బొద్దింకలు (Cockroaches) ఇంట్లో తిరుగుతూ ఆహారంపై మలవిసర్జన చేయడం వల్ల సాల్మొనెలోసిస్, గ్యాస్ట్రోఎంటెరిటిస్, అలెర్జీలు–ఆస్తమా, ఫుడ్ పాయిజనింగ్, స్టెఫిలోకాకస్ ఇన్ఫెక్షన్లు, టైఫాయిడ్–కలరా వంటి ఆరు ప్రమాదకరమైన వ్యాధులు వచ్చే అవకాశం ఉంటుంది. ఇవి పిల్లలు, వృద్ధులు, తక్కువ రోగనిరోధక శక్తి ఉన్నవారికి మరింత ప్రమాదకరం. అందుకే ఇంటిని శుభ్రంగా ఉంచడం, చెత్తను వెంటనే పారేయడం, తినే ఆహారాన్ని ఎప్పుడూ మూత పెట్టి ఉంచడం, వారానికోసారి కిచెన్ పూర్తిగా శుభ్రం చేయడం ఎంతో అవసరం. ఈ జాగ్రత్తలు పాటించడం ద్వారా బొద్దింకల వల్ల వచ్చే ఆరోగ్య సమస్యలను గణనీయంగా తగ్గించుకోవచ్చు.
Read also: Hair Growth : జుట్టు వేగంగా పెరగడానికి ఈ ఆహారాలను తీసుకోండి..
బొద్దింకల వల్ల వచ్చే ఆరు ముఖ్యమైన ఆరోగ్య సమస్యలు ఇవీ
- సాల్మొనెలోసిస్: కడుపు నొప్పి, విరేచనాలు, జ్వరం.
- గ్యాస్ట్రోఎంటెరిటిస్: వాంతులు, డయరియా.
- అలెర్జీలు, ఆస్తమా: చర్మం, మల, లాలాజలం ద్వారా వ్యాప్తి.
- ఫుడ్ పాయిజనింగ్, స్టెఫిలోకాకస్ ఇన్ఫెక్షన్స్, టైఫాయిడ్, కలరా.
బొద్దింకల నుంచి రక్షించుకోవడానికి
ఈ పద్ధతులు పాటించడం ద్వారా ఆరోగ్యానికి హాని కలిగించే బొద్దింకల ప్రభావం తగ్గించవచ్చు. ఇంటిని శుభ్రంగా ఉంచడం, బొద్దింకలను తరిమికొట్టడం. ఇంట్లో చెత్తను సరిగా తీసేయడం, ఆహారాన్ని మూతతో ఉంచడం. వారానికోసారి కిచెన్, ఫ్రిజ్ శుభ్రం చేయడం.
Read hindi news:hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com/
Read Also: