HealthTips: సన్నగా ఉన్నవారికీ అధిక కొలెస్ట్రాల్ ప్రమాదం!

Read Time:  1 min
HealthTips
HealthTips
FONT SIZE
GET APP

సాధారణంగా సన్నగా కనిపించే వారికి ఆరోగ్య(HealthTips) సమస్యలు ఉండవని చాలామంది భావిస్తారు. కానీ నిపుణుల ప్రకారం, శరీరం సన్నగా ఉన్నప్పటికీ రక్తంలో కొలెస్ట్రాల్ స్థాయిలు అధికంగా ఉండే అవకాశం ఉంది. బరువు మాత్రమే కాకుండా ఆహారపు అలవాట్లు, వ్యాయామం లేకపోవడం, మానసిక ఒత్తిడి, అలాగే జన్యుపరమైన కారణాలు కూడా కొలెస్ట్రాల్ పెరగడానికి కారణమవుతాయి.

Read Also:Health Alert: షుగర్ ఉన్నవారికి ప్యాంక్రియాస్ క్యాన్సర్ ముప్పు

HealthTips

ప్రత్యేకంగా ‘బ్యాడ్ కొలెస్ట్రాల్’ (LDL) అధికంగా పేరుకుపోతే రక్తనాళాల్లో అడ్డంకులు ఏర్పడి గుండెపై అదనపు ఒత్తిడి పడుతుంది. దీని వల్ల హార్ట్ అటాక్(HealthTips) వంటి ప్రమాదకర సమస్యలు వచ్చే అవకాశముందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. జంక్ ఫుడ్ ఎక్కువగా తీసుకోవడం, ధూమపానం, మద్యపానం, అలాగే కుటుంబంలో గుండె సంబంధిత వ్యాధుల చరిత్ర ఉండటం కూడా కొలెస్ట్రాల్ పెరుగుదలకు ప్రధాన కారణాలుగా పేర్కొన్నారు. కాబట్టి శరీర ఆకృతి ఎలా ఉన్నా, ఆరోగ్య పరీక్షలు చేయించుకోవడం చాలా ముఖ్యం.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

Pooja

రచయిత గురించి

Pooja

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.