📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

కిడ్నీ సమస్యలను గుర్తించే కంటి సంకేతాలు సైన‌స్ స‌మ‌స్య? కొన్ని చిట్కాలు.. నిద్ర లేవగానే అలసటగా ఉంటోందా? ప్రీడయాబెటిస్ లక్షణాలు ..? బొప్పాయి గింజలతో ఆరోగ్య ప్రయోజనాలు పీరియడ్స్‌లో తలస్నానం చేయకూడదా? నిమ్మరసం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు డ‌యాబెటిస్ ఉన్న‌వారు స్వీట్ కార్న్‌ను తిన‌వ‌చ్చా? చలికాలం.. ఈ జాగ్రత్తలు మర్చిపోవద్దు! మైగ్రేన్‌ను శాశ్వతంగా తగ్గించే చిట్కాలు కిడ్నీ సమస్యలను గుర్తించే కంటి సంకేతాలు సైన‌స్ స‌మ‌స్య? కొన్ని చిట్కాలు.. నిద్ర లేవగానే అలసటగా ఉంటోందా? ప్రీడయాబెటిస్ లక్షణాలు ..? బొప్పాయి గింజలతో ఆరోగ్య ప్రయోజనాలు పీరియడ్స్‌లో తలస్నానం చేయకూడదా? నిమ్మరసం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు డ‌యాబెటిస్ ఉన్న‌వారు స్వీట్ కార్న్‌ను తిన‌వ‌చ్చా? చలికాలం.. ఈ జాగ్రత్తలు మర్చిపోవద్దు! మైగ్రేన్‌ను శాశ్వతంగా తగ్గించే చిట్కాలు

Garlic And Ghee : రోజూ వెల్లుల్లి, నెయ్యిని కలిపి తీసుకుంటే ఎన్నో లాభాలు..

Author Icon By Sudha
Updated: March 14, 2026 • 11:21 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

భార‌తీయ వంట‌కాల్లో వెల్లుల్లిని, నెయ్యిని ఎంతో కాలంగా విరివిగా ఉప‌యోగిస్తూ ఉన్నారు. ఇవి రెండు కూడా అనేక ఆరోగ్య ప్ర‌యోజ‌నాల‌ను అందిస్తాయి. వీటిని తీసుకోవ‌డం వ‌ల్ల మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు క‌లుగుతుంది. అయితే వీటిని వంట‌ల్లో వాడ‌డానికి బ‌దులుగా ఉద‌యం ప‌ర‌గ‌డుపున తీసుకోవ‌డం వ‌ల్ల మ‌నం మ‌రిన్ని ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చు. వెల్లుల్లిని, నెయ్యిని (Garlic And Ghee )ఖాళీ క‌డుపున తీసుకోవ‌డం వ‌ల్ల క్యాన్స‌ర్ ప్ర‌మాదం త‌గ్గడంతో పాటు గుండె జ‌బ్బులు రాకుండా ఉంటాయి. లైంగిక శ‌క్తి పెరుగుతుంది. ర‌క్త‌పోటు, కొలెస్ట్రాల్ వంటి స‌మ‌స్య‌లు అదుపులో ఉంటాయి. ఇవి రెండు కూడా మ‌న మొత్తం శ‌రీర ఆరోగ్యానికి మేలు చేస్తాయని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. ఆయుర్వేదంలో వీటిని ఎంతో కాలంగా అనారోగ్య స‌మ‌స్య‌లు త‌గ్గించ‌డానికి ఔష‌ధాలుగా వాడుతున్నారు. వీటిని తీసుకోవ‌డం వ‌ల్ల అనేక అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను దూరం చేసుకోవ‌చ్చు.

