📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

సైన‌స్ స‌మ‌స్య ఉన్న‌వారికి కొన్ని చిట్కాలు.. నిద్ర లేవగానే అలసటగా ఉంటోందా? ప్రీడయాబెటిస్ లక్షణాలు ..? బొప్పాయి గింజలతో ఆరోగ్య ప్రయోజనాలు పీరియడ్స్‌లో తలస్నానం చేయకూడదా? నిమ్మరసం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు డ‌యాబెటిస్ ఉన్న‌వారు స్వీట్ కార్న్‌ను తిన‌వ‌చ్చా? చలికాలం.. ఈ జాగ్రత్తలు మర్చిపోవద్దు! మైగ్రేన్‌ను శాశ్వతంగా తగ్గించే చిట్కాలు బచ్చలి కూరలో బోలెడన్ని విటమిన్లు సైన‌స్ స‌మ‌స్య ఉన్న‌వారికి కొన్ని చిట్కాలు.. నిద్ర లేవగానే అలసటగా ఉంటోందా? ప్రీడయాబెటిస్ లక్షణాలు ..? బొప్పాయి గింజలతో ఆరోగ్య ప్రయోజనాలు పీరియడ్స్‌లో తలస్నానం చేయకూడదా? నిమ్మరసం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు డ‌యాబెటిస్ ఉన్న‌వారు స్వీట్ కార్న్‌ను తిన‌వ‌చ్చా? చలికాలం.. ఈ జాగ్రత్తలు మర్చిపోవద్దు! మైగ్రేన్‌ను శాశ్వతంగా తగ్గించే చిట్కాలు బచ్చలి కూరలో బోలెడన్ని విటమిన్లు

Latest Telugu News: Helmet: నిజంగా హెల్మెట్ పెట్టుకుంటే జుట్టు ఊడుతుందా?

Author Icon By Vanipushpa
Updated: October 17, 2025 • 5:14 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

బైక్ నడిపేటప్పుడు హెల్మెట్ పెట్టుకోవడం చట్టపరంగా తప్పనిసరి. రోడ్డు ప్రమాదంలో ఇది మీ ప్రాణాలను కాపాడేందుకు అవకాశం ఉంది. అయితే, హెల్మెట్ పెట్టుకోవడం వల్ల జుట్టు పాడవుతుందని లేదా ఊడిపోతుందని చాలామంది భావిస్తున్నారు. బిగుతుగా ఉండే హెల్మెట్లు, జుట్టు కుదుర్లపై ఒత్తిడిని పెంచుతున్నాయని, దీనివల్ల చెమట పెరిగి, జుట్టు బలహీనపడుతుందని కొందరు చెబుతున్నారు. హెల్మెట్ పెట్టుకోకపోవడానికి ట్రాఫిక్ పోలీసులు కారణాలు అడిగినప్పుడు, జుట్టు రాలిపోతుందని పెట్టుకోవడం లేదని కొందరు సమాధానాలు చెప్పిన సందర్భాలు కూడా ఉన్నాయి. దీనికి ఎలాంటి శాస్త్రీయమైన ఆధారం లేదు. హెల్మెట్ కొన్నిసార్లు తలపై ఒత్తిడికి కారణమవుతుంది. దీనివల్ల, చెమట పేరుకుపోతుంది. ఇది వెంట్రుకలకు సమీపంలోని చర్మాన్ని లేదా నెత్తిని ప్రభావితం చేస్తుంది. హెల్మెట్ లోపల మురికి పేరుకుపోయినా లేదా బిగుతుగా ఉన్నా లేదా బూజు పట్టినా అది మీ జుట్టును ప్రభావితం చేస్తుంది. అయితే, జుట్టు ఊడిపోవడానికి హెల్మెట్లు ఒక్కటే కారణం కాదు.

Read Also:Tomiichi Murayama: 101 ఏళ్ల జ‌పాన్ మాజీ ప్ర‌ధాని క‌న్నుమూత‌

Helmet: నిజంగా హెల్మెట్ పెట్టుకుంటే జుట్టు ఊడుతుందా?

తరచూ జుట్టును వాష్ వల్ల జుట్టుకు డ్యామేజ్‌

తరచూ జుట్టును వాష్ చేసుకోవడం, హెల్మెట్‌ను శుభ్రపరుచుకోవడం వల్ల జుట్టుకు డ్యామేజ్‌ను తగ్గించవచ్చు. హార్మోన్ల మార్పులు, జెనెటిక్స్, జీవనశైలి కూడా జుట్టు ఊడిపోవడానికి కారణమవుతున్నాయి. ఇవేమీ కాకుండా కేవలం హెల్మెట్ల వల్లనే జుట్టు ఊడిపోతుందనడానికి కచ్చితమైన ఆధారాలులేవని తెలిసింది. చిన్న వయసులో జుట్టు రాలడమన్నది అరుదైన సంఘటన కాదు. దీని వెనకాల చాలా కారణాలున్నాయి. వాటిని గుర్తించడం చాలా ముఖ్యం. ”హార్మోన్ మార్పులు వంటి హార్మోన్ల అంశాలు జట్టు ఊడిపోవడానికి ప్రధాన కారకం. మహిళల్లో థైరాయిడ్, పీసీఓడీ వంటివి కూడా జట్టు రాలడానికి కారణమవుతున్నాయి.

హెల్మెట్ వల్ల కుదుర్లలో దురద, చెమట, ఫంగల్ ఇన్‌ఫెక్షన్లు

”బిగుతుగా ఉండే హెల్మెట్‌ను పెట్టుకోవడం వల్ల జుట్టు కుదుర్లపై ప్రభావం పడుతుంది. సరైన హెల్మెట్ పెట్టుకోకపోవడం వల్ల కుదుర్లలో దురద, చెమట, ఫంగల్ ఇన్‌ఫెక్షన్లు వస్తాయి. హెల్మెట్ సైజు సరిగ్గా లేకపోయినా, లోపల సరిగ్గా శుభ్రపరచకపోయినా ఈ సమస్య మరింత పెరుగుతుంది” అని ముంబయికి చెందిన డెర్మటాలజిస్ట్ చెప్పారు. ”పోనీటెయిల్ మాదిరి హెయిర్‌స్టయిల్‌తో హెల్మెట్ పెట్టుకుంటే, అది కుదుర్ల దగ్గర జుట్టును గట్టిగా లాగేస్తుంది. ఇది కుదుర్లపై ఒత్తిడికి దారితీస్తుంది.

హెల్మెట్లు మాత్రమే జుట్టు రాలడానికి కారణం కాదు

సరైన హెల్మెట్ వాడకపోవడం వల్ల కూడా జుట్టు ఊడే సమస్య రావొచ్చు. ఒత్తిడి, చెమట వంటి వాటివల్ల జుట్టు ఊడిపోతుంది. మీ స్కిన్‌ను జాగ్రత్తగా చూసుకుంటూ, గ్రంథులు దెబ్బతినకుండా ఉంటే ఊడిపోయిన జుట్టు మళ్లీ పెరుగుతుంది. చాలాకాలంగా జుట్టు ఊడుతూ ఉంటే, దీని వెనక మరేదైనా కారణం ఉందేమో చెక్ చేసుకునేందుకు వైద్యుణ్ని సంప్రదించాలి” హెల్మెట్ మానేయడం వల్ల సమస్య పరిష్కారం కాదన్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : https://epaper.vaartha.com/

Read Also:

Hair Care Routine Hair care tips Hair Fall Myths Hair Loss Causes Hair Protection Helmet Hair Loss Helmet Safety scalp health Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.