📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

సైన‌స్ స‌మ‌స్య ఉన్న‌వారికి కొన్ని చిట్కాలు.. నిద్ర లేవగానే అలసటగా ఉంటోందా? ప్రీడయాబెటిస్ లక్షణాలు ..? బొప్పాయి గింజలతో ఆరోగ్య ప్రయోజనాలు పీరియడ్స్‌లో తలస్నానం చేయకూడదా? నిమ్మరసం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు డ‌యాబెటిస్ ఉన్న‌వారు స్వీట్ కార్న్‌ను తిన‌వ‌చ్చా? చలికాలం.. ఈ జాగ్రత్తలు మర్చిపోవద్దు! మైగ్రేన్‌ను శాశ్వతంగా తగ్గించే చిట్కాలు బచ్చలి కూరలో బోలెడన్ని విటమిన్లు సైన‌స్ స‌మ‌స్య ఉన్న‌వారికి కొన్ని చిట్కాలు.. నిద్ర లేవగానే అలసటగా ఉంటోందా? ప్రీడయాబెటిస్ లక్షణాలు ..? బొప్పాయి గింజలతో ఆరోగ్య ప్రయోజనాలు పీరియడ్స్‌లో తలస్నానం చేయకూడదా? నిమ్మరసం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు డ‌యాబెటిస్ ఉన్న‌వారు స్వీట్ కార్న్‌ను తిన‌వ‌చ్చా? చలికాలం.. ఈ జాగ్రత్తలు మర్చిపోవద్దు! మైగ్రేన్‌ను శాశ్వతంగా తగ్గించే చిట్కాలు బచ్చలి కూరలో బోలెడన్ని విటమిన్లు

Chicken: చికెన్ తిన్న వెంటనే ఇలా చేస్తున్నారా?

Author Icon By Sudheer
Updated: March 30, 2025 • 4:12 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

చికెన్‌ను ఆస్వాదిస్తూ తినే నాన్ వెజ్ ప్రియులు కొన్ని ఆరోగ్య సమస్యలను మర్చిపోవడం సర్వసాధారణం. అయితే, చికెన్ తినేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా, చికెన్ తిన్న వెంటనే కొన్ని ఆహార పదార్థాలను తీసుకోవడం శారీరక సమస్యలకు దారితీస్తుందని చెబుతున్నారు.

పాలు, పెరుగు తినొద్దు

చికెన్ తిన్న వెంటనే పాలు లేదా పెరుగు తీసుకోవడం ఆరోగ్యానికి మంచిది కాదు. ఇవి రెండు కలిస్తే అజీర్ణం, గ్యాస్, కడుపు ఉబ్బరం వంటి సమస్యలు రావచ్చు. అలాగే, కొంతమందికి అలెర్జీ లాంటి లక్షణాలు కూడా కనిపించవచ్చు. అందుకే, చికెన్ తిన్న 2–3 గంటలు దాటిన తర్వాత మాత్రమే పాల పదార్థాలను తీసుకోవడం మంచిది.

daily chiken

బంగాళదుంపలతో చికెన్ తినకూడదు

చికెన్‌తోపాటు బంగాళదుంపలను కలిపి తింటే అధిక బరువుకు దారితీస్తుంది. బంగాళదుంపలో ఉండే కార్బోహైడ్రేట్లు, చికెన్‌లో ఉండే ప్రోటీన్లతో కలిసి శరీరంలో కొవ్వు పేరుకుపోయే అవకాశాలు పెరుగుతాయి. ముఖ్యంగా, ఈ రెండు పదార్థాలను వేయించుకుని తింటే, అధిక కొవ్వు శరీరానికి నష్టం కలిగించే ప్రమాదం ఉంది.

నిమ్మ, ద్రాక్ష వంటి పండ్లను అసలు తినొద్దు

చికెన్ తిన్న వెంటనే నిమ్మ, ద్రాక్ష వంటి ఆమ్లధార భరితమైన పండ్లను తినడం ఆరోగ్యానికి మేలు చేయదు. ఇవి పేగు సమస్యలను కలిగించడంతో పాటు, కడుపులో మంటను కూడా పెంచుతాయి. అదనంగా, నిత్యం చికెన్ తినడం కీళ్ల నొప్పులు, మూత్రపిండాలకు సంబంధించిన సమస్యలను పెంచుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కనుక, చికెన్ తినేటప్పుడు సరైన సమతుల ఆహార నియమాలను పాటించడం ఉత్తమం.

chicken immediately after eating chicken

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.