📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

సైన‌స్ స‌మ‌స్య ఉన్న‌వారికి కొన్ని చిట్కాలు.. నిద్ర లేవగానే అలసటగా ఉంటోందా? ప్రీడయాబెటిస్ లక్షణాలు ..? బొప్పాయి గింజలతో ఆరోగ్య ప్రయోజనాలు పీరియడ్స్‌లో తలస్నానం చేయకూడదా? నిమ్మరసం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు డ‌యాబెటిస్ ఉన్న‌వారు స్వీట్ కార్న్‌ను తిన‌వ‌చ్చా? చలికాలం.. ఈ జాగ్రత్తలు మర్చిపోవద్దు! మైగ్రేన్‌ను శాశ్వతంగా తగ్గించే చిట్కాలు బచ్చలి కూరలో బోలెడన్ని విటమిన్లు సైన‌స్ స‌మ‌స్య ఉన్న‌వారికి కొన్ని చిట్కాలు.. నిద్ర లేవగానే అలసటగా ఉంటోందా? ప్రీడయాబెటిస్ లక్షణాలు ..? బొప్పాయి గింజలతో ఆరోగ్య ప్రయోజనాలు పీరియడ్స్‌లో తలస్నానం చేయకూడదా? నిమ్మరసం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు డ‌యాబెటిస్ ఉన్న‌వారు స్వీట్ కార్న్‌ను తిన‌వ‌చ్చా? చలికాలం.. ఈ జాగ్రత్తలు మర్చిపోవద్దు! మైగ్రేన్‌ను శాశ్వతంగా తగ్గించే చిట్కాలు బచ్చలి కూరలో బోలెడన్ని విటమిన్లు

children: పిల్లలకి క్రమశిక్షణతో కూడిన నడవడిక నేర్పండి

Author Icon By Sharanya
Updated: May 15, 2025 • 5:19 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

మన పిల్లల భవిష్యత్తు ఎలా ఉండాలి అనే దాని పునాది వారి బాల్యంలో పడుతుంది. పిల్లల పెంపకంలో, ముఖ్యంగా నేటి సమాజంలో పేరెంట్స్ పాత్ర ఎంతో కీలకం. వారు సాంకేతిక పరిజ్ఞానం, గ్యాడ్జెట్లు, స్క్రీన్లు, ఫాస్ట్ ఫుడ్ మధ్యలో ఎదుగుతున్న ఈ తరుణంలో, వారి జీవితానికి దిశా నిర్దేశం చేసేది — క్రమశిక్షణ, శ్రద్ధ, ఆరోగ్యకరమైన అలవాట్లు.

పిల్లలు చిన్న వయసులోనే ఫోన్లు, ట్యాబ్‌లు వాడటం, యూట్యూబ్, గేమ్స్‌తో ఎక్కువ సమయం గడపడం పరిపాటి అయిపోయింది. ఇవి మొదట్లో తెలివిగా కనిపించవచ్చు కానీ దీర్ఘకాలంలో కంటి చూపుకు హాని, మెదడు అలసట, ఏకాగ్రత లోపం, మానసిక ఒత్తిడి, వంటివి వస్తాయి. మానవ సంబంధాలు బలహీనమవుతాయి. పిల్లల్ని స్క్రీన్ నుంచి దూరంగా ఉంచి పుస్తకాలతో, కళలతో, ప్రకృతితో మమేకం చేసేలా చేయాలి

నిద్ర – పిల్లల మెదడు వికాసానికి పునాది

నిద్ర లేకపోతే పిల్లల దినచర్య మొత్తం తారుమారవుతుంది. తల్లి తండ్రులు ఎప్పుడూ నిద్ర పద్ధతులపై ప్రత్యేక శ్రద్ధ చూపాలి. స్క్రీన్ టైమ్‌ని నిద్రకి ముందు పూర్తిగా తగ్గించాలి. పిల్లలు సరిగ్గా నిద్రపోయేలా చూసుకోవాలి. కానీ, వారిని స్క్రీన్స్‌కి అతుక్కుపోయేలా చేస్తే నిద్రలేమితో బాధపడతారు. దీని వల్ల ఏకాగ్రత తగ్గడంతో మూడ్ స్వింగ్స్, పరిజ్ఞానం తగ్గుతుంది. నేర్చుకోవాలన్న ఆలోచనలు రావు. దేనిపై కాన్సంట్రేషన్ చేయలేరు. మనల్నే తీసుకోండి. నిద్ర సరిగా లేకపోతే ఏదైనా పని చేయగలమా.. మనలానే పిల్లలు కూడా. కాబట్టి, హాయిగా నిద్రపోయేలా చూడండి.

