తల్లిదండ్రులకు పెద్ద హెచ్చరిక.. చిన్నారుల్లో షుగర్ (Diabetes) వ్యాధి పెరుగుతోంది. గతంలో పెద్దవారికి మాత్రమే వచ్చే డయాబెటిస్ ఇప్పుడు చిన్నారుల్లో కూడా కనిపిస్తోంది. కేవలం 8–10 ఏళ్ల పిల్లల్లో ఊబకాయం, టైప్ 2 డయాబెటిస్ లక్షణాలు బయటపడడం ఆందోళన కలిగిస్తోంది. మారిన జీవనశైలి, ఆహార అలవాట్లు, ఎక్కువ స్క్రీన్ సమయం, నిద్రలేమి, జన్యువుల ప్రభావం ఈ సమస్యకు ప్రధాన కారణాలని నిపుణులు చెబుతున్నారు. తగిన జాగ్రత్తలు తీసుకుంటే ఈ పరిస్థితిని నియంత్రించవచ్చు.
Read also: Pregnancy: ప్రెగ్నెన్సీలో ‘ఇద్దరి కోసం తినాలి’ అన్న అపోహ?
Diabetes is a threat to children
అల్ట్రా ప్రాసెస్ చేసిన ఆహారo
చిన్నారుల్లో ఊబకాయం పెరగడానికి అనేక కారణాలు ఉన్నాయి. తక్కువ శారీరక శ్రమ, అల్ట్రా ప్రాసెస్ చేసిన ఆహారాల అధిక వినియోగం, ఎక్కువ స్క్రీన్ టైమ్ వంటి జీవనశైలి మార్పులు రక్తంలో ఇన్సులిన్ ఫంక్షన్‌ను ప్రభావితం చేస్తాయి. ఎక్కువ కేలరీలు, తక్కువ పోషక విలువలున్న ఫాస్ట్ ఫుడ్, చాక్లెట్, చక్కెర కలిగిన డ్రింక్స్ ఈ సమస్యను మరింత తీవ్రతరం చేస్తాయి.
తల్లిదండ్రులు తీసుకోవలసిన చర్యలు ముఖ్యమైనవి. రోజుకు కనీసం 45–60 నిమిషాలు పిల్లలను ఆరుబయట క్రీడలు చేయించాలి. చిప్స్, బిస్కెట్స్, చాక్లెట్లకు బదులు పండ్లు, నట్స్, ఇంట్లో తయారు చేసిన ఆరోగ్యకరమైన స్నాక్స్ ఇవ్వాలి. సోడా, ఎనర్జీ డ్రింక్స్‌కు బదులు నీటిని ప్రోత్సహించాలి. రాత్రి 10 గంటలకు ముందు పిల్లలు పడుకునేలా సరైన నిద్ర సమయాన్ని పాటించాలి. అలాగే క్రమం తప్పకుండా బరువు, రక్త చక్కెర, కొలెస్ట్రాల్ స్థాయిలను తనిఖీ చేయడం అవసరం. సక్రమమైన ఆహారం, చురుకైన జీవనం, వైద్య సలహా ద్వారా చిన్నారుల్లో షుగర్ వ్యాధి ముప్పును తగ్గించవచ్చు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com/
Read Also: