మన శరీర ఆరోగ్యం మొత్తం పేగుల పనితీరుపైనే ఆధారపడి ఉంటుంది. పేగులు ఆరోగ్యంగా ఉన్నప్పుడే మనం తినే ఆహారం సరిగా జీర్ణమవుతుంది. దీంతో శరీరానికి కావాల్సిన పోషకాలు పూర్తిగా అందుతాయి. బలమైన రోగనిరోధక శక్తి, శక్తివంతమైన శరీరం ఉండాలంటే పేగులు చక్కగా పనిచేయాలి. జీర్ణ సమస్యలు తగ్గాలన్నా, మలబద్ధకం రాకుండా ఉండాలన్నా పేగుల ఆరోగ్యం (Health) చాలా అవసరం. అందుకే రోజువారీ ఆహారంలో ఫైబర్ ఎక్కువగా ఉండే పదార్థాలు తప్పనిసరిగా తీసుకోవాలి.
Read also: Depression:ఎక్కువకాలం సింగిల్‌గా ఉంటే మానసిక ఆరోగ్యానికి ప్రమాదం
Consume these to keep your intestines healthy
పేగులు ఆరోగ్యంగా ఉండేందుకు సరైన ఆహారం అవసరం
తాజా పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు పేగుల ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. వీటిలో ఉండే ఫైబర్ పేగుల కదలికలను మెరుగుపరుస్తుంది. రోజుకు 25 నుంచి 30 గ్రాముల ఫైబర్ తీసుకోవడం మంచిది. ఇది జీర్ణాశయంలో మంచి బ్యాక్టీరియాను పెంచుతుంది. దీంతో జీర్ణక్రియ సజావుగా జరుగుతుంది. సరైన ఆహార అలవాట్లతో సహజంగానే పేగుల ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు.
పేగుల ఆరోగ్యానికి మేలు చేసే ఆహారాలు
- ఓట్స్, ఆపిల్స్ – కరిగే ఫైబర్ ఎక్కువగా ఉండి జీర్ణక్రియకు సహాయపడతాయి
- చియా విత్తనాలు – మలబద్ధకం సమస్యను తగ్గిస్తాయి
- బ్రోకలీ, క్యారెట్ – పేగుల కదలికలను మెరుగుపరుస్తాయి
- బీన్స్, తృణధాన్యాలు – మంచి జీర్ణాశయ బ్యాక్టీరియాను పెంచుతాయి
- రాస్ప్బెర్రీస్, బ్లూబెర్రీస్ – యాంటీ ఆక్సిడెంట్లతో పేగులను రక్షిస్తాయి
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: