ఇన్‌స్టంట్ నూడుల్స్(Instant Noodles) తక్కువ ఖర్చుతో సింపుల్‌గా, కొన్ని నిమిషాల్లో తయారయ్యే ఆహారం కావడంతో చాలా మంది వీటిని తరచూ తీసుకుంటారు. అయితే నిపుణుల సూచన ప్రకారం, వీటిని వారంలో పలు సార్లు తినడం ఆరోగ్యానికి ప్రమాదకరం. ముఖ్యంగా హృదయ సంబంధిత సమస్యలు, మధుమేహం, మెటాబాలిక్ సంబంధిత రిస్క్‌లు పెరగే అవకాశముంది.
విద్యార్థులు, ఉద్యోగస్తులు, బడ్జెట్ తగ్గించుకునే వారు వీటిని ఎక్కువగా తీసుకోవడం వల్ల వినియోగం రోజురోజుకూ పెరుగుతోంది. ప్రపంచవ్యాప్తంగా, ముఖ్యంగా ఆస్ట్రేలియా వంటి దేశాల్లో కూడా ఆసియా ఫుడ్ ప్రాధాన్యం పెరగడంతో ఇన్‌స్టంట్ నూడుల్స్ మార్కెట్ వేగంగా విస్తరిస్తోంది.
Read Also: Activated Char Coal : యాక్టివేటెడ్ చార్ కోల్ అంటే ఏమిటో తెలుసా..?
ఒక్క ప్యాకెట్ నూడుల్స్‌లో 600–1,500 మిల్లీగ్రాముల వరకు సోడియం ఉంటుంది. అలాగే ఫైబర్, ప్రోటీన్, విటమిన్లు, ఖనిజాలు చాలా తక్కువగా ఉంటాయి. వారానికి రెండు సార్లకు పైగా నూడుల్స్ తీసుకుంటే మహిళల్లో మెటాబాలిక్ సిండ్రోమ్, హార్ట్ వ్యాధులు, డయాబెటిస్ వంటి సమస్యలు వచ్చే ప్రమాదం ఉందని పరిశోధనలు చెబుతున్నాయి.
చక్కెరలతో కూడిన ఆహారం గుండె, కిడ్నీల పై
అధిక ఉప్పు, చక్కెరలతో కూడిన ఆహారం గుండె, కిడ్నీల పై ఒత్తిడిని పెంచుతుంది. అలాగే ఫైబర్ తక్కువగా ఉండటం వల్ల మలబద్ధకం, జీర్ణ సమస్యలు, టైప్-2 డయాబెటిస్ రిస్క్, కాలన్ క్యాన్సర్ అవకాశం పెరుగుతాయి.
అయితే నూడుల్స్ పూర్తిగా మానాల్సిన అవసరం లేదు. వాటిని ఆరోగ్యకరంగా మార్చాలంటే కూరగాయలు, ప్రోటీన్ (గుడ్లు, పనీర్, టోఫు), అలాగే హెల్తీ ఫ్యాట్స్ (ఆలివ్ ఆయిల్, నట్లు) జోడించడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. దీనివల్ల అవసరమైన పోషకాలు అందుతాయి. కానీ ప్రతిరోజూ తినడం మాత్రం మానేయడం ఉత్తమం.
తక్కువ ఖర్చుతో అందుబాటులో ఉండే ఈ ఆహారం సరైన విధంగా తీసుకుంటే డైట్‌లో భాగం కావచ్చు. కానీ బ్యాలన్స్ డైట్, పండ్లు, కూరగాయలు, ఫైబర్‌తో కలిపి తీసుకోవడం ఆరోగ్యానికి మంచిదని నిపుణులు చెబుతున్నారు.
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: