Blood Pressure: హై బీపీ నిర్లక్ష్యం చేస్తే ప్రాణాలకు ముప్పు

Read Time:  1 min
Blood Pressure
Blood Pressure
FONT SIZE
GET APP

అధిక రక్తపోటు (Blood Pressure) వల్ల గుండె, మెదడు, మూత్రపిండాలు, కళ్ల వంటి కీలక అవయవాలు తీవ్రంగా దెబ్బతినే ప్రమాదం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. బీపీ నియంత్రణలో లేకపోతే దీర్ఘకాలిక సమస్యలతో పాటు అకస్మాత్తు ప్రాణాపాయం కూడా ఎదురయ్యే అవకాశం ఉందని తెలిపారు.

Read Also:Women Health: ఆస్టియోపోరోసిస్‌ ముప్పు వారికే ఎక్కువ

Blood Pressure

ఈ లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్య సహాయం

బీపీ(Blood Pressure) అధికమయ్యే సమయంలో తల తిరగడం, నడిచేటప్పుడు తూలిపోవడం, బ్యాలెన్స్ కోల్పోవడం వంటి లక్షణాలు కనిపిస్తే ఆలస్యం చేయకుండా వెంటనే డాక్టర్‌ను సంప్రదించాలని వైద్యులు సూచిస్తున్నారు. ఈ లక్షణాలను నిర్లక్ష్యం చేయడం ప్రమాదకరమని హెచ్చరించారు. వైద్యుల సలహా లేకుండా సొంతంగా బీపీ మందులు వాడడం అత్యంత ప్రమాదకరమని డాక్టర్లు స్పష్టం చేస్తున్నారు. ఇటీవల ఓ రోగి తానే నిర్ణయించుకుని బీపీ మాత్రలు తీసుకోవడంతో అతడు కోమా స్థితికి చేరుకున్న ఘటనను వైద్యులు ఉదాహరణగా తెలిపారు.

బ్రెయిన్ స్టెమ్‌కు రక్త సరఫరా నిలిచిన ఘటన

ఆ రోగికి నిర్వహించిన స్కాన్‌లో మెదడులోని బ్రెయిన్ స్టెమ్‌కు రక్త ప్రవాహం ఆగిపోయినట్లు తేలిందని వైద్యులు వెల్లడించారు. బ్రెయిన్ స్టెమ్ శ్వాస, గుండె స్పందన వంటి అత్యంత కీలక విధులను నియంత్రిస్తుందనగా, అక్కడ రక్త సరఫరా నిలిచిపోవడం వల్ల పరిస్థితి తీవ్రమైందని వివరించారు.

Read hindi news : hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read Also:

Pooja

రచయిత గురించి

Pooja

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.