గుడ్లు.. ఆరోగ్యానికి మంచివే కానీ వేసవిలో వీటిని ఎక్కువగా తినకూడదు. ఎందుకంటే వేసవిలో గుడ్లు (Eggs)ఎక్కువగా తినడం వల్ల కొన్ని ఆరోగ్య సమస్యలు (Health problems) వస్తాయట. ఎందుకంటే ఈ సమయంలో శరీర ఉష్ణోగ్రత (body temperature)సహజంగానే ఎక్కువగా ఉంటుంది. గుడ్ల వినియోగం పెరిగినప్పుడు, అది కడుపులో అధిక వేడి పుట్టిస్తుంది.
గుడ్లు ఆరోగ్యానికి చాలా మంచివి. వాటిలో ప్రోటీన్, విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. కాబట్టి వీటిని తీసుకోవడం వల్ల మన శరీరానికి అవసరమైన పోషకాలు దండిగా లభిస్తాయి. కానీ వీటిని తినడానికి సరైన సమయం అంటూ ఒకటి ఉంది. ఇవి ఆరోగ్యానికి మంచివే, కానీ వేసవిలో వీటిని ఎక్కువగా తినకూడదు. ఎందుకంటే వేసవిలో గుడ్లు ఎక్కువగా తినడం వల్ల కొన్ని ఆరోగ్య సమస్యలు వస్తాయి. ఎందుకంటే ఈ సమయంలో శరీర ఉష్ణోగ్రత సహజంగానే ఎక్కువగా ఉంటుంది. కాబట్టి గుడ్ల వినియోగం పెరిగినప్పుడు, అది కడుపులో వేడిని పెంచుతుంది. దీనివల్ల కొంతమందిలో అజీర్ణం, ఆమ్లత్వం వంటి సమస్యలు పెరుగుతాయి. అందువల్ల, వేసవిలో గుడ్లను మితంగా తీసుకోవడం ఉత్తమమని నిపుణులు అంటున్నారు. వేసవిలో గుడ్లు ఎక్కువగా తినడం వల్ల ఎలాంటి సమస్యలు తలెత్తుతాయో ఇక్కడ తెలుసుకుందాం..
జీర్ణవ్యవస్థపై ఒత్తిడి పెరుగుతుంది
గుడ్లు శరీరానికి అవసరమైన ప్రోటీన్‌ను పుష్కలంగా అందిస్తాయి. అయితే, వేసవిలో వాటిని అధికంగా తీసుకోవడం వల్ల జీర్ణవ్యవస్థపై ఒత్తిడి పెరుగుతుంది. దీనివల్ల మలబద్ధకం, కడుపు నొప్పి వంటి సమస్యలు వస్తాయి. కాబట్టి, మీరు గుడ్లు తీసుకుంటే మాత్రం అధికంగా నీళ్లు తాగడం మర్చిపోకూడదు. మన శరీరానికి నీరు చాలా ముఖ్యం. అవసరమైతే మజ్జిగ కూడా తీసుకోవచ్చు. ఇది మన ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి కూడా ప్రయోజనకరంగా ఉంటుంది. అలాగే వేసవిలో గుడ్లు తినడం వల్ల వాటిలో ప్రోటీన్ అధికంగా ఉండటం వల్ల శరీరంపై భారం పడుతుంది. ఇది మూత్రపిండాల పనితీరును ప్రభావితం చేస్తుంది. ముఖ్యంగా మూత్రపిండాలు ఈ ప్రోటీన్‌ను ఫిల్టర్ చేయడానికి కష్టపడి పనిచేస్తాయి. కాబట్టి మూత్రపిండాల సమస్యలు ఉన్నవారు గుడ్లు తీసుకునే ముందు వైద్య సలహా తీసుకోవడం మంచిది.
గుండె సంబంధిత సమస్యలు
గుడ్లలో కొలెస్ట్రాల్ అధికంగా ఉంటుంది. వేసవిలో, శరీర ఉష్ణోగ్రత కూడా పెరుగుతుంది. కాబట్టి, కొలెస్ట్రాల్ స్థాయిలను నియంత్రించకపోతే, గుండె సంబంధిత సమస్యలు వచ్చే అవకాశాలు పెరుగుతాయి. కాబట్టి, గుండె జబ్బులు ఉన్నవారు గుడ్ల వినియోగాన్ని పరిమితం చేయాలి. గుడ్లు ఎక్కువగా తినడం వల్ల అలెర్జీలు వస్తాయి. దీనివల్ల చర్మంపై దద్దుర్లు, కళ్ళు నీరు కారడం, వాంతులు, కడుపు నొప్పి వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఇలాంటి సందర్భాలలో, గుడ్లు తినడం పూర్తిగా మానేయాలి.
Read Also : Peanut Or Almond Butter: ఏ బటర్ ఆరోగ్యానికి ఎక్కువ మేలు చేస్తుంది?