యాక్టివిటీస్ అవసరం

పిల్లలను idleగా ఉంచకూడదు. వారి మెదడు గేమ్స్, పజిల్స్, డ్రాయింగ్, డాన్స్ వంటి యాక్టివిటీలతో చురుగ్గా పనిచేస్తుంది. వారిని ఎప్పుడు కూడా ఏదో ఓ యాక్టివిటీలో యాక్టివ్‌‌‌గా ఉండేలా చూడాలి. నేర్చుకోవడం వంటివి సరిగా ఉండేలా చూడాలి. అప్పుడే వారు కొత్త విషయాలను నేర్చుకుంటారు. వారి బ్రెయిన్ డెవలప్‌మెంట్ సరిగా ఉంటుంది. అందుకే, ఎప్పుడూ ఏదో విషయంలో యాక్టివ్‌గా ఉంచండి. పెరెంట్స్ ఇంట్లోనైనా, పాఠశాలల్లోనైనా వారిని ఒక పని లేదా హాబీకి దోహదపడేలా ప్రోత్సహించాలి.

శారీరక చురుకుదనం

పిల్లలు ప్రస్తుత కాలంలో బయటకు వెళ్లి ఆడే అవకాశం తగ్గిపోయింది. కానీ ఆటల ద్వారా వారిలో జట్టు సహకారం, ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఇదివరకటి రోజుల్లో పిల్లల్ని సాయంత్రాలు బయటికి పంపించి ఆడుకోనిచ్చేవారు. కానీ, రాన్రాను ఆ పరిస్థితి మారిపోయింది. పిల్లల్ని ఇంట్లోనే బందీలుగా చేసేస్తున్నాం. బయటికెళ్తే ఏ ఆకతాయి పనిచేస్తారోనని కంగారు పడి ఇంట్లోనే టీవీలు, వీడియోగేమ్స్ అంటూ వారిని కట్టిపారేస్తున్నాం. దీంతో వారి బ్రెయిన్ షార్ప్‌గా ఉండడట్లేదు. మెదడుకి రక్తసరఫరా తగ్గి నేర్చుకోవడం, సమస్యల్ని సాల్వ్ చేసే గుణాలు తగ్గిపోతున్నాయి.

పోషకాహారం

పిల్లలు జంక్ ఫుడ్‌కి అలవాటు పడటం సహజమే. కానీ మితిమీరినప్పుడే అది హానికరం. తల్లిదండ్రులు ఈ విషయాన్ని గుర్తించి న్యూట్రిషన్ ఉన్న ఆహారాన్ని అందించాలి (డ్రై ఫ్రూట్స్, పళ్ళు, ఆకుకూరలు), తక్కువ తిన్నా మంచి పోషకత కలిగిన పదార్థాలపై దృష్టి పెట్టాలి. పిల్లలతో కలిసి హెల్దీ రెసిపీలు తయారు చేయడం ద్వారా వారిలో ఆసక్తి పెంచాలి.

మొబైల్ వాడకం

చాలా మంది పేరెంట్స్ మా పిల్లలకి చాలా నాలెడ్జ్ ఎక్కువ అండి. ఐదేళ్లు లేడు ఫోన్ తనంతట తానే చూసేస్తూ ఆపరేట్ చేస్తున్నాడు అంటూ చెబుతూ మురిసిపోతారు. ఇది మొదట్లో బాగానే ఉన్నా ఇది వారిపై తీవ్ర ప్రభావం చూపుతుంది. ఎక్కువగా స్క్రీన్ టైమ్ అనేది వారి కంటి చూపుని దెబ్బతీస్తుంది. అంతేకాకుండా సోషల్ మీడియాలో టైమ్ ఎక్కువగా గడపడం, గ్యాడ్జెట్స్‌ని వారికి ఇస్తే మన పని మనం ప్రశాంతంగా చేసుకోవచ్చని చూడడం వారికి మన చేతులారా మనమే చెడుని పరిచయం చేసినట్లుగా మారుతుందని చెబుతున్నారు అంబికా. వీటి బదులు, బుక్స్ చదివించడం అలవాటుగా మార్చాలి.

Read also: Black foods: కొలెస్ట్రాల్ తగ్గించడంలో బ్లాక్ ఫుడ్స్ కీలకం

#ChildGrowth #ChildrenDiscipline #HealthyHabits #KidsDevelopment #MindfulParenting #ScreenTimeControl #NutritionForKids #ParentingTips #ScreenTimeControl #SmartParenting Breaking News Today In Telugu Google News in Telugu India News Today in Telugu Latest News in Telugu Latest News today in Telugu News in Telugu Today Telugu News Today Today News In Telugu Today Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.