📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

సైన‌స్ స‌మ‌స్య ఉన్న‌వారికి కొన్ని చిట్కాలు.. నిద్ర లేవగానే అలసటగా ఉంటోందా? ప్రీడయాబెటిస్ లక్షణాలు ..? బొప్పాయి గింజలతో ఆరోగ్య ప్రయోజనాలు పీరియడ్స్‌లో తలస్నానం చేయకూడదా? నిమ్మరసం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు డ‌యాబెటిస్ ఉన్న‌వారు స్వీట్ కార్న్‌ను తిన‌వ‌చ్చా? చలికాలం.. ఈ జాగ్రత్తలు మర్చిపోవద్దు! మైగ్రేన్‌ను శాశ్వతంగా తగ్గించే చిట్కాలు బచ్చలి కూరలో బోలెడన్ని విటమిన్లు సైన‌స్ స‌మ‌స్య ఉన్న‌వారికి కొన్ని చిట్కాలు.. నిద్ర లేవగానే అలసటగా ఉంటోందా? ప్రీడయాబెటిస్ లక్షణాలు ..? బొప్పాయి గింజలతో ఆరోగ్య ప్రయోజనాలు పీరియడ్స్‌లో తలస్నానం చేయకూడదా? నిమ్మరసం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు డ‌యాబెటిస్ ఉన్న‌వారు స్వీట్ కార్న్‌ను తిన‌వ‌చ్చా? చలికాలం.. ఈ జాగ్రత్తలు మర్చిపోవద్దు! మైగ్రేన్‌ను శాశ్వతంగా తగ్గించే చిట్కాలు బచ్చలి కూరలో బోలెడన్ని విటమిన్లు

Telugu News: Badam: బరువుని నియంత్రించే బాదం .. నెలపాటు తిని చూడండి

Author Icon By Tejaswini Y
Updated: November 6, 2025 • 4:33 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

మన పెద్దలు ఎప్పుడూ “ఉదయాన్నే నానబెట్టిన బాదం(Badam) పప్పులు తినాలి” అని చెబుతుంటారు. ఈ సలహా వెనుక గట్టి శాస్త్రీయ కారణాలున్నాయని పోషకాహార నిపుణులు అంటున్నారు. బరువు నియంత్రణ నిపుణురాలు గార్గీ శర్మ చెప్పినట్లుగా, పచ్చి బాదం కంటే రాత్రంతా నీటిలో నానబెట్టి పొట్టు తీసి తినడం వల్ల పోషకాలు శరీరానికి సులభంగా అందుతాయి. జీర్ణక్రియ మెరుగుపడటంతో పాటు శరీరంలో అనేక సానుకూల మార్పులు చోటు చేసుకుంటాయి. రోజూ 5 నుండి 8 బాదం పప్పులను ఒక గ్లాస్ నీటిలో రాత్రంతా నానబెట్టాలి.

Read Also: Singer Chinmayi: వైరల్ అవుతున్న సింగర్ చిన్మయి పోస్ట్

Badam

ఉదయం వాటిపై ఉండే గోధుమ రంగు పొట్టు తొలగించి తినాలి. ఎందుకంటే ఆ పొట్టులో ఉండే ‘టానిన్లు’ అనే పదార్థాలు పోషకాలు శరీరం గ్రహించకుండా అడ్డుకుంటాయి. ఈ పప్పులను పరగడుపున లేదా అల్పాహారంతో తీసుకోవడం ఉత్తమం. ఈ అలవాటు మొదలుపెట్టిన కొన్ని రోజులకే తేడా తెలుస్తుంది. బాదంలో(Badam) ఉండే ఫైబర్, ప్రోటీన్, ఆరోగ్యకరమైన కొవ్వులు ఆకలిని నియంత్రిస్తాయి. మధ్యలో చిరుతిళ్లు తినాలనే కోరిక తగ్గుతుంది. అలాగే జీర్ణ సమస్యలు, కడుపు ఉబ్బరం, మలబద్ధకం వంటి ఇబ్బందులు కూడా తగ్గుతాయి.

రెండవ వారం నుంచి బాదంలోని ఎంజైమ్‌లు జీర్ణక్రియను మరింత చురుకుగా చేస్తాయి. కడుపు ఉబ్బరాన్ని తగ్గిస్తాయి. బాదం తీసుకోవడం వల్ల చెడు కొలెస్ట్రాల్ తగ్గి, మంచి కొలెస్ట్రాల్ స్థాయి పెరుగుతుంది, దీంతో గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. బరువు నియంత్రణలో కూడా ఇది సహాయపడుతుంది. నాలుగో వారానికి వచ్చేసరికి శరీరంలోని శక్తి స్థాయిలు పెరుగుతాయి, అలసట తగ్గుతుంది. బాదంలో ఉన్న విటమిన్ E మరియు యాంటీ ఆక్సిడెంట్లు చర్మానికి మెరుపు తెస్తాయి. చర్మం ఆరోగ్యంగా కనిపిస్తుంది. ఉదయాన్నే ఈ అలవాటును కొనసాగించడం మానసిక ఉత్సాహం కూడా పెంచుతుంది.

Read hindi news : hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read Also:

AlmondBenefits HealthyHabits HealthyLifestyle MorningDiet NutritionTips SoakedAlmonds Telugu News online Telugu News Today VitaminE WeightLossTips

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.