हिन्दी | Epaper

HeartAttack: ఉదయాన్నే ఇవి తినడం వల్ల గుండెపోటుకు చెక్ పెట్టొచ్చు..అవేంటో తెలుసుకోండి..

Anusha
HeartAttack: ఉదయాన్నే ఇవి తినడం వల్ల గుండెపోటుకు చెక్ పెట్టొచ్చు..అవేంటో తెలుసుకోండి..

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఎంతో ముఖ్యం. అనారోగ్య సమస్యలు పెరిగిపోతున్న ఈ రోజుల్లో మంచి జీవనశైలి పాటించడం, ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం ద్వారా ఆరోగ్యాన్ని మెరుగుపర్చుకోవచ్చు. దీనిలో భాగంగా ఆరోగ్యకరమైన అల్పాహారం తీసుకోవడం చాలా ముఖ్యమైనది.గుండె ఆరోగ్యంగా ఉండాలంటే శారీరక వ్యాయామం, జీవిన విధానంలో మార్పులు చేసుకోవడం ఎంత ముఖ్యమో తీసుకునే ఆహారం విషయంలో కూడా అంతే జాగ్రత్తగా ఉండాలని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా తీసుకునే ఆహారంలో కచ్చితంగా కొన్ని రకాల ఆహార పదార్థాలు ఉండేలా చూసుకోవాలని చెబుతున్నారు. ఉదయాన్నే ఇవి తినడం వల్ల గుండెపోటుకు చెక్ పెట్టొచ్చు, ఎలాంటి ఆహార పదార్థాలను తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం..చాలామంది పనిలో బిజీగా ఉండి అల్పాహారాన్ని మిస్ అవుతారు. అయితే, ఇది శరీరానికి ఎంతో హానికరం. అల్పాహారం మిస్ అయితే,రక్తంలోని చెడు కొలెస్ట్రాల్ పెరుగుతుంది.ఊబకాయం, అధిక రక్తపోటు, మధుమేహం వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది.గుండెపోటు ప్రమాదం పెరుగుతుంది.

నారింజ

నారింజ పండులో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది, ఇది రోగనిరోధక శక్తిని పెంచుతుంది, చర్మం ,కంటి ఆరోగ్యానికి మేలు చేస్తుంది, గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది ,జీర్ణక్రియకు సహాయపడుతుంది. నారింజలో విటమిన్ సి పుష్కలంగా ఉండటం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది, ఇది జలుబు, జ్వరం వంటి సాధారణ వ్యాధుల నుండి రక్షిస్తుంది.నారింజలో ఉండే పొటాషియం రక్తపోటును నియంత్రిస్తుంది, గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది.నారింజలో ఉండే ఫైబర్ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది, మలబద్ధకం సమస్యను తగ్గిస్తుంది.

ఓట్ మీల్

ఓట్ మీల్ లోని కరిగే ఫైబర్ కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తుంది, గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది.ఓట్ మీల్ తినడం వల్ల బరువు తగ్గడం, గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించడం, రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడతాయి, అంతేకాకుండా జీర్ణక్రియ మెరుగుపడుతుంది. ఓట్ మీల్ లో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది, ఇది కడుపు నిండిన భావన కలిగిస్తుంది, తద్వారా మీరు తక్కువ ఆహారం తీసుకుంటారు, ఇది బరువు తగ్గడానికి సహాయపడుతుంది. ఓట్ మీల్ లో గ్లైసెమిక్ సూచిక తక్కువగా ఉంటుంది, ఇది రక్తంలో చక్కెర స్థాయిలను స్థిరీకరించడానికి సహాయపడుతుంది, మధుమేహం ఉన్నవారికి ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది.ఓట్ మీల్ లోని ఫైబర్ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది, మలబద్ధకాన్ని నివారిస్తుంది.

