వారంలో కనీసం 3 రోజులపాటు నడక చేయడం మంచిది.
పరిమితి అవసరం
నడక ఆరోగ్యానికి ఎంతో ఉపయోగకరమైన సాధనమే అయినా.. దానికి కూడా పరిమితి అవసరం. శరీరానికి విశ్రాంతి ఇవ్వకుండా ఎక్కువగా నడవడం వల్ల దీర్ఘకాలిక నష్టాలు కలుగుతాయి. కాబట్టి నడకను ఒక ఆరోగ్య అలవాటుగా చేసుకోండి కానీ మించిపోకుండా జాగ్రత్త వహించండి.

Read Also:Health: ఆరోగ్య వంతమైన జీర్ణ వ్యవస్థ కోసం..

Breaking News in Telugu Google news Google News in Telugu If you exceed the limit.. Is it good to walk Latest News in Telugu Paper Telugu News Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today Today news too much?

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.