📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

సైన‌స్ స‌మ‌స్య ఉన్న‌వారికి కొన్ని చిట్కాలు.. నిద్ర లేవగానే అలసటగా ఉంటోందా? ప్రీడయాబెటిస్ లక్షణాలు ..? బొప్పాయి గింజలతో ఆరోగ్య ప్రయోజనాలు పీరియడ్స్‌లో తలస్నానం చేయకూడదా? నిమ్మరసం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు డ‌యాబెటిస్ ఉన్న‌వారు స్వీట్ కార్న్‌ను తిన‌వ‌చ్చా? చలికాలం.. ఈ జాగ్రత్తలు మర్చిపోవద్దు! మైగ్రేన్‌ను శాశ్వతంగా తగ్గించే చిట్కాలు బచ్చలి కూరలో బోలెడన్ని విటమిన్లు సైన‌స్ స‌మ‌స్య ఉన్న‌వారికి కొన్ని చిట్కాలు.. నిద్ర లేవగానే అలసటగా ఉంటోందా? ప్రీడయాబెటిస్ లక్షణాలు ..? బొప్పాయి గింజలతో ఆరోగ్య ప్రయోజనాలు పీరియడ్స్‌లో తలస్నానం చేయకూడదా? నిమ్మరసం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు డ‌యాబెటిస్ ఉన్న‌వారు స్వీట్ కార్న్‌ను తిన‌వ‌చ్చా? చలికాలం.. ఈ జాగ్రత్తలు మర్చిపోవద్దు! మైగ్రేన్‌ను శాశ్వతంగా తగ్గించే చిట్కాలు బచ్చలి కూరలో బోలెడన్ని విటమిన్లు

Egg: గుడ్డు మాంసాహారమా? శాఖాహారమా? – సైన్స్ ఏం చెబుతుందంటే?

Author Icon By Sharanya
Updated: June 1, 2025 • 6:20 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

గుడ్డు అనేది పోషక విలువల పరంగా అద్భుతమైన ఆహారం. ఇందులో పుష్కలంగా ఉండే ప్రోటీన్, బీ కాంప్లెక్స్ విటమిన్లు, విటమిన్ డీ, ఐరన్, జింక్, సెలెనియం లాంటి ఖనిజాలు దాన్ని “సూపర్ ఫుడ్” స్థాయికి తీసుకెళ్తాయి. కానీ ఈ గుడ్డు శాఖాహారం కాదా? మాంసాహారమా? అనే ప్రశ్న మాత్రం తరచూ వస్తూ ఉంటుంది.

శాస్త్రీయ నిర్వచనం ఏమిటి?

శాస్త్రీయంగా పరిశీలించినప్పుడు, శాకాహారం అంటే — జంతువులను చంపకుండా తీసుకునే ఆహారం అని నిర్వచించబడుతుంది. దాని ప్రకారం ఈ కోణంలో చూస్తే గుడ్డు శాఖాహారంగానే పరిగణించాలి. ఇలాంటి ఆహారం తీసుకునే వ్యక్తులను ఓవో-వెజిటేరియన్స్‌ అంటారు. సైన్స్‌ను పక్కనపెడితే భారతీయులు మాత్రం గుడ్డును మాంసాహారంగా పరిగణిస్తారు. అందుకే శాఖాహారులు వీటిని తినరు. సైన్స్ కోణం నుంచి చూస్తే గుడ్లు 2 రకాలు. ఫలదీకరణం గుడ్లు, ఫలదీకరణం చేయని గుడ్లు. మొదటి రకం గుడ్డులోంచి కోడి పిల్ల బయటకు వస్తుంది. ఇక రెండో రకం గుడ్డు కేవలం ఆహారం కోసం ఉపయోగించే గుడ్లు. అంటే వీటి నుంచి కోడి పల్లలు బయటికిరావు.

గుడ్లు రెండు రకాలన్నది మీకు తెలుసా?

ఫలదీకరణం గుడ్లు (Fertilized Eggs) – ఇవి కోడి మరియు కోడి పుంజు మధ్య పునరుత్పత్తి చర్య ఫలితంగా ఉత్పన్నమయ్యే గుడ్లు. వీటిలో నుంచి కోడి పిల్లలు బయటకు రావొచ్చు.

ఫలదీకరణం చేయని గుడ్లు (Unfertilized Eggs) – ఇవి కోడి పుంజు లేకుండానే ఉత్పత్తి అవుతాయి. ఇవి తినే గుడ్లుగా మార్కెట్‌లో లభ్యమవుతాయి. ఇవి అసలు కోడి పిల్లగా మారే అవకాశం లేదు. మార్కెట్‌లో దొరుకే 99% గుడ్లు ఈ రెండో రకానికి చెందినవే. కాబట్టి ఇవి శాకాహారంగా పరిగణించవచ్చు.

    కోడి పెట్ట, కోడి పుంజుల పునరుత్పత్తి చర్య వల్ల పెట్టిన కోడి గుడ్డును ఫలదీకరణ గుడ్డు అంటారు. కోడి పుంజు సహకారంలేకుండా పెట్టిన గుడ్డును ఫలదీకరణం చేయని గుడ్డు అంటారు. గుడ్డులోపల కోడి పిల్ల అభివృద్ధి చెందని గుడ్లను కోళ్ల ఫారంలలో సేద్యం చేస్తారు. ఇటువంటి గుడ్డను శాఖాహారంగా పరిగణించవచ్చని శాస్త్రవేత్తలు అంటున్నారు.

    అయితే కొన్ని గుడ్లలో అప్పుడప్పుడు రక్తపు చుక్కలు కనిపిస్తాయి. సైన్స్ భాషలో దీనిని మీట్ స్పాట్ అంటారు. గుడ్డు ఫలదీకరణం చెందిందని దీని అర్థం కాదు. కోడి శరీరంలో గుడ్డు తయారవుతున్నప్పుడు రక్తనాళాలు దెబ్బతింటాయి. దాని ప్రభావం వల్లనే గుడ్డులో రక్తం చుక్కలు కనిపిస్తాయి.

    శాస్త్రీయంగా చూస్తే గుడ్డు శాకాహారమే. కానీ సాంప్రదాయ, మతపరమైన కోణంలో అది మాంసాహారంగా పరిగణించబడుతుంది.

    read also: Ragi chapati: రాగి పిండి చపాతీలో ప్రోటీన్‌ అధికం

    Eye Health: పదిలమైన కంటి చూపు కోసం..

    #Egg #EggDiet #EggFacts #non-vegetarian #ScienceBehindEgg #vegetarian Breaking News Today In Telugu Google News in Telugu India News Today in Telugu Latest News in Telugu Latest News today in Telugu News in Telugu Today Telugu News Today Today News In Telugu Today Telugu News

    గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.