Read Also: http://Gut Health: పేగులు ఆరోగ్యంగా ఉండాలంటే ఇవి తీసుకోండి

Garlic And Ghee

క్యాన్స‌ర్ ప్ర‌మాదం త‌గ్గుతుంది

ముఖ్యంగా వెల్లుల్లిని, నెయ్యిని (Garlic And Ghee)తీసుకోవ‌డం వ‌ల్ల క్యాన్స‌ర్ ప్ర‌మాదం త‌గ్గుతుంద‌ని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. నెయ్యిలో యాంటీ ఆక్సిడెంట్ల‌తో పాటు యాంటీ ఇన్‌ఫ్లామేట‌రీ ల‌క్ష‌ణాలు ఉంటాయి. నెయ్యి దాని బ‌యోయాక్టివ్ స‌మ్మేళ‌నాల‌కు చాలా ప్ర‌సిద్ది చెందింది. క్యాన్స‌ర్ కార‌కాల నిర్మాణంలో పాల్గొనే కొన్ని ఎంజైమ్ ల కార్య‌క‌లాపాల‌ను త‌గ్గించ‌డంలో నెయ్యి మ‌న‌కు దోహ‌ద‌ప‌డుతుంది. అలాగే వెల్లుల్లిలో అల్లిసిన్ అనే స‌మ్మేళ‌నాలు ఉంటాయి. ఈ స‌మ్మేళ‌నాలు క్యాన్స‌ర్ క‌ణాల పెరుగుద‌ల‌ను నెమ్మ‌దిస్తాయ‌ని ప్ర‌యోగాల ద్వారా వెల్ల‌డించారు. ఆహారం లో భాగంగా వెల్లుల్లిని తీసుకోవ‌డం వ‌ల్ల జీర్ణాశ‌యం, పెద్ద‌పేగు క్యాన్స‌ర్ ప్ర‌మాదాన్ని త‌గ్గించ‌వ‌చ్చ‌ని వైద్యులు చెబుతు న్నారు. అంతేకాకుండా వెల్లుల్లిని, నెయ్యిని తీసుకోవ‌డం వ‌ల్ల మ‌నం ఇత‌ర ఆరోగ్య ప్ర‌యోజ‌నాల‌ను కూడా పొంద‌వ‌చ్చు.

Garlic And Ghee

జుట్టు ఆరోగ్యాన్ని మెరుగుప‌రుస్తుంది

వెల్లుల్లిని స‌హ‌జ కామోద్దీప‌న‌కారిగా వ‌ర్ణిస్తారు. వెల్లుల్లిని తీసుకోవ‌డం వ‌ల్ల లైంగిక అవ‌య‌వాల‌కు ర‌క్త‌ప్ర‌వాహం పెరుగుతుంది. లైంగిక ప‌నితీరుపై ప‌రోక్ష ప్ర‌భావాల‌ను చూపుతుంది. నెయ్యిని తీసుకోవ‌డం వ‌ల్ల శ‌క్తి ల‌భిస్తుంది. లైంగిక ప‌నితీరు మెరుగుప‌డ‌డానికి ఇది దోహ‌ద‌ప‌డుతుంది. చ‌ర్మం, జుట్టు ఆరోగ్యాన్ని మెరుగుప‌ర‌చ‌డంలో కూడా వెల్లుల్లి, నెయ్యి మ‌న‌కు స‌హాయ‌ప‌డతాయి. వెల్లుల్లిలో ఆక్సీక‌ర‌ణ ఒత్తిడిని త‌ట్టుకునే యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. వెల్లుల్లిని ఖాళీ క‌డుపుతో తీసుకోవ‌డం వ‌ల్ల చ‌ర్మ ఆరోగ్యం మెరుగుప‌డుతుంది. వెల్లుల్లిని , నెయ్యిని క‌లిపి తీసుకోవ‌డం వ‌ల్ల జుట్టు పెరుగుద‌ల‌కు కావ‌ల్సిన పోష‌కాలు ల‌భిస్తాయి. జుట్టు రాల‌డం త‌గ్గుతుంది. అదే విధంగా ర‌క్త‌పోటు ఉన్న వారు వెల్లుల్లిని తీసుకోవ‌డం వ‌ల్ల ర‌క్త‌పోటు స్వల్పంగా త‌గ్గుతుంది. శ‌రీరంలో జీవ‌క్రియ‌ల‌ను పెంచి కొలెస్ట్రాల్ క‌రిగేలా చేయ‌డంలో కూడా వెల్లుల్లి మ‌న‌కు దోహ‌ద‌ప‌డుతుంది. ఈ విధంగా వెల్లుల్లి, నెయ్యి మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని వీటిని తీసుకోవ‌డం వ‌ల్ల మొత్తం ఆరోగ్యానికి మేలు కలుగుతుంద‌ని నిపుణులు చెబుతున్నారు. అయితే నెయ్యిని మితంగా తీసుకోవ‌డం కూడా చాలా అవ‌స‌ర‌మ‌ని వారు సూచిస్తున్నారు.

Read hindi news : hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read Also:

#Garlic #telugu News Ayurveda Breaking News ghee health benefits latest news natural remedies

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.