📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

కిడ్నీ సమస్యలను గుర్తించే కంటి సంకేతాలు సైన‌స్ స‌మ‌స్య ఉన్న‌వారికి కొన్ని చిట్కాలు.. నిద్ర లేవగానే అలసటగా ఉంటోందా? ప్రీడయాబెటిస్ లక్షణాలు ..? బొప్పాయి గింజలతో ఆరోగ్య ప్రయోజనాలు పీరియడ్స్‌లో తలస్నానం చేయకూడదా? నిమ్మరసం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు డ‌యాబెటిస్ ఉన్న‌వారు స్వీట్ కార్న్‌ను తిన‌వ‌చ్చా? చలికాలం.. ఈ జాగ్రత్తలు మర్చిపోవద్దు! మైగ్రేన్‌ను శాశ్వతంగా తగ్గించే చిట్కాలు కిడ్నీ సమస్యలను గుర్తించే కంటి సంకేతాలు సైన‌స్ స‌మ‌స్య ఉన్న‌వారికి కొన్ని చిట్కాలు.. నిద్ర లేవగానే అలసటగా ఉంటోందా? ప్రీడయాబెటిస్ లక్షణాలు ..? బొప్పాయి గింజలతో ఆరోగ్య ప్రయోజనాలు పీరియడ్స్‌లో తలస్నానం చేయకూడదా? నిమ్మరసం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు డ‌యాబెటిస్ ఉన్న‌వారు స్వీట్ కార్న్‌ను తిన‌వ‌చ్చా? చలికాలం.. ఈ జాగ్రత్తలు మర్చిపోవద్దు! మైగ్రేన్‌ను శాశ్వతంగా తగ్గించే చిట్కాలు

Today News : Health – రుమటైడ్‌ ఆర్థ్రరైటిస్‌ వ్యాధిగ్రస్తులు ఆందోళన చెందవద్దు – కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి

Author Icon By Shravan
Updated: August 25, 2025 • 3:01 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

Health : రుమటైడ్‌ ఆర్థ్రరైటిస్‌ వ్యాధిగ్రస్తులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వ్యాధి నిర్ధారణతో పాటు వైద్యంలో అధునాతన టెక్నాలజీలు (Technologies) అందుబాటులో ఉన్నాయని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి అన్నారు. ఆదివారం నోవాటెల్‌ హోటల్‌లో సౌత్‌ జోన్‌ ఇండియన్‌ రుమటాలజీ అసోసియేషన్‌ (సిజ్రికాన్‌) 2025 లో భాగంగా డాక్టర్‌ విజయ ప్రసన్న నిర్వహించిన పేషంట్‌ సపోర్ట్‌ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వ్యాధి నిర్ధారణ అయిందని బాధ పడవద్దని పాజిటీవ్‌ థింకింగ్‌తో ముందుకు సాగాలని ప్రతీ సమస్యకు పరిష్కారం ఉంటుందని ఒకప్పుడు క్యాన్సర్‌ వస్తే చనిపోయే వారని అంతటి ప్రాణాంతక వ్యాధులకు కూడా ఇప్పుడు అధునాతన వైద్యం అందుబాటులోకి వచ్చి విజయవంతంగా రోగాన్ని జయిస్తున్నారని అన్నారు. తాను కూడా తన తల్లి కోమటిరెడ్డి సుశీల ఫౌండేషన్‌ పేరుతో రోగులకు (Patients) సహాయ సహకారాలు అందిస్తున్నానని అన్నారు. శ్రీమంతులు అయి ఉండి, సమాజంలో మంచి పొజీషన్‌లో ఉన్నవారు పేద వాళ్ళకు ఏదో ఒకటి చేయకపోతే అదో నేరంగా తాను భావిస్తానని అన్నారు.

Health – రుమటైడ్‌ ఆర్థ్రరైటిస్‌ వ్యాధిగ్రస్తులు ఆందోళన చెందవద్దు – కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి

రుమటాలజీ వ్యాధులపై అవగాహన లోపం, వైద్యుల సూచనలు

రుమటాలజీ సీనియర్‌ డాక్టర్‌ లీజా రాజశేఖర్‌ మాట్లాడుతూ రుమటాలజి వ్యాధుల గురించి చాలా మందికి అవగాహన లేదని ప్రాథమిక దశలోనే గుర్తించి మంచి వైద్యం అందించి వారిని మామూలువారిగా తయారు చేయవచ్చునని దాన్ని నిర్ధారించే లోపే చాలా మందిలో అది ముదిరిపోతున్నదని అది మరింత ప్రమాదకరంగా మారుతున్నదని అన్నారు. ఈ వ్యాధిగ్రస్తులకు ప్రభుత్వం నుంచి, స్వచ్ఛంద సంస్థల నుంచి సహకారం కావాలని, అలాగే ఇన్సూరెన్స్‌ కంపెనీలు కూడా ఇబ్బందులు పెడుతున్నాయని వారితో కూడా ప్రభుత్వం చర్చించాలని అన్నారు. ఈ సందర్భంగా వ్యాధిగ్రస్తులు తాము ఎదుర్కొంటున్న పలు సమస్యలను ఈ సందర్భంగా వైద్యుల దృష్టికి, ఇన్సూరెన్స్, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధుల దృష్టికి తీసుకొచ్చారు. ఈ కార్యక్రమంలో ఇండియన్‌ రుమటాలజి అసోసియేషన్‌ అద్యక్షుడు డాక్టర్‌ చంద్రశేఖర, డాక్టర్‌ రాజ్‌ కిరణ్, డాక్టర్‌ రాజేంద్ర వర ప్రసాద్, డాక్టర్‌ వినోద్‌ రవీంద్రన్, డాక్టర్‌ పని కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

READ HINDI NEWS : hindi.vaartha.com

READ ALSO :

https://vaartha.com/diabetes-type-1-in-women-type-2-in-men-latest-study/health/535773/

Arthritis Awareness Arthritis Patients Breaking News in Telugu Health News Komatireddy Rajagopal Reddy Latest News in Telugu Rheumatoid arthritis Telugu News Paper

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.