మహిళల్లో మైగ్రేన్ (Migraine) సమస్య చాలా సాధారణం. ఇది సాధారణ తలనొప్పి కాదని, తలలో ఒకవైపు మాత్రమే తీవ్రమైన నొప్పిగా అనిపించే వ్యాధి అని వైద్యులు చెబుతున్నారు. ముఖ్యంగా నెలసరి సమయం దగ్గరపడినప్పుడు లేదా ఆ రోజుల్లో ఈ నొప్పి ఎక్కువగా వస్తుందని అంటున్నారు. శరీరంలోని హార్మోన్ల మార్పులు, ముఖ్యంగా ఈస్ట్రోజన్ స్థాయిల్లో తగ్గుదల, మైగ్రేన్‌ను ప్రేరేపించే ప్రధాన కారణంగా గుర్తించారు.
Read also: Tamarind Seeds : చింత గింజలతో ఎన్నో అద్భుతమైన లాభాలు
Health: మహిళల్లో మైగ్రేన్‌కి ప్రధాన కారణాలు ఏమిటి?
తగినంత నీరు తాగడం
అలాగే మానసిక ఒత్తిడి, నిద్రలేమి, ఎక్కువ శ్రమ, బలమైన వెలుతురు, శబ్దం, మత్తు పదార్థాలు తీసుకోవడం లేదా ధూమపానం వంటి అలవాట్లు కూడా మైగ్రేన్ దాడులను పెంచుతాయని నిపుణులు సూచిస్తున్నారు. మైగ్రేన్ సమస్యను తగ్గించుకోవాలంటే సమయానికి నిద్రపోవడం, తగినంత నీరు తాగడం, కాఫీన్ అధికంగా తీసుకోకుండా ఉండడం, పోషకాహారంతో కూడిన ఆహారం తీసుకోవడం, యోగా లేదా ధ్యానం చేయడం వల్ల ఉపశమనం లభిస్తుందని వైద్యులు చెబుతున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com/
Read Also: