నవంబర్ 26 నుంచి హైటెక్స్‌లో పౌల్ట్రీ ఇండియా ఎక్స్పో – 50 దేశాల ఎగ్జిబిటర్లు పాల్గొననున్నారు
హైదరాబాద్ : ప్రతి ఒక్కరికీ ప్రోటీన్లపై అవగాహన ఉండాలని, శరీరానికి తగిన పోషణ, ఆరోగ్యం (health) ఉండాలంటే కోడి గుడ్లు తినాలని వక్తలు పిలుపు నిచ్చారు. పౌల్ట్రీ ఇండియా, (Indian poultry) ఇండియన్ షౌల్ట్రీ ఎక్విప్మెంట్ మాన్యుఫ్యాక్చ రర్స్ అసోసియేషన్ (ఐపీఈఎంఏ) ఆధ్వర్యంలో నేషనల్ ఎగ్ కోఆర్డినేషన్ కమిటీ (నెక్) సహకారంతో హైదరాబాద్ లోని సోమాజి గూడ ప్రెస్ క్లబ్లో శుక్రవారం వరల్డ్ ఎగ్ డే వేడుకలు 2025 ను నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కె.జి. ఆనంద్, ప్రత్యేక అతిథిగా ఈక్వెస్ట్రియన్ ఛాంపియన్ శుశ్రుత కుమార్ హాజరయ్యారు. ఈ సందర్భంగా పౌల్ట్రీ ఇండియా అధ్యక్షుడు ఉదయ్ సింగ్ బయాస్ మాట్లాడుతూ హైదరాబాద్లోని హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్లో నవంబర్ 26 నుంచి 28 వరకు దక్షి ణాసియాలోనే అతిపెద్ద పౌల్ట్రీ ఎగ్జిబిషన్ అయిన పౌల్ట్రీ ఇండియా ఎక్స్పో -2025 17వ ఎడిషన్ను నిర నిర్వహించనున్నట్లు ప్రకటించారు.
Read also: 3 వేల ఉద్యోగాలకు తెలంగాణ నోటిఫికేషన్
ప్రోటీన్ లోపాన్ని తగ్గించడంలో కోడిగుడ్ల ప్రాధాన్యం పై నిపుణుల అవగాహన
ఈ ఎక్స్ పోలో 50 దేశాలకు చెందిన 500 మంది ఎగ్జిబిటర్లు, 50 వేల మందికి పైగా సందర్శకులు పా ల్గొంటారని పౌల్ట్రీ (Indian poultry) బ్రీడింగ్, ఆటోమేషన్, వెటెరినరీ సైన్స్, సుస్థిర ఫార్మింగ్ లాంటి విషయాల్లో వస్తున్న అత్యాధునిక ఆవిష్కరణల గురించి ఇందులో చర్చిస్తారు. అలాగే నవంబరు 25న ఒక ప్రత్యేక నాలెడ్జ్ డేను హైదరాబాద్ నోవోటెల్లో నిర్వ హిస్తారు. మన దేశంలో పెరుగుతున్న ప్రోటీన్ లోపాన్ని అరికట్టాలన్నా.. అందరికీ అందు బాటులో, తక్కువ ధరలో పోషకాహారం ఇవ్వాలన్నా కోడిగుడ్ల పాత్ర కీలకమని అవగా హన కల్పించారు. ప్రకృతి అందించిన సంపూర్ణ ఆహారంగా నిపుణులు చెప్పే కోడిగుడ్లలో అత్యంత నాణ్యమైన ప్రోటీన్లు, విటమిన్లు, అవసరమైన మినరల్స్ అన్నీ ఉంటాయని, అందువల్ల పిల్లల నుంచి పెద్దలు, వృద్ధులు, అనారోగ్యం నుంచి కోలుకునే రోగులవరకు అందరికీ ఇవి అత్యంత ఉత్తమమైన ఆహారమని చెప్పారు. కార్యక్రమంలో వెట్ కాలేజి డీన్ డాక్టర్ ఉదయ్, ఎపెడా ఏజీఎం ఆర్.పి. నాయుడు, ఎఫ్ఎస్ఎస్ఏఐ డిప్యూటీ డైరెక్టర్ బాలునాయక్, తెలంగాణ పౌల్ట్రీ బ్రీడర్స్ అసోసి యేషన్ ప్రతినిధి డాక్టర్ రవీందర్రెడ్డి, పి. చక్రధరరావు, పౌల్ట్రీ ఇండియా, సురేష్ చిట్టూరీ శ్రీనివాస్, డాక్టర్ బాలస్వామి పాల్గొన్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : https://epaper.vaartha.com/
Read Also: