మధుమేహం (షుగర్) సాధారణంగా నెమ్మదిగా మొదలై, మొదట్లో పెద్దగా లక్షణాలు చూపించదు. అయితే నిపుణుల ప్రకారం, మహిళల్లో ఈ వ్యాధి రాకముందే కొన్ని శారీరక మార్పులు కనిపిస్తాయి. ఇవి శరీరంలో గ్లూకోజ్ స్థాయులు అసమతుల్యంగా మారుతున్న సంకేతాలుగా పరిగణించాలి. మొదటగా, హార్మోన్ల అసమతుల్యత వల్ల పీరియడ్స్ క్రమం తప్పడం, రుతు చక్రం గడిలో మార్పులు రావడం సాధారణంగా గమనించవచ్చు. అలాగే చర్మం అకస్మాత్తుగా ఎర్రగా మారడం, దురద, పొడిబారడం వంటి సమస్యలు కూడా సూచనలుగా భావించవచ్చు.
Read also: fig fruit : పోషకాలు అధికంగా వుండే ఈ పండు గురించి తెలుసుకుందాం ..
Diabetes: షుగర్ వచ్చే ముందు కనిపించే లక్షణాలు
అదనంగా, జననేంద్రియాలు పొడిబారడం, చేతులు, కాళ్లు మంటగా ఉండడం లేదా జలదరించటం, అసహజ అలసట, అధిక దాహం, మరియు తరచుగా మూత్ర విసర్జన జరగడం వంటి లక్షణాలు కనిపిస్తే అవి షుగర్ (Diasbetes) ప్రారంభ సూచనలుగా పరిగణించాలి. నిపుణులు చెబుతున్నట్లుగా, ఈ లక్షణాలు నిర్లక్ష్యం చేయకూడదు. సమయానికి వైద్యులను సంప్రదించడం, సరైన రక్తపరీక్షలు చేయించుకోవడం ద్వారా మధుమేహాన్ని ప్రారంభ దశలోనే గుర్తించి నియంత్రణలో ఉంచుకోవచ్చు.
మహిళల్లో షుగర్ రాకముందే ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయి?
పీరియడ్స్ అసమతుల్యత, చర్మం ఎర్రగా మారడం, పొడిబారడం, దురద, చేతులు, కాళ్లలో జలదరించడం, అధిక దాహం, తరచుగా మూత్ర విసర్జన వంటి లక్షణాలు ముందుగా కనిపిస్తాయి.
ఈ లక్షణాలు కనిపిస్తే ఏమి చేయాలి?
వెంటనే వైద్యులను సంప్రదించి రక్తపరీక్షలు మరియు అవసరమైతే ఎండోక్రినాలజీ పరీక్షలు చేయించాలి. ప్రారంభ దశలో నియంత్రణ సాధించవచ్చు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : https://epaper.vaartha.com/
Read Also: