Skincare Tips: సన్‌స్క్రీన్ లోషన్ ఎంత రాసుకుంటే మంచిది?

Read Time:  1 min
How much sunscreen lotion should you apply?
How much sunscreen lotion should you apply?
FONT SIZE
GET APP

వేసవి కాలంలోనే కాదు, ఏ సీజన్ అయినా బయటకు వెళ్లేటప్పుడు సన్‌స్క్రీన్ లోషన్ తప్పనిసరి. ఎండలోని అల్ట్రావయలెట్ (UV) కిరణాలు చర్మాన్ని నెమ్మదిగా డ్యామేజ్ చేస్తాయి. ఈ ప్రభావం వెంటనే కనిపించకపోయినా, కాలక్రమేణా చర్మం నల్లబడటం, ముడతలు, మచ్చలు వంటి సమస్యలకు దారి తీస్తుంది. అందుకే డెర్మటాలజిస్టులు రోజూ సన్‌స్క్రీన్ (sunscreen) వాడాలని సూచిస్తున్నారు. రెగ్యులర్‌గా బయటకు వెళ్లేవాళ్లు SPF 30, PA ప్రొటెక్షన్ ఉన్న సన్‌స్క్రీన్ వాడితే సరిపోతుంది. ఇది రోజువారీ అవసరాలకు తగిన రక్షణ ఇస్తుంది. అయితే ఎక్కువ సేపు ఎండలో ఉండాల్సిన వాళ్లు మాత్రం అధిక SPF ఉన్న ప్రొడక్ట్‌ని ఎంచుకోవాలి.

Read also: HealthTips: కలబందతో గర్భిణులకు ప్రమాదం!

How much sunscreen lotion should you apply?

How much sunscreen lotion should you apply?

ఎంత SPF సన్‌స్క్రీన్ వాడాలి?

సాధారణంగా ఆఫీస్‌కు, షాపింగ్‌కు లేదా చిన్న ప్రయాణాలకు వెళ్లేటప్పుడు SPF 30 సన్‌స్క్రీన్ సరిపోతుంది. కానీ ఎండలో ఎక్కువగా తిరిగే వాళ్లు, ట్రావెలింగ్ చేసే వాళ్లు లేదా అవుట్‌డోర్ వర్క్ చేసే వాళ్లు SPF 60 లేదా అంతకంటే ఎక్కువ ఉన్న సన్‌స్క్రీన్ ఉపయోగించాలి. సన్‌స్క్రీన్ వాడుతున్నామంటే సరిపోదు. సరైన పరిమాణంలో రాయడం చాలా ముఖ్యం. తక్కువగా రాస్తే పూర్తి రక్షణ లభించదు. అందుకే ముఖం, మెడ కలిపి సరైన మోతాదులో అప్లై చేయాలి.

సన్‌స్క్రీన్ ఎలా, ఎంత రాయాలి?

  • ముఖం, మెడకు కలిపి 1/4 టీ స్పూన్ సన్‌స్క్రీన్ లోషన్ అవసరం
  • బయటకు వెళ్లే 20 నిమిషాల ముందే రాయాలి
  • చెమట లేదా నీటికి గురైతే ప్రతి 2–3 గంటలకు మళ్లీ అప్లై చేయాలి
  • చెవులు, మెడ వెనుక భాగం మిస్ కాకుండా రాయాలి
  • మేకప్ వేసుకున్నా సన్‌స్క్రీన్ తప్పనిసరి

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

Rajitha

రచయిత గురించి

Rajitha

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.