📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం నేటి బంగారం ధర బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! భారీగా ఇండిగో విమానాలు రద్దు కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం నేటి బంగారం ధర బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! భారీగా ఇండిగో విమానాలు రద్దు కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్

Phool Makhana:ఆరోగ్యానికి మేలు చేస్తుంది కానీ అందరికీ కాదు!

Author Icon By Pooja
Updated: November 5, 2025 • 4:51 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

మునుపటి కాలంలో పూజలు, పండుగలు, ఉపవాసాల సమయంలో మఖానాను(Phool Makhana) ఎక్కువగా తీసుకునే వారు. ఇప్పుడు మాత్రం ఆరోగ్యంపై అవగాహన పెరగడంతో చాలా మంది దానిని తమ డైట్‌లో భాగం చేసుకుంటున్నారు. ‘ఫాక్స్ నట్స్’ లేదా ‘లోటస్ సీడ్స్’ పేర్లతో ప్రసిద్ధి పొందిన మఖానాను సూపర్‌ఫుడ్‌గా పరిగణిస్తారు. తక్కువ కేలరీలు, అధిక ఫైబర్, యాంటీఆక్సిడెంట్లు(Antioxidants), ఖనిజాలు ఉండటంతో ఇది ఆరోగ్యానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. అయితే అందరికీ ఇది అనుకూలం కాకపోవచ్చు. కొన్ని సందర్భాల్లో ఇది ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది.

Read Also: Breakfast: అల్పాహారం తినకపోయినా పరవలేదా?

Phool Makhana

మఖానా వల్ల ఎవరికీ హాని కలుగుతుంది?

కిడ్నీ సమస్యలున్నవారు:
మఖానాలో పొటాషియం అధికంగా ఉంటుంది. మూత్రపిండాల వ్యాధులు ఉన్నవారిలో శరీరంలోని పొటాషియం స్థాయిలను సరిగా నియంత్రించలేకపోవడం వల్ల హృదయ స్పందనలో అవకతవకలు రావచ్చు. ఇది తీవ్రమైన ఆరోగ్య సమస్యలకు దారితీసే అవకాశం ఉంది.

మధుమేహం ఉన్నవారు:
మఖానా (Phool Makhana)తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ ఆహారంగా పరిగణించినప్పటికీ, దీన్ని ఎక్కువ పరిమాణంలో తీసుకుంటే రక్తంలో చక్కెర స్థాయిల్లో మార్పులు వస్తాయి. కాబట్టి డయాబెటిక్ రోగులు మఖానాను పరిమితంగా మాత్రమే తీసుకోవడం మంచిది.

జీర్ణ సమస్యలున్నవారు:
మఖానాలో ఉన్న అధిక ఫైబర్ జీర్ణవ్యవస్థ బలహీనంగా ఉన్నవారికి ఇబ్బందులు కలిగించవచ్చు. ఎక్కువగా తినడం వల్ల గ్యాస్, మలబద్ధకం, పొట్ట ఉబ్బరం వంటి సమస్యలు వస్తాయి.

అలెర్జీ ఉన్నవారు:
కొంతమందికి మఖానా తింటే చర్మంపై దురద, దద్దుర్లు లేదా శ్వాసలో ఇబ్బంది వంటి అలెర్జీ లక్షణాలు కనిపించవచ్చు. ఇలాంటి వారు దీన్ని పూర్తిగా నివారించాలి.

బరువు తగ్గాలనుకునేవారు:
మఖానాను వేయించే సమయంలో నెయ్యి లేదా నూనె ఉపయోగిస్తే అదనపు కొవ్వు, కేలరీలు చేరతాయి. ఇది బరువు తగ్గే ప్రయత్నాలను దెబ్బతీస్తుంది.మొత్తానికి, మఖానా పోషకమైన ఆహారం అయినప్పటికీ, దాన్ని పరిమిత పరిమాణంలో తీసుకోవడం, ఆరోగ్య సమస్యలు ఉన్నవారు వైద్యుడి సలహా తీసుకోవడం అవసరం.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com/

Read Also:

Fox Nuts healthy food Lotus Seeds Today news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.