మన రోజువారీ ఆహారంలో విటమిన్లు, ప్రోటీన్లు, ఐరన్ వంటి(HealthTips) కీలక పోషకాలు ఉంటాయి. అయితే భోజనం చేసిన వెంటనే టీ తాగే అలవాటు ఉంటే, ఆ పోషకాలు శరీరానికి సరిగ్గా అందకుండా పోయే ప్రమాదం ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. టీలో ఉండే టానిన్లు, పాలీఫెనాల్స్ ఆహారంలోని పోషకాలు శరీరం గ్రహించకుండా అడ్డుకుంటాయి.
Read Also:World Cancer Day 2026: నేడు వరల్డ్ క్యాన్సర్ డే

ఐరన్ లోపం, జీర్ణ సమస్యల ప్రమాదం
టీలోని టానిన్లు ఐరన్‌తో కలిసిపోయి, దాని శోషణను తగ్గిస్తాయి. దీని వల్ల దీర్ఘకాలంలో రక్తహీనత వచ్చే అవకాశముందని చెబుతున్నారు. అలాగే టీలో ఉండే కెఫిన్ జీర్ణక్రియకు అవసరమైన ఎంజైమ్‌ల పనితీరును తగ్గించి, (HealthTips)కడుపు ఉబ్బరం, గ్యాస్, ఎసిడిటీ వంటి సమస్యలకు కారణమవుతుంది.
రోగనిరోధక శక్తిపై ప్రభావం
పోషకాలు పూర్తిగా శరీరంలోకి చేరకపోవడం వల్ల ఇమ్యూనిటీ క్రమంగా తగ్గుతుందని నిపుణుల అభిప్రాయం. అందుకే భోజనం చేసిన వెంటనే కాకుండా, కనీసం 30 నుంచి 60 నిమిషాల తర్వాత టీ తాగడం ఆరోగ్యానికి మంచిదని సూచిస్తున్నారు.
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: