అవకాడోలో సమృద్ధిగా ఉండే విటమిన్–E, హెల్తీ ఫ్యాట్స్, అమైనో యాసిడ్స్ జుట్టు వేర్లను బలపరుస్తాయి. ఇవి తల చర్మంలో రక్త ప్రసరణ పెంచి కొత్త హెయిర్ గ్రోత్‌కు(Hair care) సహాయపడతాయి. అలాగే డ్రై హెయిర్‌ను మాయిశ్చరైజ్ చేసి నేచురల్ షైన్ ఇస్తాయి. అవకాడోను అరటిపండుతో కలిపి చేసిన పేస్ట్ హెయిర్‌కు(Hair care) అవసరమైన న్యూట్రియెంట్స్ అందిస్తుంది. ఇందులోని సహజ నూనెలు జుట్టు చివర్లను మృదువుగా చేసి చిట్లడాన్ని తగ్గిస్తాయి. జుట్టు తేమను నిలుపుకోవడంలో ఇది చాలా ఉపయోగపడుతుంది.
కావలసిన పదార్థాలు
- పండిన అవకాడో – 1
- అరటి పండు – 1
- ఆలివ్ ఆయిల్ – 1 టేబుల్ స్పూన్
తయారీ & విధానం
అవకాడో, అరటిపండును బాగా మెదిపి పేస్ట్‌లా చేసుకోవాలి. అందులో ఆలివ్ ఆయిల్ వేసి కలపాలి. ఈ మిశ్రమాన్ని జుట్టు వేర్ల నుండి చివర్ల వరకు పట్టించాలి. సుమారు ఒక గంట తర్వాత మైల్డ్ షాంపూతో తలస్నానం చేయాలి. ఇలా 15 రోజులకు ఒకసారి చేస్తే జుట్టు బలంగా, మెరిసేలా, త్వరగా పెరుగుతుంది.
Read hindi news: https://hindi.vaartha.com
Epaper : https://epaper.vaartha.com/
Read also :