ప్రోటీన్ల పుష్కలంగా ఉండే తోటకూర
తోటకూరను ఇతర ఆకుకూరలతో పోలిస్తే ఇందులో ప్రోటీన్లు గణనీయంగా ఎక్కువగా ఉంటాయి. ఈ కూరను నియమం ప్రకారం తీసుకుంటే కండరాల బలం పెరిగి, శరీర దారుఢ్యం మెరుగవుతుంది. కండరాలకు కావాల్సిన అమైనో ఆమ్లాలు ఇందులో సహజంగా లభించటం వల్ల శక్తి ఉత్సాహం పెరిగి అలసట తగ్గుతుంది. అలాగే తోటకూర (Amaranth) లో ఉన్న క్యాల్షియం ఎముకలకు బలం చేకూర్చి వృద్ధాప్యంలో వచ్చే ఎముకల బలహీనత, ఆస్టియోపోరోసిస్ వంటి సమస్యలను దూరంగా ఉంచుతుంది. పాలు తినని వారికి ఇది మంచి ప్రత్యామ్నాయంగా ఉపయోగపడుతుంది.
Read also: Premature babies: ముందస్తుగా పుట్టిన శిశువులకు ప్రత్యేక సంరక్షణ ఎందుకు అవసరం?
Health: Don’t take vegetables lightly..
గర్భిణీలకు ఉపయోగాలు
తోటకూరలో విటమిన్ K, ఐరన్, ఫోలేట్ వంటి ముఖ్య పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. ఇవి శరీరంలో రక్తం గడ్డకట్టేందుకు సహాయపడటం ద్వారా రక్తస్రావ సమస్యలను తగ్గిస్తాయి. ఐరన్, ఫోలేట్ అధికంగా ఉండటం వల్ల హిమోగ్లోబిన్ పెరుగుతుంది. గర్భిణీలు తోటకూరను తీసుకుంటే శిశువు అభివృద్ధికి అవసరమైన ఫోలేట్ లభించి పుట్టుకలో లోపాలను నివారించేందుకు తోడ్పడుతుంది. ఈ కూరలో ఫైబర్ కూడా బాగా ఉండటంతో జీర్ణక్రియ మెరుగై మలబద్ధకం తగ్గుతుంది.
కంటి ఆరోగ్యం కోసం
తోటకూరలో విటమిన్ A, ల్యూటీన్, జియాజాంతిన్ వంటి యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి కళ్ల రెటీనాను రక్షించి చూపు బాగుండేలా చేస్తాయి. రెగ్యులర్‌గా తోటకూర తీసుకుంటే కంటి పొడిబారటం, చూపు మందగించడం వంటి సమస్యలు తగ్గుతాయి. అంతేకాదు శరీర రోగనిరోధక శక్తిని పెంచడంలో కూడా ఇవి కీలక పాత్ర పోషిస్తాయి. తోటకూరను రోజూ తినాలనుకుంటే ఉడికించి గుప్పెడు మోతాదులో తినడం లేదా తోటకూరరసం 30 ml వరకు తీసుకోవడం మంచిది.
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: