हिन्दी | Epaper
బెంగళూరులో గూగుల్ క్యాంపస్ ఢిల్లీలో షాక్ రోజుకు 27 మంది మిస్సింగ్ బంగారం ధరలు మంటలు కుప్పకూలిన వెండి ధరలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు ‘గోల్డెన్ అవర్’ చికిత్స నిలిచిపోనున్న క్యాబ్, ఆటో సేవలు అమెరికాకు భారత్‌ వార్నింగ్‌ రాయలసీమ వర్సిటీలో గొడవలు గ్రూప్-1 అభ్యర్థులకు హైకోర్టులో ఊరట పట్టాలు తప్పిన రైలు బెంగళూరులో గూగుల్ క్యాంపస్ ఢిల్లీలో షాక్ రోజుకు 27 మంది మిస్సింగ్ బంగారం ధరలు మంటలు కుప్పకూలిన వెండి ధరలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు ‘గోల్డెన్ అవర్’ చికిత్స నిలిచిపోనున్న క్యాబ్, ఆటో సేవలు అమెరికాకు భారత్‌ వార్నింగ్‌ రాయలసీమ వర్సిటీలో గొడవలు గ్రూప్-1 అభ్యర్థులకు హైకోర్టులో ఊరట పట్టాలు తప్పిన రైలు బెంగళూరులో గూగుల్ క్యాంపస్ ఢిల్లీలో షాక్ రోజుకు 27 మంది మిస్సింగ్ బంగారం ధరలు మంటలు కుప్పకూలిన వెండి ధరలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు ‘గోల్డెన్ అవర్’ చికిత్స నిలిచిపోనున్న క్యాబ్, ఆటో సేవలు అమెరికాకు భారత్‌ వార్నింగ్‌ రాయలసీమ వర్సిటీలో గొడవలు గ్రూప్-1 అభ్యర్థులకు హైకోర్టులో ఊరట పట్టాలు తప్పిన రైలు బెంగళూరులో గూగుల్ క్యాంపస్ ఢిల్లీలో షాక్ రోజుకు 27 మంది మిస్సింగ్ బంగారం ధరలు మంటలు కుప్పకూలిన వెండి ధరలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు ‘గోల్డెన్ అవర్’ చికిత్స నిలిచిపోనున్న క్యాబ్, ఆటో సేవలు అమెరికాకు భారత్‌ వార్నింగ్‌ రాయలసీమ వర్సిటీలో గొడవలు గ్రూప్-1 అభ్యర్థులకు హైకోర్టులో ఊరట పట్టాలు తప్పిన రైలు

Sweets : అన్నం తిన్న వెంటనే స్వీట్ తినాలనిపిస్తోందా..

Sudha
Sweets : అన్నం తిన్న వెంటనే స్వీట్ తినాలనిపిస్తోందా..

అన్నం తిన్నాక ఏదైనా తీపి పదార్థం నోట్లో పడాల్సిందేనా..? లేదంటే భోజనం పూర్తి కాలేదన్న వెలితిగా అనిపిస్తోందా? అయితే ఇది కేవలం మీ మనసు కోరుకుంటున్న రుచి మాత్రమే కాదు.. మీ శరీరం లోపల జరుగుతున్న కొన్ని మార్పులకు సంకేతం.. రక్తంలో చక్కెర స్థాయిలు పడిపోవడం నుంచి పోషకాహార లోపం వరకు.. ఈ తీపి కోరికల వెనుక దాగి ఉన్న షాకింగ్ కారణాలేంటో తెలుసుకుందాం. మన భారతీయ సంప్రదాయంలో భోజనం తర్వాత ఒక స్వీట్ (Sweets)ముక్క నోట్లో వేసుకోవడం అనేది తరతరాలుగా వస్తున్న అలవాటు. అయితే ఈ కోరిక కేవలం రుచి కోసం మాత్రమే కాదు.. దీని వెనుక అనేక శారీరక కారణాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అసలు తిన్న వెంటనే తీపి పదార్థాలు తినాలని ఎందుకు అనిపిస్తుంది? మన ఆహారంలో రిఫైన్డ్ కార్బోహైడ్రేట్లు ఎక్కువగా ఉన్నప్పుడు, తిన్న తర్వాత శరీరంలో చక్కెర స్థాయిలు ఒక్కసారిగా పెరుగుతాయి. ఆ తర్వాత అంతే వేగంగా పడిపోతాయి. ఇలా చక్కెర స్థాయిలు తగ్గగానే, శరీరం తక్షణ శక్తి కోసం మళ్లీ స్వీట్లను కోరుకుంటుంది.

Read Also : Health: గుండె నెమ్మదిగా కొట్టుకుంటే ఏమవుతుంది?

Sweets
Sweets

మీ శరీరానికి అవసరమైన విటమిన్లు, మినరల్స్ అందనప్పుడు అది తీపి రూపంలో శక్తిని అడుగుతుంది. ముఖ్యంగా మెగ్నీషియం, జింక్ వంటి పోషకాలు తక్కువగా ఉన్నప్పుడు షుగర్ క్రేవింగ్స్ ఎక్కువగా ఉంటాయి . చాలామందికి తెలియని విషయం ఏమిటంటే.. శరీరానికి దాహం వేసినప్పుడు వచ్చే సంకేతాలను మనం ఆకలిగా పొరబడతాం. శరీరంలో నీటి శాతం తగ్గినప్పుడు, శక్తి కోసం ఏదైనా తీపి పదార్థం తినాలనే భ్రమ కలుగుతుంది. రోజంతా పని చేసి అలసిపోయినప్పుడు, మెదడుకు వెంటనే గ్లూకోజ్ అందాలని శరీరం భావిస్తుంది. అందుకే అలసటగా ఉన్నప్పుడు తీపి తినాలనే కోరిక తీవ్రంగా ఉంటుంది. భోజనానికి ముందు, తర్వాత శరీరానికి తగినంత హైడ్రేషన్ ఇస్తే తీపి కోరికలు తగ్గుతాయి. భోజనంలో పప్పులు, గుడ్లు లేదా పీచు పదార్థం ఎక్కువగా ఉంటే చక్కెర స్థాయిలు స్థిరంగా ఉంటాయి. స్వీట్లు, (Sweets)కేకులకు బదులుగా ఖర్జూరాలు లేదా పండ్లను తీసుకోవడం ఉత్తమం.

Read hindi news : hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870