కొన్ని ఆహారాల్లో ఉండే లెక్టిన్ అనే ప్రోటీన్ మన రక్తంలోని యాంటిజెన్లతో రియాక్ట్ అవుతూ శరీరానికి హానికరం చేసే అవకాశముందని నిపుణులు చెబుతున్నారు. ఇవి జీర్ణక్రియను దెబ్బతీయడం, ఇన్‌ఫ్లమేషన్ పెంచడం, అలర్జీలు కలిగించడం వంటి సమస్యలకు దారితీస్తాయని అంటున్నారు.
రక్తగ్రూప్ ప్రకారం ఆహారం తీసుకుంటే ప్రయోజనాలేమిటి?
సరికొత్త పరిశోధనల ప్రకారం రక్తగ్రూప్‌కు(BloodGroup Diet) అనుగుణంగా ఆహారం తీసుకోవడం వల్ల:
- శరీరానికి అనుకూలమైన ఆహారం ఎంపిక అవుతుంది
- జీర్ణక్రియ మెరుగుపడుతుంది
- ఇమ్యూనిటీ పెరుగుతుంది
- బరువు నియంత్రణ సులభమవుతుంది
రక్తగ్రూప్ A వారికి ఏ ఆహారం మంచిది?
తీసుకోవాల్సిన ఆహారం
- పండ్లు
- ఆకుకూరలు
- టోఫు
- బీన్స్
- చిక్కుళ్లు
- తృణధాన్యాలు
ఈ ఆహారాలు A గ్రూప్(BloodGroup Diet) వారికి జీర్ణక్రియకు సులభంగా ఉండి, శరీరానికి అవసరమైన పోషకాలు అందిస్తాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
తగ్గించాల్సిన ఆహారం
- టమాట
- వంకాయ
- గోధుమలు
- జొన్న
- పాల ఉత్పత్తులు
ఇవి A గ్రూప్ వారికి లెక్టిన్ ప్రభావం పెంచే అవకాశముండటంతో పరిమితంగా తీసుకోవాలని సూచిస్తున్నారు.
Read hindi news: https://hindi.vaartha.com
Epaper : https://epaper.vaartha.com/
Read also :