हिन्दी | Epaper
అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం నేటి బంగారం ధర బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! భారీగా ఇండిగో విమానాలు రద్దు కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం నేటి బంగారం ధర బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! భారీగా ఇండిగో విమానాలు రద్దు కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం నేటి బంగారం ధర బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! భారీగా ఇండిగో విమానాలు రద్దు కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం నేటి బంగారం ధర బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! భారీగా ఇండిగో విమానాలు రద్దు కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్

నల్ల మిరియాలు తినడం వల్ల ఎన్ని లాభాలో తెలుసా!

Anusha
నల్ల మిరియాలు తినడం వల్ల ఎన్ని లాభాలో తెలుసా!

భారతీయ వంటగదిలో మిరియాలు కచ్చితంగా ఉంటాయి. ఇది కేవలం రుచిని మాత్రమే కాదు, అనేక ఆరోగ్య ప్రయోజనాలను కూడా అందిస్తుంది. దీనిలో ఐరన్, మాంగనీస్, పొటాషియం, కాల్షియం, విటమిన్‌ సి వంటి పోషకాలు అధికంగా ఉండటంతో, శరీరానికి అనేక రకాలుగా మేలు చేస్తాయి. ప్రతి రోజూ రెండు మిరియాలను తినటం వల్ల ఆరోగ్యంపై కలిగే ప్రయోజనాలను వివరంగా తెలుసుకుందాం.

రోగనిరోధక శక్తి పెరుగుతుంది

నిత్యం రెండు నల్ల మిరియాల గింజలను తినడం వల్ల శరీర రోగనిరోధక శక్తి పెరుగుతుంది. వైరస్‌లు, బ్యాక్టీరియాల వల్ల కలిగే ఇన్‌ఫెక్షన్లను నిరోధించడంలో మిరియాలు కీలక పాత్ర పోషిస్తాయి. ముఖ్యంగా జలుబు, దగ్గు, గుండె జబ్బులు, శ్వాసకోశ సమస్యలను తగ్గించడంలో ఇవి సహాయపడతాయి.

గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది

నల్ల మిరియాలలోని యాంటీఆక్సిడెంట్లు గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడతాయి. మిరియాలు తీసుకోవడం వల్ల రక్తనాళాల్లో కొవ్వు గడ్డకట్టకుండా ఉంటాయి. దీనివల్ల గుండెపోటు, హై బిపి వంటి సమస్యలు రాకుండా ఉండే అవకాశం ఉంటుంది.

శరీర కొవ్వును తగ్గించడంలో సహాయపడుతుంది

నల్ల మిరియాలలో పైపెరిన్ అనే సమ్మేళనం ఉండటం వల్ల ఇది శరీరంలోని కొవ్వును కరిగించడంలో సహాయపడుతుంది. బరువు తగ్గాలనుకునే వారు మిరియాలను తమ ఆహారంలో చేర్చుకోవడం వల్ల మెటబాలిజం వేగంగా పనిచేస్తుంది.

జీర్ణక్రియను మెరుగుపరిచే మిరియాలు

ఫైబర్ అధికంగా ఉండే నల్ల మిరియాలు జీర్ణక్రియను మెరుగుపరచడంలో సహాయపడతాయి. గ్యాస్ సమస్య, మలబద్ధకం, గ్యాస్ట్రిక్ సమస్యలను తగ్గించడంలో ఇది ఎంతో ఉపయోగకరం.

black pepper 500x500

లక్షణాలు

నల్ల మిరియాలలోని యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు కీళ్ల నొప్పులు, వాపులను తగ్గించడంలో సహాయపడతాయి.

క్యాన్సర్‌ను నిరోధించడంలో సహాయపడుతుంది

నల్ల మిరియాలలోని యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ క్యాన్సర్ గుణాలు కొంతవరకు క్యాన్సర్ వ్యాప్తిని అడ్డుకోవచ్చని పరిశోధనల్లో తేలింది. ముఖ్యంగా బ్రెస్ట్ క్యాన్సర్‌ను నిరోధించడంలో మిరియాలు సహాయపడతాయని నిపుణులు చెబుతున్నారు.

మెదడు ఆరోగ్యాన్ని కాపాడుతుంది

నల్ల మిరియాలు మానసిక ఒత్తిడిని తగ్గించడంలో ఉపయోగపడతాయి. శరీరంలో సెరోటోనిన్ హార్మోన్ ఉత్పత్తిని పెంచడం ద్వారా డిప్రెషన్, ఆందోళన సమస్యలను తగ్గించగలవు.

రక్త ప్రసరణను మెరుగుపరచడం

నల్ల మిరియాలు రక్త ప్రసరణను మెరుగుపరిచే గుణాలను కలిగి ఉంటాయి. శరీరంలోని ప్రతి అవయవానికి సరిపడా ఆక్సిజన్, పోషకాలను అందించేందుకు ఇది సహాయపడుతుంది.

చర్మ, జుట్టు ఆరోగ్యానికి మిరియాలు

యాంటీ బాక్టీరియల్ లక్షణాలు ఉన్న మిరియాలు చర్మానికి ఎంతో మేలు చేస్తాయి. నల్ల మిరియాలను ఉపయోగించడం వల్ల చుండ్రు, జుట్టు రాలడం, ఫంగల్ ఇన్ఫెక్షన్లు తగ్గుతాయి.

నిత్యం రెండు మిరియాలను తీసుకోవడం ద్వారా అనేక ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. అయితే అధికంగా తీసుకోవడం వల్ల కొన్ని దుష్ప్రభావాలు కలిగే అవకాశం ఉంటుంది. కాబట్టి మితంగా తీసుకోవడం మంచిది.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870