మనం ఎక్కువగా తీసుకునే పానీయాల్లో కాఫీ ఒకటి. చాలా మంది కాఫీని ఇష్టంగా తాగుతూ ఉంటారు. అలసట నుండి బయటపడడానికి, శరీరానికి ఉత్తేజాన్ని ఇవ్వడానికి కాఫీ (Coffee)ఎంతో సహాయపడుతుంది. కాఫీని తాగడం వల్ల ఒత్తిడి తగ్గి చేసే పనిపై ఏకాగ్రత పెరుగుతుంది. శరీరానికి శక్తిని అందిస్తుంది. ఇలా అనేక రకాలుగా కాఫీ (Coffee)మనకు మేలు చేస్తుందని చెప్పవచ్చు. అయితే కాఫీని తీసుకోవడం వల్ల కొన్ని అనారోగ్య సమస్యలు ఎక్కువవడంతో పాటు కొత్త అనారోగ్య సమస్యలు కూడా తలెత్తే అవకాశం ఉందని వైద్యులు చెబుతున్నారు. కాఫీ తాగడం వల్ల గుండె దడ ఎక్కువయ్యే అవకాశం ఉందని ఇది ఆందోళన స్థాయిలను పెంచుతుందని వైద్యులు సూచిస్తున్నారు. కెఫిన్ శరీరం, మనస్సును ఉత్తేజపరుస్తుంది. నాడీ వ్యవస్థను ప్రభావితం చేస్తుంది. దీంతో మరింత ఆందోళనకు గురవుతారు. అలాగే ఇప్పటికే ఆందోళన ఉన్నవారు కాఫీని తాగడం వల్ల అది మరింత తీవ్రతరం అవుతుంది. అలాగే జీర్ణ సమస్యలతో ఇబ్బందిపడే వారు, ఆమ్లత్వం సమస్యను ఎదుర్కొనే వారు కాఫీ తాగడం పట్ల జాగ్రత్త వహించాలి. కాఫీ తాగడం వల్ల యాసిడ్ రిఫ్లెక్స్ మరింత ఎక్కువవుతుంది. పేగుల సున్నితత్వం పెరుగుతుంది. ఆహారం జీర్ణమవ్వడం కష్టమవుతుంది. జీర్ణవ్యవస్థతో మొత్తం శరీర ఆరోగ్యం అనుసంధానమై ఉంటుంది కనుక మొత్తం ఆరోగ్యం ప్రభావితమవుతుంది. అదేవిధంగా గర్బిణీలు కూడా కాఫీని తీసుకోకపోవడమే మంచిది అని వైద్యులు చెబుతున్నారు. కెఫిన్ పిండం పెరుగుదలను ప్రభావితం చేస్తుంది. కాఫీ తాగడం వల్ల శిశువు తక్కువ బరువుతో పుట్టడం, గుండె, జననేంద్రియ లోపాలు, న్యూరో సమస్యలు రావడం వంటివి కూడా జరుగుతాయని వైద్యులు తెలియజేస్తున్నారు.
Read Also : PositiveEnergy: వంటగదిలో వాస్తు దోషాలు

ఇక అధిక రక్తపోటు, గుండె సమస్యలతో బాధపడే వారు కూడా కాఫీని తీసుకోకపోవడమే మంచిదని వారు సూచిస్తున్నారు. కాఫీ తాగడం వల్ల రక్తపోటు మరింత పెరుగుతుంది. కెఫిన్ అడ్రినలిన్ విడుదలను ప్రేరేపిస్తుంది. ఇది గుండె మరింత వేగంగా కొట్టుకునేలా చేస్తుంది. దీంతో రక్తపోటు కూడా పెరుగుతుందని రక్తనాళాలు కూడా ప్రభావితం అవుతాయని వారు చెబుతున్నారు. ఇవన్నీ కూడా కాలక్రమేణా గుండె సమస్యలకు దారి తీస్తాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. అంతేకాకుండా కాఫీ తాగడం వల్ల శరీరం ఇన్సులిన్ కు ప్రతిస్పందించే సహజ సామర్థ్యాన్ని కూడా కోల్పోతుందని వారు తెలియజేస్తున్నారు. కనుక మనం తాగే కాఫీ మన శరీరానికి శక్తి ఇచ్చేదిగా ఉండాలే తప్ప అనారోగ్యాన్ని కలిగించేదిగా ఉండకూడదని వైద్యులు చెబుతున్నారు. కనుక కాఫీ తాగే వారు వారి ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని కాఫీని తాగాలా వద్దా అని నిర్ణయించుకోవాలి. అలాగే ఆరోగ్యవంతులు కూడా కాఫీ తాగినప్పటికీ అది మితంగా ఉండేలా చూసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: