📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

కిడ్నీ సమస్యలను గుర్తించే కంటి సంకేతాలు సైన‌స్ స‌మ‌స్య? కొన్ని చిట్కాలు.. నిద్ర లేవగానే అలసటగా ఉంటోందా? ప్రీడయాబెటిస్ లక్షణాలు ..? బొప్పాయి గింజలతో ఆరోగ్య ప్రయోజనాలు పీరియడ్స్‌లో తలస్నానం చేయకూడదా? నిమ్మరసం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు డ‌యాబెటిస్ ఉన్న‌వారు స్వీట్ కార్న్‌ను తిన‌వ‌చ్చా? చలికాలం.. ఈ జాగ్రత్తలు మర్చిపోవద్దు! మైగ్రేన్‌ను శాశ్వతంగా తగ్గించే చిట్కాలు కిడ్నీ సమస్యలను గుర్తించే కంటి సంకేతాలు సైన‌స్ స‌మ‌స్య? కొన్ని చిట్కాలు.. నిద్ర లేవగానే అలసటగా ఉంటోందా? ప్రీడయాబెటిస్ లక్షణాలు ..? బొప్పాయి గింజలతో ఆరోగ్య ప్రయోజనాలు పీరియడ్స్‌లో తలస్నానం చేయకూడదా? నిమ్మరసం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు డ‌యాబెటిస్ ఉన్న‌వారు స్వీట్ కార్న్‌ను తిన‌వ‌చ్చా? చలికాలం.. ఈ జాగ్రత్తలు మర్చిపోవద్దు! మైగ్రేన్‌ను శాశ్వతంగా తగ్గించే చిట్కాలు

Peanut: పల్లీలు తిన్న వెంటనే నీళ్లు తాగుతున్నారా? అయితే ఇది తెలుసుకోండి..

Author Icon By Sudha
Updated: March 14, 2026 • 11:19 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

పేదవాడి బాదంగా పిలువబడే వేరు శనగలు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. చూడ్డానికి చిన్నగానే ఉన్న పోషకాలు మాత్రం పుష్కలంగా ఉంటాయి. వీటిని తినడం వల్ల మన శరీరానికి అనేక ప్రయోజనాలు ఉన్నాయి. ఇది అందరికీ తెలిసిన విషయమే. కానీ వీటిని తినే విషయంలో చాలా మందికి అనేక అపోహలు ఉన్నాయి. అదేంటంటే వేరుశెనగ (Peanut)తిన్న వెంటనే నీరు తాగడం వల్ల దగ్గు వస్తుందని చాలా మంది నమ్ముతారు. సాధారణంగా ఏవైనా తిన్న వెంటనే నీరు తాగడం చాలా మంది అలవాటు. అలానే పల్లీలు తిన్న తర్వాత కూడా చాలా మంది నీరు తాగుతూ ఉంటారు. అయితే ఆరోగ్యవంతులైన వ్యక్తులు వేరుశనగ తిన్న తర్వాత నీరు తాగితే ఎలాంటి దగ్గు సమస్య ఉండదని నిపుణులు చెబుతున్నారు. వేరుశనగకు(Peanut) దగ్గుతో నేరుగా సంబంధం లేదని వైద్యులు అంటున్నారు. వేరుశనగలో ప్రోటీన్, కొవ్వు అధికంగా ఉండటం వల్ల, వాటిని తిన్న వెంటనే ఎక్కువ నీరు తాగడం వల్ల కొంతమందిలో ఉబ్బరం, గ్యాస్ లేదా అజీర్ణం వంటి సమస్యలు కనిపించొచ్చని అంటున్నారు. కానీ ఈ విధంగా నీరు తాగడం వల్ల శరీరానికి హాని జరగదు. దగ్గు గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని నిపుణులు అంటున్నారు.

Read Also : Health: జంక్‌ ఫుడ్‌పై సర్వే నివేదిక: ప్రభుత్వం కీలక సూచనలు

Peanut

వేరుశెనగలు ఎక్కువగా తినడం వల్ల బరువు పెరుగుతుంది. ఉప్పు కలిపి శనగలు ఎక్కువగా తినడం వల్ల రక్తపోటు సమస్యలు వస్తాయి. అలాగే, ఖాళీ కడుపుతో ఎక్కువగా తినడం వల్ల గ్యాస్ సమస్యలు వస్తాయంటున్నారు నిపుణులు. కాబట్టి సరైన సమయంలో మితంగా వేరుశెనగలు తినడం చాలా మంచిదని చెబుతున్నారు. శీతాకాలంలో శరీరానికి ఎక్కువ శక్తి, వెచ్చదనం అవసరం. వీటిని అందించడంతో శనగలు చాలా ప్రభావవంతంగా పనిచేస్తాయి. వేరుశెనగలో ఆరోగ్యకరమైన కొవ్వులు, కేలరీలు అధికంగా ఉంటాయి, ఇది శరీరాన్ని లోపలి నుండి వెచ్చగా ఉంచడంలో సహాయపడుతాయి. అంతేకాదు ఇవి తక్షణ శక్తిని అందిస్తాయి. అలసటను తగ్గిస్తాయి. అందుకే శీతాకాలంలో వేరుశెనగలు తినడం చాలా మంది గొప్ప ఎంపికగా భావిస్తారు. వేరుశెనగలు అధిక-నాణ్యత గల కూరగాయల ప్రోటీన్‌తో నిండి ఉంటాయి. అవి కండరాలను బలోపేతం చేయడానికి, శరీరంలోని దెబ్బతిన్న కణాలను పునర్నిర్మించడానికి సహాయపడతాయి. అలాగే, శీతాకాలంలో శరీరానికి ఎక్కువ ప్రోటీన్ అవసరం కాబట్టి, తక్కువ ధరకు సులభంగా లభించే వేరుశెనగలు మంచి ఎంపిక అవుతాయి. జిమ్‌ వెళ్లే వారికి ఇవి ఎంతో ప్రయోజనకరంగా ఉంటాయి.

Read hindi news : hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read Also:

#telugu News Breaking News digestion tips drinking water after food Food Habits latest news peanut health tips peanuts

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.