Quaker apples & cinnamon instant oatmeal 2

స్మోక్డ్ సాల్మన్

ఒమెగా 3 ఫ్యాటీ ఆమ్లాలు ఈ చేపల్లో మెండుగా ఉంటాయి. వీటిని తినడం వల్ల వ్యాధులతో పోరాడే శక్తి పెరుగుతుంది. ప్రాణాంతకమైన గుండె సమస్యల ప్రమాదాన్ని తగ్గించడంలో  ఒమెగా 3 ఫ్యాటీ ఆమ్లాలు కీ రోల్ పోషిస్తాయి. ఇవి శరీరంలో ఉండే బ్యాడ్ కొలెస్ట్రాల్‌ను బయటకు పంపి మంచి కొలెస్ట్రాల్‌ను పెంచుతాయి. దీంతో బాడీలో కొవ్వు పేరుకుపోకుండా ఉంటుంది. రక్తనాళాల్లో కొవ్వు ఉండదు. ఫలితంగా గుండె జబ్బులు దరిచేరవు. అథెరోస్క్లెరోసిస్ అనేది గుండెకు వచ్చే ఒక మేజర్ ప్రాబ్లం. దీని వల్ల ధమనులలో ఫలకాలు ఏర్పడతాయి. సాల్మన్ చేపలోని ఒమెగా 3 ఫ్యాటీ ఆమ్లాలు ఈ ఫలకాల వల్ల కలిగే మంటని చల్లార్చేందుకు, అలా ఫలకాలు ఏర్పడకుండా ఉండేందుకు ఉపయోగపడతాయి. 

గుడ్డులోని తెల్లసొన

గుడ్డులో ఎక్కువ భాగం తెలుపునే ఉంటుంది. ఇందులో ప్రోటీన్లు ఎక్కువగా లభిస్తాయి. ప్రోటీన్ కంటెంట్ కావాలి అనుకునే వారు ఈ గుడ్డులోని తెలుపు భాగాన్ని తినవచ్చు. ఇందులో క్యాలరీలు కూడా చాలా తక్కువగా ఉంటాయి. కాబట్టి బరువు తగ్గాలి అనుకునేవారికి బెస్ట్. శరీరంలోని బ్యాడ్ కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది. గుండె ఆరోగ్యానికి కూడా మంచిది. కండరాలు బలంగా ఉండాలంటే గుడ్డులోని తెలుపు భాగం తినడం బెటర్.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

మన వంటగదే ఒక హాస్పిటల్.. ఈ చిట్కాలతో ఆరోగ్యం మీ గుప్పిట్లో!

మన వంటగదే ఒక హాస్పిటల్.. ఈ చిట్కాలతో ఆరోగ్యం మీ గుప్పిట్లో!

డయాబెటిస్ రోగులకు తీపి కబురు

డయాబెటిస్ రోగులకు తీపి కబురు

భోజనం తర్వాత వెంటనే టీ తాగుతున్నారా?

భోజనం తర్వాత వెంటనే టీ తాగుతున్నారా?

నిద్రపై మొబైల్ ఫోన్ల ప్రభావం

నిద్రపై మొబైల్ ఫోన్ల ప్రభావం

పురుషుల్లో పెరుగుతున్న జుట్టు రాలడం: కారణం మీ జీర్ణ వ్యవస్థేనా?

పురుషుల్లో పెరుగుతున్న జుట్టు రాలడం: కారణం మీ జీర్ణ వ్యవస్థేనా?

వైద్య పరికరాల రంగంలో స్వదేశీ విప్లవం

వైద్య పరికరాల రంగంలో స్వదేశీ విప్లవం

సంగారెడ్డిలో హెల్త్ కార్డుల పంపిణీ.. ప్రభుత్వం కీలక నిర్ణయం!

సంగారెడ్డిలో హెల్త్ కార్డుల పంపిణీ.. ప్రభుత్వం కీలక నిర్ణయం!

శరీరంలో విటమిన్ బి12 పెంచుకునే సహజ మార్గాలు!

శరీరంలో విటమిన్ బి12 పెంచుకునే సహజ మార్గాలు!

మీ కళ్లు ఇలా ఉన్నాయా? అయితే ఆ పార్ట్ డ్యామేజ్‌ అయినట్లే!

మీ కళ్లు ఇలా ఉన్నాయా? అయితే ఆ పార్ట్ డ్యామేజ్‌ అయినట్లే!

ఫ్రిడ్జ్ లో పెట్టిన ఈ పదార్థాలు అస్సలు తినకండి

ఫ్రిడ్జ్ లో పెట్టిన ఈ పదార్థాలు అస్సలు తినకండి

గింజలు చిన్నవే.. కానీ, లాభాలు మాత్రం బోలెడు

గింజలు చిన్నవే.. కానీ, లాభాలు మాత్రం బోలెడు

15 రోజులు వెల్లుల్లిని ఇలా తింటే శరీరంలో వచ్చే మార్పులు ఇవే..

15 రోజులు వెల్లుల్లిని ఇలా తింటే శరీరంలో వచ్చే మార్పులు ఇవే..

📢 For Advertisement Booking: 98481 12870